Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల మంచి కోరుకునే ప్రభుత్వం మాది

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : ఉద్యోగుల సంక్షేమంతో పాటు వాళ్ల మంచి కోరుకునే ప్రభుత్వం తమదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ను శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీటే వేస్తుంటారన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఉద్యోగులకు సీఎం చంద్రబాబునాయుడు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు షెల్టర్ వంటి సౌకర్యాలు కల్పించారన్నారు. తరవాత వచ్చిన జగన్ ఉద్యోగులను అన్ని విధాలా అన్యాయం చేశారన్నారు.

ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ ఖాతాలను నిధులను సైతం పక్కదారి పట్టించారన్నారు. జీతాలు సైతం ఒకటో తేదీన ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన ఉద్యోగులను తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడ్డారన్నారు. ‘సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందిని, మీ మంచి కోరుకునే ప్రభుత్వ మాది’ అని మంత్రి తెలిపారు.

ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించారన్నారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి సవితను ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్పీఆర్ విఠల్, ఆ సంఘ ప్రతినిధులు పామర్తి ఏసురాజు, ప్రసాద్, శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE