Suryaa.co.in

Andhra Pradesh

ఇంట్లో కుక్క ఉంటే జగన్ దానికి కూడా పన్ను వేస్తాడు

-గాలి పీల్చుతున్నారా పన్ను కట్టండని చెప్తారు
-9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడు
-3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు
-ఇక్కడ డమాబుస్ ఎమ్మెల్యేను గెలిపించారు
-ఐదేళ్లలో ఈ డమాబుస్ ఎమ్మెల్యే రూ.1000 కోట్లు సంపాదించుకున్నాడు
-కొడుకు పెళ్లి కోసం రూ.1.30 కోట్లు వసూలు చేశాడు
-ఇసుకలో రూ.300 కోట్లు కొట్టేశాడు
-ఆఖరికి చెత్తపన్ను కూడా వేశాడు
-వారి పేర్లు కూడా పుస్తకంలో రాశాను… ఎవర్నీ వదలను
-సూపర్-6 ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-సీనియర్లను గౌరవిస్తా…కొత్తవారిని ప్రోత్సహిస్తా
-ఆముదాలవలస శంఖారావం సభలో యువనేత లోకేష్

ఉత్తరాంధ్ర ఊపు అదిరింది. ఉత్తరాంధ్ర అంటే విప్లవం..ఆ విప్లవం ప్రారంభమైంది. మరో రెండు నెలల్లో తాడేపల్లి తలుపులు పగలడం ఖాయం. సిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తోంది. ఈ రోజు ప్రతి టీడీపీ కార్యకర్తలో ఒక సింహాన్ని చూస్తున్నా. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతుల లచ్చన్న, రాజగోపాల్, ఎర్రన్నాయుడులాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన భూమి ఈ శ్రీకాకుళం జిల్లా.

ఈ ప్రభుత్వాన్ని చూశాక ఒకటి అర్థమైంది…జగన్ పని ఇక అయిపోయింది. ఈ మాట సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఎన్నికల ముందు 25కు 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తా అన్నాడు. ఇప్పుడు 22 మంది ఎంపీలున్నారు..9మంది రాజ్యసభ సబ్యులున్నారు. మొత్తం 31 మంది ఎంపీలుంటే హోదా తెచ్చాడేమో ప్రజలు ఆలోచించాలి.

31 మంది ఎంపీలను ఢిల్లీలో తాకట్టు పెట్టి కేసులు నుండి తప్పించుకుంటున్నారు. డిల్లీకి వెళ్లతే ఆరుగురు ఎంపీలు మాత్రమే ఆయనతో ఉన్నారు. జగన్ తో ఉంటే ప్రజలు ఓట్లేయరని సొంత ఎంపీలే బాయ్ బాయ్ జగన్ అంటున్నారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు… జగన్ నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పుడు దాని ఊసే లేదు. ఎమ్మెల్యేలకు కూడా అర్థమై వైసీపీ నుండి పక్కకు తప్పుకుంటున్నారు. జగన్ కొత్త పథకం తెచ్చాడు..దాని పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ ఫర్. ఒక చోట చెల్లని ఎమ్మెల్యేను పక్క నియోజకర్గంలోకి మార్చుతున్నాడు. ఒక చోట చెత్త..మరో చోట బంగారం అవుతుందా…అందుకే జగన్ మాయ మాటలను నమ్మొద్దు.

బాబాయ్ ని చంపింది ఎవరు..జగన్. పిన్ని తాలిబొట్టు తెంచింది ఎవరు జగన్. ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్ర అని రాశారు. సీబీఐ విచారణ చేస్తే ఏ8 నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు తేల్చింది. మరికొన్ని రోజులుంటే జగన్ పేరు కూడా బయటకు వస్తుంది. జగన్ ను చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టారు గొర్తుస్తున్నాడు. బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు..రెడ్ బటన్ నొక్కి రూ.100 లాక్కుంటున్నాడు.

9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడు..3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు. ఆఖరికి చెత్తపన్ను కూడా వేశాడు. ఇంట్లో కుక్క ఉంటే దానికి కూడా పన్ను వేస్తాడు. బూమ్ బూమ్ బాటిల్ కు కూడా పన్ను వేస్తాడు. రేపోమాపో వాలంటీర్ వాస్ ఇంటికొచ్చి గొట్టంపెట్టి గాలి ఊదమని చెప్పి..ఇంత గాలి పీల్చుతున్నారా పన్ను కట్టండని చెప్తారు. ఈ కటింగ్ మాస్టారు..అన్న క్యాంటీన్, పెళ్లికానుక, పండుగ కానుక, 6 లక్షల పెన్షన్లు, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్ కట్ చేశాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా 100 సంక్షేమ పథకాలు కట్ చేశాడు.

మనం ప్రజల్లోకి వెళ్లి చైతన్యం తీసుకురావాలి. రాష్ట్రానికి సంక్షేమాన్ని తీసుకొచ్చిందే ఎన్టీఆర్. రూ.2లకే కిలో బియ్యంతో పాటు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. చంద్రబాబు వచ్చాక బీమా, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, కానుక లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మీకు క్విజ్ పెడతాను….జగన్ రోజూ ఏమీ తింటాడు.? .ఆప్షన్-1అన్నం, .ఆప్షన్ – 2 బిర్యానీ, ఆప్షన్ 3 ఇసుక…ఏమి తింటాడు…ఇసుక తింటాడు. ఆనాడు ట్రాక్టర్ ఇసుకు వెయ్యికి దొరికితే ఇప్పుడు రూ.5 వేలు అయింది. పందికొక్కుల్లా ఇసుకను వైసీపీ నేతలు బొక్కుతున్నారు.

ఈ మధ్య సిద్ధం అనే కటౌట్లు చూస్తున్నా…దేనికి సిద్ధం…బంగారం కంటే ఇసుక ధరను ఎక్కువ చేసేందుకు జగన్ సిద్ధం అయ్యారు. పవన్, చంద్రబాబు కలిసి సూపర్-6 హామీలు ఇచ్చారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం రావడనికి సమయం పడితే నెలకు రూ.3 వేలు భృతి అందిస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం..ముగ్గురు ఉంటే రూ.45 వేలు కూడా ఇస్తాం. ప్రతి ఇంటికి యేటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. 18-59 ఏళ్లు కలిగిని మహిళకు ప్రతినెలా రూ.15 వందలు ఇస్తాం. ఆర్టీసీ ఛార్జీలు సైకో 3 సార్లు పెంచాడు…అందుకే టీడీపీ వచ్చాక మహిళలు ఉచితంగా ప్రయాణిచేం అవకాశం కల్పించబోతున్నాం.

మూడు రాజదానుల పేరుతో నాటకాలాడుతున్నారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమైనా తెచ్చాడా…ఒక్క ఉద్యోగమైనా ఇచ్చా.? కానీ రూ.500 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి విశాఖ రుషికొండపై ఏకంగా ప్యాలెస్ కట్టుకున్నాడు. విశాఖ రైల్వే జోన్ కు 53 ఎకరాలు భూమి ఇవ్వలేదు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో పోరాడి సాధించారు…విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు. కానీ జగన్ ప్రైవేట్ వ్యక్తులతో ఒప్పందం చేసుకుని స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూస్తున్నాడు. ఉత్తరాంధ్రవాసులకు నేను హామీ ఇస్తున్నా….స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం..అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తాం.

పాదయాత్రలో ఆముదాలవలసలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చి నేటికీ తెరిపించలేదు. ఉత్తరాంద్రను అభివృద్ధి చేసింది టీడీపీనే. రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పక్కా గృహాలు కూడా నిర్మించాం. నాడు వంశధార-నాగావళి అనుసంధాన పనులు ప్రారంభించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాగావళి-వంశధార నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తాం. ఆముదాలవలసలో ఎప్పుడూ అబివృద్ధి జరగని విధంగా 2014-19లో చేశాం. నారాయణపురం లిఫ్ట్ ఇరిగేషన్ ఆధుణీకరన చేశాం. తాగునీటి పథకాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.16 వందల కోట్లు ఖర్చు చేశాం.

కానీ ఇక్కడ డమాబుస్ ఎమ్మెల్యేను గెలిపించారు..దానికి కారణం మనం చేసిన మంచిన ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడమే. కానీ రాబోయే రెండు నెలల్లో మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్య్వూను చూశా…ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అన్నాడు. మరి ఎన్టీఆర్ కూతురును అసెంబ్లీలో అవమానిస్తే నువ్వు చేసిందేంటి..పీకిందేంటి.? శాసన సభకు గౌరవం లేకపోవడానికి కారణం ఈ డమాబుస్ ఎమ్మెల్యేనే. సభా సాంప్రదాయాలు ఉల్లంఘించి సభ సాక్షిగా చంద్రబాబును అవమానిస్తే పట్టించుకోలేదు.

డమాబుస్ ఎమ్మెల్యే..పలాస కొండల రాజుతో అవినీతిలో పోటీ పడుతున్నాడు. ఐదేళ్లలో ఈ డమాబుస్ ఎమ్మెల్యే రూ.1000 కోట్లు సంపాదించుకున్నాడు. ల్యాండ్, శ్యాండ్ మాఫియాకు అడ్డాగా ఆముదాలవలసను మార్చాడు. కాంట్రాక్టర్లును కూడా వేధించాడు. కొడుకు పెళ్లి కోసం రూ.1.30 కోట్లు వసూలు చేశాడు. ఇసుకలో రూ.300 కోట్లు కొట్టేశాడు. వాలంటీర్,అంగన్వాడీ, షిప్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా డబ్బులెక్కువ ఇచ్చిన వారికి అమ్ముకున్నాడు. పొలం తగాదాలున్నవారిని పంచాయతీ పేరుతో పిలిచి భూములు లాక్కున్న చరిత్ర ఈ డమాబుస్ ఎమ్మెల్యేది.

మైన్లతో పాటు వందల ఎకరాలు బలవంతంగా కొడుకు పేరుపై రాయించుకున్నాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక విచారణ వేసి వడ్డీతో చెల్లించి ప్రజలకు అప్పగిస్తాం. ఒక స్పీకర్ గా పని చేస్తుంటే..నియోజకవర్గం ఎలా ఉండాలి.? మంత్రికి ఆదేశాలు జారీ చేయొచ్చు..కానీ సొంత ఆదాయంపైనా ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఆలోచించుకున్నాడు. ఆముదాలవలస అభివృద్ధిపై ఏనాడైనా జగన్ ను అడిగారా..కనీసం ఒక లేఖైనా రాశావా..? ఒక్క రోడ్డైనా మంజూరు చేయించుకున్నారా.? ఆముదాలవలస అభివృద్ధిపై చర్చకు సిద్ధమా డమాబుస్ ఎమ్మెల్యే?

నాగావళి నదిపై బ్రిడ్జిని నిర్మిస్తాం. వంశధార నదిపై పురుషోత్తపురం బ్రిడ్జి ఏర్పాటు చేస్తాం. ఆముదాలవలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం. దేశంలో ఎక్కడికి వెళ్లినా సిక్కోలు వాసులు కనబడతారు. మన ప్రాంతంలో ఉపాది అవకాశాలు లేకనే వలసలు వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సెజ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించి వలసలు ఆపే బాధ్యత నేను తీసుకుంటా.

ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పసుపు జండా రూపొందించారో కానీ జండా చూస్తే మాత్రం రక్తం ఉడుకుతుంది. కార్యకర్తల పార్టీ అంటే టీడీపీ గురించే దేశంలో మాట్లాడాతారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా రూ.100 కోట్ల ఖర్చుపెట్టి ఆదుకున్నాం. అందరూ ఆలోచించాలి ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమాన్ని కార్యకర్తలకు అమలు చేశాం. చనిపోయిన కార్యకర్తల పిల్లలను చదివిస్తున్నాం. ఐదేళ్లుగా మనవాళ్లపై అడ్డగోలుగా కేసులు పెట్టారు. నాపైనా అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏ తప్పూ చేయని వ్యక్తులపై తప్పుడు కేసులు పెడితే భయపడం.

కేవలం టీడీపీ కార్యకర్లలపైన కాదు..జనసేన కార్యకర్తలపైనా అక్రమ కేసులు పెట్టారు. వారి పేర్లు కూడా పుస్తకంలో రాశాను. ఎవర్నీ వదలను..అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్ దేవుడు..చంద్రబాబు రాముడు..ఈ లోకేష్ తప్పు చేసిన వారికి మూర్ఖుడు. శంఖారావం ద్వారా పిలుపునిస్తున్నా…సూపర్-6 ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలి.

వైసీపీకి వాలంటీర్లు ఉంటే..మనకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. బాదుడే బాదుడే, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు బాగా చేశాం..ఇప్పుడు బాబు సూపర్ – 6ను సమర్థవంతంగా తీసుకెళ్లాలి. సీనియర్లను గౌరవిస్తా…కొత్తవారిని ప్రోత్సహిస్తా. ప్రజల చుట్టూ తిరగండి..మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవి ఇస్తా. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ అండగా నిలబడ్డారు. విమానంలో రాకుండా ఫ్లైట్ రద్దు చేశారు. రోడ్డు మార్గాన రాకుండా సరిహద్దుల్లో అడ్డుకున్నారు.

టీడీపీ – జనసేన కలిసి సైకోను తమిరికొట్టాలి. పేటియం బ్యాచ్ టీడీపీ-జనసేన మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. సమన్వయంతో పని చేసి వైసీపీని రాష్ట్రంలో లేకుండా తరిమికొట్టాలి. స్థానిక వైసీపీ నేతలు మన కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టి, రౌడీ షీటర్ తెరవాలని చూస్తున్నారు..దీనిపై న్యాయపోరాటం తప్పకుండా చేస్తాం.

LEAVE A RESPONSE