స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

-కుల గణన తోనే అన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం
-కులగణనతో అగ్రవర్ణాలకు ధీటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి
-మంగళగిరిలో చేనేత వస్త్ర సమాదాన్ని ప్రారంభించిన ఎంపి విజయసాయిరెడ్డి

మంగళగిరి. ఫిబ్రవరి 12: స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని రాజ్యసభ సభ్యులు, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు.

నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి చిరంజీవి ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకురాగా తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.

మంగళగిరిలో చేనేత వస్త్ర వ్యాపారుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన డాక్టర్ వైయస్సార్ మరియు ప్రగడ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయాన్ని రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రారంభించారు..చేనేత వస్త్ర వ్యాపారుల కోసం ప్రత్యేకంగా 5 కోట్ల యాభై లక్షలతో 40 షాపుల కాంప్లెక్స్ ను మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, లేళ్ళ అప్పిరెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply