Home » ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలను భయపెడుతున్న వైసీపీ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలను భయపెడుతున్న వైసీపీ

• వివాదాలను సృష్టించి పేదల ఆస్తులను కొట్టేసేందుకు కుట్ర
• టీఆర్వోలకు సర్వాధికారులు… సివిల్ కోర్టులకు వెళ్లకుండా చేసిన వైనం
• సెక్షన్ 5 ప్రకారం టీఆర్వోలుగా ఎవరినైనా నియమించేలా చట్టం
• వైసీపీ అనుంగులను టీఆర్వోలుగా నియమించుకుని… భూములను కొట్టేసేందుకు యత్నం
• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి

భూ వివాదాలు సృష్టించి భూములను కొట్టేసేందుకు, బ్లాక్ మనీతో కొన్న భూములను చట్ట పరం చేసుకునేందుకు జగన్ రెడ్డి, జే గ్యాంగ్ కొత్త చట్టాన్ని తీసుకు వచ్చి రాష్ట్ర ప్రజలను భయపెడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అన్నారు.

మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…యాక్ట్ నెంబర్ 17-2023న ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక చట్టం తీసుకు వచ్చింది. ప్రజలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వ చేతుల్లోకి తీసుకు వెళ్లే చట్టం ఇది. ఈ చట్టం తేవడంతో ఏ భూ సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు వేళ్లే అవకాశం లేదు. ఏ సమస్య ఉన్నా టీఆర్వో( టైటిల్ రిజస్ట్రేషన్ ఆఫీసర్) దగ్గర వెళ్లమని ఈ చట్టం చెబుతుంది. మరో వైపు ఏ వ్యక్తినైనా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించుకోవచ్చని చెబుతుంది.

ఏ మాత్రం అర్హత లేకపోయినా వైసీపీతో తిరిగిన వాళ్లకు ఇష్టం వచ్చినట్లు సలహాదారులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, ఇతర కీలక పదవులు కట్టబెట్టారు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్ట్ చాలా కీలకమైనిది. భూపరమైన ఏ సమస్య వచ్చినా ఆ ఆఫిసర్ దగ్గరకు వెళ్లాలి. సెక్షన్ 5 ప్రకారం వైసీపీ అనుకూలంగా ఉన్న వ్యక్తికి టైటిలింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగిస్తే.. పేదలకు కాని, ప్రతి పక్ష నేతలకు న్యాయం జరుగదు.

భూముల కబ్జాకు వైసీపీ నేతలే వివాదాలను సృష్టించి మళ్లీ వైసీపీ అనుకూలంగా ఉన్న అధికారి(టీఆర్వో) దగ్గరకు వెళ్లినా దాన్ని తేల్చకుండా ఉంచి సెటిల్ మెంట్ పేరుతో దండుకోవడానికి వైసీపీ నేతలు చేస్తున్న కుట్ర ఇది. సివిల్ కోర్టుకు వెళ్లకుండా చేశారు. నేరుగా హైకోర్టుకు సామాన్య ప్రజలు వెళ్లగలరా? ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన

టైటిల్ రిజిస్టర్, డిస్ప్యూట్ రిజిస్టర్ అని పెట్టారు. ఒక్కసారి ఆ భూమి డిస్ప్యూటర్ రిజిస్టర్ లోకి ఎక్కితే ఇక ఆ భూ యజమాని ఆ టీఆర్వో అధికారి చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది అతను నిరూపించుకోవాలి. సెక్షన్ 19,20,21 లు ఈ సెక్షన్ లు ఏం చెబుతున్నాయంటే… సెక్షన్ 18 ప్రకారం రాష్ట్రంలో భూ వివాదంలో ఉన్న ఏ కేసు అయినా ఖచ్చితంగా 3 నెలల్లో ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీ, జైలు శిక్ష వేస్తారంట. అంతే కాకుండా ఆ భూమిని ఇక టైటిల్ రిజిస్టర్ లో నమోదు చేయరు.

సెక్షన్ 19 ప్రకారం ఆస్తులపై ట్రాన్సాక్షన్ జరిగినా ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుంది. అది చెప్పకుంటే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తారని ఈ సెక్షన్ చెబుతుంది. సెక్షన్ 20 ప్రకారం బ్యాంకుల్లో భూములు తాకట్టు పెట్టిన వివరాలు, ఎంత వడ్డీకి ఇచ్చింది కూడా టైటిలింగ్ ఆఫీసర్ కు మూడు నెలల్లో చెప్పాలి. సెక్షన్ 21 ప్రకారం రాష్ట్రంలో ఉన్న కంపెనీలు బ్యాంకుల్లో ఏ ఆస్తి తాకట్టు పెట్టినా టైటిలింగ్ ఆఫీసర్ కు చెప్పాలి. ఏ ట్రాన్సాక్షన్ జరిగినా తెలియాలి.

ఈ టైటిలింగ్ యాక్ట్ ను ఎందుకు తీసుకు వచ్చారంటే ? వైసీపీ నేతలు బ్లాక్ మనీతో కొనుగోలు చేసిన భూములను చట్ట పరం చేడానికి, పేదల భూములు లాక్కోవడానికి, ఇక ప్రతి నియోజవర్గంలో ఉన్న వైసీపీ గుండాలు భూ వివాదాలు సృష్టించి భూములను కొట్టేసేందుకు.

మరో వైపు దీన్ని అమలు చేయడంలేదని, ఇది మా చట్టం కాదని కేంద్ర చట్టం అని మంత్రి ధర్మాన మాట్లాడటం సిగ్గుచేటు. సెక్షన్ 1 ఇది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని క్లియర్ గా చెబుతున్నా మళ్లీ దాన్ని కేంద్రంపైకి నెట్టాలనుకోవడం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమే. అది కేంద్ర పరిధిలోని చట్టం అయితే దాన్నిఅమలు చేయడానికి అసలు మీరు ఎవరు?

నేటి నుండి ఈచట్టం అమల్లోకి వచ్చింది. ఇక వైసీపీ నేతలు భూ వివాదాలు సృష్టించి ఆ భూములను కొట్టసే పనిలో ఉంటారు. ఈ చట్టంతో ఎక్కువగా ఎన్నారైలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పేదలు, రైతులు నష్టపోతారు. ఇక రెండు సంవత్సరాల్లో నిరూపించుకోకుంటే టీఆర్వో క్లైమ్ చేసిన వ్యక్తికి భూమిపై హక్కులు కల్పిస్తారు. భూ యజమానులు ఇక ఏమి చేయలేని పరిస్థితి ఉంటుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అన్నారు

Leave a Reply