Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు అరెస్టు తప్పదు

– బాబు స్కాములపై అన్ని అధారాలూ ఉన్నాయి
– సుప్రీం తీర్పుతో విచారణ మరింత సులభతరం
– స్కాములపై విచారణను టీడీపీ ఛాలెంజ్‌ చేయడమే ఒక దుస్సాహసం
– చంద్రబాబు అండ్‌ కో.. ఎందుకంత భయపడ్డారు..?
– దేశంలోనే అతిపెద్ద లాండ్‌ స్కాం అమరావతి.
– అమరావతిలో అవినీతి దేశంలోనే ఒక కేస్‌ స్టడీ
– అరెస్ట్‌ చేస్తే ప్రతిపక్షాలపై వేధింపులు అంటారు…
– లేదంటే ధైర్యం ఉందా.. అని తొడలు కొడతారు..!
– మరి, ఏం పీకుతామని భయపడి మీరు కోర్టుకు వెళ్లారు..?
– వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు:
చంద్రబాబు అవినీతికి సంబంధించిన కేసుల్లో.. భారత ఉన్నత న్యాయస్థానం ఏ దృక్కోణం నుంచి చూడాలో అలానే చూసినట్లుంది.ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాలపై సమీక్ష జరపొచ్చా లేదా అనే ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. రాజకీయంగా పార్టీలు కూడా వాళ్ళ విధానాల ప్రకారం తీసుకునే నిర్ణయాలు ప్రజలపై రకరకాలుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు విలువలు, ఆదర్శాలన్నింటినీ వదిలేసిన నేపథ్యంలో.. వారి స్వార్ధపూరిత నిర్ణయాలను సమీక్షించే అవకాశం ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. విధాన పరమైన నిర్ణయాలు పట్టించుకోకుండా ఉన్నా అదీ నష్టం కలిగించే అవకాశం ఉంది.ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు, రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పుడు దాన్ని సమీక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా జరిగి తీరాలి.

తొందరపాటుగా, మా ప్రభుత్వం రాగానే కక్ష్యపూరితంగా చేసి ఉంటే దాన్ని ప్రశ్నించవచ్చు. న్యాయస్థానం అలాంటి వాటిపై ఏదైనా నిర్ణయం ఇచ్చి ఉంటే ఒప్పుకోవచ్చు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టప్రకారం.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములపై ఒక సబ్‌ కమిటీ వేశాం. చర్చలు చేశాం..దాని నివేదికను శాసనసభలో కూడా పెట్టి చర్చించాం. దానిపై శాసనసభ స్పీకర్‌ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరం అన్న తర్వాత ఏర్పడిందే సిట్‌ లోతుగా, విస్తృతంగా విచారించాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత విశాల దృక్పథంతో తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వారు ఛాలెంజ్‌ చేయడమే ఒక దుస్సాహసం. దానిలోనే వారు ఎక్కడ దొరికిపోయి ప్రజల ముందు దోషులుగా నిలబడతామో అన్న భయం కనిపిస్తోంది. కేంద్ర ఎజెన్సీలతో సమాచారం షేర్‌ చేసుకుని జరుగుతున్న విచారణలో వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వారు న్యాయస్థానాలకు వెళ్లి, సాంకేతిక కారణాలు చూపి, వారికున్న లిటిగేషన్‌ స్వభావాన్ని చూపారు. దాన్ని ఈ రోజు సుప్రీం కోర్టు కొట్టేసింది.

చంద్రబాబు అండ్‌ కో.. ఎందుకంత భయపడ్డారు..?:
అమరావతిలోని రింగ్‌రోడ్డు, అసైన్డ్‌ భూముల విషయంలో విడివిడిగా ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోంది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక.. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే విధంగా గత టీడీపీ ప్రభుత్వం చేసిన కుట్రలను బహిర్గతం చేసే ప్రయత్నం కొనసాగుతుంది. చంద్రబాబు, ఆయన దొంగల ముఠా అసలు ఎందుకంతగా భయపడ్డారనేది ఆలోచించాల్సిన అంశం.లోతుల్లోకి వెళితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సుప్రీం తీర్పుతో మరింతగా విచారణ సులభతరం కావచ్చు. దేశంలోనే అతిపెద్ద లాండ్‌ స్కాం ఏదైనా ఉందంటే అది అమరావతి ప్రాంతంలో జరిగిందేనని పూర్తిగా ప్రూవ్‌చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ఏమీ లేకపోతే వారు భయపడటం ఎందుకు..? చాలెంజ్‌ చేయడం ఎందుకు..? విచారణ చేసుకోండి అనొచ్చుగా.. హడావుడిగా వెళ్లి స్టే తెచ్చుకోవడం ఎందుకు..? రింగ్‌ రోడ్డు, అసైన్డ్‌ ల్యాండ్స్, ఫైబర్‌ నెట్‌ లాంటి అంశాలపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కాం ఇప్పటికే బయటకు వచ్చింది. చంద్రబాబునాయుడు ఎప్పుడు అరెస్ట్‌ అవుతారో కూడా తేలాల్సి ఉంది.ఆయన సంతకంతోనే అసలు లేని కంపెనీకి వందల కోట్లు పంపినట్లు నిరూపణ అయ్యింది. దొరకకపోవడం ఏమీ లేదు. అన్నిటిలోనూ దొరుకుతూనే ఉన్నారు.అమరావతిలో జరిగిన స్కాం… చిన్న పిల్లాడ్ని అడిగినా చెప్తారు.

అమరావతి అవినీతి దేశంలోనే ఒక కేస్‌ స్టడీ
అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాల భూముల సేకరణ విషయంలో.. ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, తన కోటరీ ద్వారా తరతరాలుగా తరగని సంపద కోసం ఒక రియల్‌ ఎస్టేట్‌ స్కాం కింద ఆ ప్రాజెక్టును మార్చారు.దానికి ఒక పెద్ద రాజధాని అని పేరు పెట్టి ఈరోజు కూడా దాన్ని నిలుపుకునేందుకు కృత్రిమ ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు.అందులో ఎక్కడ టచ్‌ చేసినా అవినీతి తప్ప ఏమీ కనిపించదు. ఆ అవినీతి దేశంలోనే ఒక కేస్‌ స్టడీగా కూడా పనికివస్తుంది. పట్టుకుని అరెస్ట్‌ చేస్తే మామీద వేధింపులు అంటారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను బతకనివ్వడం లేదు అని నిందలు మోపుతారు. లేదంటే మీకు ధైర్యం ఉందా.. అంటూ తొడలు కొడతారు.జగన్‌ కక్షసాధింపు అనడానికి కూడా అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా విచారణలు కొనసాగిస్తున్నారు.చూసే వారికి అది స్లోగా కనిపించవచ్చు..వాళ్లలా కక్ష్య సాధింపుతో పోవడం లేదు. కానీ బయటకు ఏదన్నా రాకపోతే కదా..? తొందరపడటం దేనికి..? లాజికల్‌ ఎండ్‌కి వెళ్లిన తర్వాత అరెస్టులు కూడా జరుగుతాయి.అదే, చంద్రబాబునాయుడికి ఇలాంటి అవకాశం వస్తే కనీసం కాగితం బయటకు రాకముదే అరెస్టు చేసేవాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, తండ్రీ కొడుకుల బిహేవియర్‌లో తేడా కనిపిస్తోంది.

ఏం పీకుతారని భయపడి కోర్టుకు వెళ్లావు..?
వాళ్ళలో ఒక పక్క భయమూ ఉంది..మరో వైపు బింకంగా మాట్లాడుతున్నారు. పైకి మాత్రం ఏం పీకుతారు అని అంటున్నారు.. ఏం పీకుతారని నువ్వు భయపడి కోర్టుకు వెళ్లావు..? నీ హక్కులకు భగం కలగదు కదా…విచారణను ఎదుర్కొవాల్సింది.ఇప్పుడు కోర్టు కూడా స్టే తీసేసింది కదా..ఇప్పడన్నా ధైర్యంగా విచారణను ఎదుర్కొండి.ఎన్నికల నాటికి ఈ అంశాలపై వాస్తవాలు తెలుస్తాయి…వాటిని మేం ప్రజల ముందుకు కూడా తీసుకెళ్తాం. చట్టపరంగా చేయాల్సింది కూడా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. కక్ష సాధింపు అయితే ఇంకా ఏమేం దొరుకుతాయి అనే అంశం ఉంటుంది. కానీ స్పష్టంగా కన్పిస్తున్న అంశాలపైనే విచారణ కొనసాగుతోంది. ప్రాధమిక సాక్ష్యాలు ఉన్న వాటిపైనే విచారణ సాగుతోంది. ఒక వేళ కొత్తవి ఉంటే అవి తర్వాత రావచ్చు.

మా ప్రయత్నం రాజకీయం కోసం మాత్రం కాదు. సీరియస్‌గా అవినీతిపై జల్లెడ పట్టమనే సబ్‌కమిటీ వేశాం. ఒక దశకు వచ్చిన తర్వాత సిట్‌ వేశాం. వారు ఛాలెంజ్‌ చేయకుండా ఫేస్‌ చేసి ఉంటే…అక్కడ ఎటువంటి కుంభకోణం జరగకకుండా ఉండి ఉంటే… వాళ్లకు క్లీన్‌ చిట్‌ వచ్చేది కదా..వాళ్లే టైం వేస్ట్‌ చేశారు. కానీ ఇప్పుడు మొదలవుతుంది. అక్కడ ఆధారలన్నీ ఉన్నాయి.అమరావతికి సంబంధించిన స్కాంలో.. లోతుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ తడిమినా అవినీతి, ఆశ్రితపక్షపాతంపై ఆధారాలు దొరుకుతాయి. లక్షల కోట్లు సంపాదించుకోవాలన్న చంద్రబాబు ఆశ వల్లే ఇదంతా జరిగింది.దానిలో భాగంగా బిల్డింగులు సరిగా కట్టలేదు. తాత్కాలికం అన్నారు. రోజుకో స్కీం అంటూ 30వేల ఎకరాలు పూల్‌చేసి అరచేతిలో స్వర్గం చూపించారు.ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎలాంటి మోసాలు చేస్తాడో.. అలాంటివన్నీ చంద్రబాబు చేశాడు.అక్కడ ఒక వాస్తవ రాజధాని తీసుకురావడానికి అవకాశం లేని స్కీం చంద్రబాబు తీసుకొచ్చాడు.దాన్ని అడ్డు పెట్టుకుని వేలకోట్లు సంపాదించాలని అనుకున్నాడు.జగన్‌ రావడంతో ఆయన ఆశలన్నీ తిరగబడ్డాయి.

కొబ్బరికాయ కొడితే పనులెందుకు ప్రారంభం కాలేదు.?:
భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి చంద్రబాబు అసలు ఏం చేశాడు..? ఆ టెండర్లు ఎందుకు కొనసాగించలేదు..? భూసేకరణ ఎందుకు పూర్తి చేయలేదు..?ఎవరైన పనిమొదలు అయ్యేటప్పుడు కొబ్బరి కాయ కొడతారు.. కానీ చంద్రబాబు కొబ్బరి కాయ కొట్టినప్పుడు పని ఎందుకు ప్రారంభం కాలేదు..? అలా అయితే అక్కడ ఏదో ఒక బిల్డింగో, ఎయిర్‌పోర్టో రావాలి కదా..?ఇన్ని రోజులుగా న్యాయపరంగా ఉన్న చిక్కులను మా ప్రభుత్వం ఫేస్‌ చేయాల్సి వచ్చింది.అప్పుడు పిలిచిన టెండర్లు ఎందుకు క్యాన్సిల్‌ చేశారు.. భోగాపురం ఎయిర్‌పోర్టే కాదు తనకంటే ముందు ప్రభుత్వాలు చేసినవి కూడా తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. రాజీవ్‌ గాంధీ విమానశ్రయం విషయంలో రామోజీ ఫిలిం సిటీ వైపు ధరలు పెరుగుతాయా లేదా అని చంద్రబాబు కాలయాపన చేశాడు.దివంగత రాజశేఖరరెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశారు. పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌ హైవేను కూడా రాజశేఖరరెడ్డి గారే పూర్తి చేశారు. చంద్రబాబు దృష్టిలో శంకుస్థాపన అంటే పని కూడా మొదలు పెట్టడకపోవడమే. ఎన్నికలు వస్తున్నాయంటే.. నాలుగు కొబ్బరి కాయలు కొట్టడం తప్ప ఏమీ చేయడు.

బాలినేని అంశం మా పార్టీ అంతర్గత వ్యవహారం
బాలినేని విషయం మా పార్టీ అంతర్గత వ్యవహారం. వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అంతర్గతం. బాలినేని స్పష్టమైన కారణం చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. వైఎస్సార్సీపీలో ఏదో ఒక డిస్టర్బెన్స్‌ క్రియేట్‌ చేయాలని ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా ప్రయత్నం చేస్తోంది. టీ కప్పులో తుఫాను కాదు కదా.. అందులో టీ కూడా లేదు.

చంద్రబాబునే తిట్టాడేమో… ఎవరికేం తెలుసు?
చంద్రబాబు..రజనీకాంత్‌కి ఫోన్‌ చేస్తే ఏదో అన్నాడట..అంతకంటే అన్యాయమైన వార్త ఏముంటుంది..? అంతకంటే దివాళకోరు తనం ఏమైనా ఉంటుందా..? చంద్రబాబు, రజనీకాంత్‌ మాట్లాడుకుంటే ఎవరికి తెలుస్తుంది..?రజనీకాంత్‌.. ఎల్లో మీడియా వాళ్లు ప్రచురించిన మాటలే అన్నాడో.. లేక నీవళ్లే నేను తిట్లు తినాల్సి వస్తుందని అన్నాడో..? ఎవరికి తెలుసు. దారిన పోయిన కంపను తగిలించుకున్నట్లుంది.. నీవల్ల బాగా జరిగిందని చంద్రబాబును రజనీకాంత్ తిట్టాడేమో..? అసలు చంద్రబాబు ఫోన్‌చేశాడో లేదో కూడా తెలియదు. ఇలాంటి వార్తలు రాసి, చంద్రబాబును రేపు అధికారంలో కూర్చోబెట్టాలని రామోజీ, రాధాకృష్ణ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌ ఎవరితో మాట్లాడినా.. వీళ్లు ఆ టేబుల్‌ కింద ఉంటారేమో తెలియదు. రజనీకాంత్ అయినా, మోడీ అయినా.. ఎక్కడైనా వాళ్లు ఇలానే చేస్తున్నారు.వాళ్లు ఏది అనుకుంటే అది ఒక కథ రాయడం, జనం మీదకు వదిలి వారిని కన్ఫూజ్‌ చేయడం వాళ్ల పని.

LEAVE A RESPONSE