Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య కేసుతో తనకు సంబంధంలేదని జగన్ ఎందుకు నిరూపించు లేకపోతున్నాడు?

– ఎంపీ అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించుకోకుండా, సీబీఐపై ఒత్తిడితెచ్చే చర్యలకు ఎందుకుపాల్పడుతున్నారు?
– టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీ.టెక్.రవి)

వివేకానందరెడ్డి హత్యకేసులో రాష్ట్రమంతా ముఖ్యమంత్రి వైపు, వేలెత్తిచూపుతుంటే, తన సచ్చీలతను నిరూపించుకోవడానికి జగన్ రెడ్డి ఎందుకు జంకుతున్నాడని, సీబీఐ అడిగిన వెంటనే ఆయన, ఎంపీ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లు నార్కో అనాలసిస్ పరీక్ష కు ఎందుకుసిద్ధపడలేదని టీడీపీఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీ.టెక్.రవి నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

వివేకా హత్యకేసులో తనప్రమేయం లేదని జగన్ రెడ్డి ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాడు. బాబాయ్ హత్యతో ముఖ్యమంత్రికి సబంధంలేనప్పుడు, తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని, నార్కో టెస్ట్ కాకపోతే మరోటి చేసుకోండని ఎందుకు ధైర్యంగా నిలబడలేకపోతున్నాడు? సీబీఐవారు నార్కో అనాలసిస్ కురమ్మని మంచి సువర్ణావకాశం జగన్ రెడ్డికి ఇస్తే, ఆయన దాన్ని ఎందుకు జారవిడుచుకున్నాడు? సీబీఐ విచారణకు అడుగడుగునా మోకాలడ్డుతూ, హత్యకేసుతో ఏమాత్రం సంబంధంలేనివారితో జిల్లాపోలీసులకు ఎందుకు ఫిర్యాదులు చేయిస్తున్నాడు?

సీతమ్మతల్లి తనపై వచ్చిన అపవాదునుంచి బయటపడటానికి అగ్నిప్రవేశం చేసినట్టుగా నార్కో అనాలసిస్ టెస్ట్ కు తాను సిద్ధమని జగన్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలు ఎందుకు ప్రకటించడం లేదు? దేవిరెడ్డి శంకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్ష చేస్తే ఎంపీ అవినాశ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన

ఇబ్బందేమిటి? అదేనేను గానీ అవినాశ్ రెడ్డిస్థానంలో ఉండి ఉంటే, బహిరంగంగా ప్రజలమధ్యనే నార్కో అనాలసిస్ చేయించుకునేవాడిని. శంకర్ రెడ్డి నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధపడలేదంటే, వివేకాహత్యతో అతనితోపాటు జగన్ రెడ్డికి, అవినాశ్ రెడ్డికి సంబంధం ఉందనే పులివెందులప్రజలు సహా రాష్ట్రమంతా భావిస్తుంది.

వివేకాహత్యకేసు సహా, రాష్ట్రరాజకీయాల్లో శంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డిలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సీబీఐ తమను ఒత్తిడిచేస్తోందని వాళ్లతో , వీళ్లతో చెప్పించేబదులు, ముగ్గురూ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవచ్చుగా? ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, దానితో తమకు సంబంధంలేదని నిరూపించుకునే అవకాశాన్ని వారే వారిచేజేతులా జారవిడుచుకున్నారు. మొన్న క్రిస్మస్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులవచ్చినప్పుడు ఎటుచూసినా ఆయనకుసంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లే దర్శనమిచ్చాయి. వాటిలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డిల చిత్రాలే ప్రధానంగా కనిపించాయి.

