Home » స్క్రిప్ట్ చదువుతూ చక్కగా అబద్దాలు చెప్పిన జగన్

స్క్రిప్ట్ చదువుతూ చక్కగా అబద్దాలు చెప్పిన జగన్

-సంపదను సృష్టించడంలో జగన్ రెడ్డి పూర్తిగా విఫలం
-చంద్రబాబు పాలనలో 100 శాతం అభివృద్ధి… జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 66 శాతం మాత్రమే వృద్ధి
-ప్రతి నెల 9 వేల కోట్ల సంపదను సృష్టించలేక అప్పులపై ఆధారపడిన జగన్ రెడ్డి
-ఏపీ అప్పులపై జగన్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కాగ్
-సంపద సృష్టికి చంద్రబాబు ట్రేడ్ మార్క్… అప్పులు చేయడంలో ట్రేడ్ మార్క్ గా జగన్ రెడ్డి
-రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడిన చంద్రబాబు… సొంత కంపెనీల షేర్ల విలువను పెంచుకున్న జగన్ రెడ్డి
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

జగన్ రెడ్డి తన మేని ఫెస్టో విడుదలు చేస్తూ చంద్రబాబుపై ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ చంద్రబాబుకు సంపద సృష్టించడం రాదని, చంద్రబాబు పరిపాలనలో రెవెన్యూలోటు ఎక్కువగా ఉందని, చంద్రబాబు పాలనలో జీడీపీలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ఇది ఎలా ఉందంటే దొంగే తిరిగి పోలీసును దొంగ దొంగ అన్నట్లు ఉంది.

ప్రతి నెల 9 వేల కోట్ల సంపదను సృష్టించుకోలేని స్థితిలో ఉండి.. ఆదాయం ఏమాత్రం పెరగని స్థితిలో ఉండి, అప్పుల మీదే ఆధారపడే జగన్ రెడ్డి చంద్రబాబుకు సంపద సృష్టి రాదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో జరగని పని సంపదను సృష్టించడం ఒక్కటే. కాగ్ లెక్కలు చూసినా జగన్ కు ఇది తెలిసేదేమో.

అప్పులు చేస్తూ ఆర్థికంగా సూపర్ అంటున్నారు. జీఎస్డీపీ పెరిగిందంటున్నారు. అక్కడ జీఎస్డీపీ ఆదాయం కాని సెల్స్ ట్యాక్స్ ఆదాయం కాని ఏదీ పెరగలేదు. ఒక్క ఎక్సైజ్ ఆదాయం తప్పా. కొత్త పరిశ్రమలు కనిపించవు. టీడీపీ సాధించిన ఆదాయ వృద్ధి రేటుతో పోలిస్తే వైసీపీ దాని దరిదాపుల్లో కూడా నిలవదు. అయినా గొప్పలు చెప్పుకుంటున్నారు. పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నామంటున్నారు. కాగ్ ఏమో రాజ్యంగంకు విరుద్ధంగా అప్పులు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వానికి మొట్టకాయలు వేస్తుంది. అప్పులలో మునిగి తేలుతుంటారు. అయినా టీడీపై విమర్శలు చేస్తున్నారు.

కేంద్రం నుండి అప్పులు తెచ్చుకోవడం ఎవరైనా చేస్తారు. రాష్ట్ర పనితనాన్ని చూపించేది రాష్ట్ర ఆదాయం. 2014లో పూర్తిగా లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు అధికారం చెప్పట్టారు. మొదటి సంవత్సరంలో రూ. 29,857కోట్లు ఆదాయం ఉంటే దాన్ని 2019 నాటికి 58,091 కోట్లకు పెంచారు. అంటే దాదాపు 98శాతం వృద్ధి రేటును సాధించారు. రాష్ట్ర సొంత ఆదాయంలో 18.76 శాతం గ్రోత్ ఉంది. సంపదను సృష్టించడం చంద్రబాబుకు చేతకాదని చెప్పిన జగన్ రెడ్డి గత ఐదేళ్లో సాధించిన వృద్ధి రేటు కేవలం 66 శాతం మాత్రమే. సంపద సృష్టించడం చేతగాక 100 శాతం వృద్ధిని సాధించిన టీడీపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. కాగ్ నివేదికలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి.

సంపదసృష్టికి చంద్రబాబు ట్రేడ్ మార్క్ లాంటి వ్యక్తి. విజన్ అనేది ఆయన పేటెంట్ జగన్ రెడ్డి దగ్గరకు కూడా రాలేరు. ఎకనామిక్ ప్లాన్ అనేది చంద్రబాబు నైజం, ముందు చూపు అనేది ఆయన నైపుణ్యత. జగన్ రెడ్డి సంపను సృష్టించలేరు. జగన్ రెడ్డికి ముందు చూపు లేదు. కాని జగన్ రెడ్డికి కంపెనీలను పెట్టి దాని షేర్లను అమాతం పెంచుకోవడం తెలుసు.

నేను, నాకొరకు, నాకోసం అనేదే జగన్ రెడ్డి ఆలోచన. చంద్రబాబు మాత్రం ప్రజల కొరకు ప్రజల కోసం, ప్రజల చేత అని ఆలోచిస్తారు. ప్రజల కోసం రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలని ఆలోచిస్తారు. వ్యక్తిగత సంపద ముఖ్యం అనుకుంటే చంద్రబాబు అంబానిని దాటిపోయేవాడు. చంద్రబాబు రాష్ట్ర సంపదే ముఖ్యం అనుకున్నాడు. జగన్ రెడ్డి తన కంపెనీల కోసం మాత్రమే శ్రమ పడ్డారు.

జగన్ రెడ్డి కూల్చివేతలు పర్వం చేపట్టి రాష్ట్రానికి సంపదను సృష్టించడంలో విఫలం అయ్యాడు. టీడీపీ కంటే రూ. 55 వేల కోట్లు లిక్కర్ ఆదాయం సంపాదించారు. టీడీపీ హయాంలో రూ. 72 వేల కోట్ల లిక్కర్ ఆదాయం వస్తే.. వైసీపీ పాలనలో రూ. 1లక్ష 22 వేల కోట్లు లిక్కర్ ఆదాయం వచ్చింది. మద్యపాన నిషేధమని చెప్పి మధ్యం మీదే జగన్ రెడ్డి ఆదాయం సంపాదించారు. భూముల ధరలను పెంచారు.

దేశంలోనే అత్యధికంగా డీజిల్ పెట్రోల్ ధరలను పెంచారు. అధిక మొత్తంలో అప్పులు తీసుకుని పెట్టుబడులకు పెట్టింది కేవలం 30 శాతం మాత్రమే. నాడు తీసుకున్న అప్పుల్లో సగానికి పైగా పెట్టుబడులపై ఖర్చు చేసింది. విభజన చట్టంలో 2014 -15 లో రావాల్సిన డబ్బులు రూ. 10,800 కోట్లను కూడా మీరే తీసుకుని మళ్లీ టీడీపై విమర్శలు చేయడం సిగ్గు చేటు

2014 -19 ఏపీ యావరేజ్ గ్రోత్ 10.36 అప్పటి వరకు ఆంధ్రప్రేశ్ చరిత్రలో అదే ఎక్కువ. సంక్షోభంలో ఉన్న రాష్ట్రన్ని అత్యధిక గ్రోత్ సాదించి రికార్డ్ స్థాయిలో నిలబెట్టారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టి దాన్ని దిగజార్చి మళ్లీ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అసత్యాలు అబద్దాలు చెబుతూ.. రాష్ట్ర ప్రజను అప్పుల ఊబిలో ముంచి.. వైసీపీ అనుంగ కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచి పెట్టి మళ్ళీ చంద్రబాబుకు సంపదను సృష్టించడం చేతకాదని చెప్పడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు.

Leave a Reply