గతంలో పరిటాల రవి హత్యతో పులివెందులకృష్ణకు సంబంధముందనగానే జగన్ రెడ్డి వెంటనే స్పందించి సదరు కృష్ణకు, నాకు ఎలాంటి సంబంధంలేదని బుకాయించాడు. అదే పులివెందులకృష్ణ, జగన్మోహన్ రెడ్డి ఇంటిపక్కనే ఉండేవాడని, ఇద్దరూ కలిసిమెలిసి తిరగడంకూడా జరిగిందని రాయలసీమ వాసులందరికీ తెలుసు. పరిటాలరవిహత్యలో ఎప్పుడైతే పులివెందుల కృష్ణ పేరుబయటకు వచ్చిందో, తనకు కృష్ణకు మధ్యఉన్న బంధంతాలూకా ఆధారాలు బయటపడకుండా జగన్ రెడ్డి జాగ్రత్త పడ్డారు. వారిద్దరి తాలూకా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎక్కడా కనిపించకుండా చేశారు.

కానీ నేడు పులివెందులలో ఎటుచూసినా దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి ల ఫ్లెక్సీలే కనిపిస్తున్నా, ముఖ్యమంత్రి వాటిపై ఎందుకు స్పందించడంలేదు? వివేకాహత్యకేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డికి ప్రమేయముందని అందరూ అనుకుంటున్నాకూడా, అతనికి, తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యం తాలూకా ఆనవాళ్లను తొలగించే ప్రయత్నాలు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? వివేకాహత్యోదంతం సహా, రాష్ట్రరాజకీయాలవరకు తామంతా ఒకటేనని చెప్పడమే ముఖ్యమంత్రి ఉద్దేశమా? ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తే, వివేకాహత్యకేసులో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది.

దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి తీసుకొని దాదాపు రెండునెలలు అవుతోంది. సీబీఐ విచారణలో కేవలం రెండురోజులు మాత్రమే శంకర్ రెడ్డి కస్టడీలో ఉన్నాడు. మిగిలిన 58రోజలు ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇప్పటికీ అతను ఆసుపత్రిలోనే ఉన్నాడు. అతన్ని సీబీఐ వారు విచారించలేని పరిస్థితిలో ఉన్నారంటే దానివెనుక ముఖ్యమంత్రి ప్రమేయం, అధికారుల ఒత్తిడి ఉన్నాయని స్పష్టమవుతోంది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాళ్లు విసరడం మాని, ముఖ్యమంత్రిని, అవినాశ్ రెడ్డిని నార్కో టెస్ట్ చేయించుకోమని సలహా ఇస్తేబాగుండేది. జగన్ రెడ్డి నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించుకుంటే శివప్రసాద్ రెడ్డి సహా, వైసీపీకి కూడా రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరువస్తుంది కదా?

వివేకానందరెడ్డి స్వయంగా ముఖ్యమంత్రికి బాబాయ్. కానీ జగన్ రెడ్డి నేడు వివేకా కుటుంబసభ్యుల గుండెలపై తన్నేలా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యమంత్రి చర్యలతో ప్రపంచమంతా నివ్వెరపోతోంది. దేవిరెడ్డి శంకర్ రెడ్డి ముద్దాయిగా ఉంటే, అలాంటివారిని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి తిరగడం, వారినికాపాడాలనిచూడటం ఏమిటి? ముఖ్యమంత్రికి వివేకాహత్యతో సంబంధంలేనప్పుడు, ఆయన తన అధికారాన్ని ఉపయోగించి సీబీఐవిచారణను ఎందుకుప్రభావితం చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐని ప్రభావితం చేయడానికే ముఖ్యమంత్రి, శంకర్ రెడ్డితో కలిసిఉన్న ప్రచార చిత్రాలను ప్రజలముందు ప్రదర్శిస్తున్నాడు.

ముఖ్యమంత్రి ఇప్పటికైనా మనస్సాక్షి ప్రకారం నడుచుకొని, వివేకాహత్యకేసులో తనతల్లి విజయమ్మగారు చెప్పినట్టుగా నడుచుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. జగన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా, పులివెందులకు ఎమ్మెల్యేనే..తన నియోజకవర్గ ప్రజలముందు తనసచ్ఛీలత, వ్యక్తిత్వం నిరూపించు కోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

LEAVE A RESPONSE