Suryaa.co.in

Andhra Pradesh

పేర్నిగారూ..కాపులు మీకు పుట్టలేదు!

-కొడాలి నాని- పేర్ని నానికీ తేడా లేదు
– ముద్రగడ లాంటి నేతలు స్పందించరేం?
-మంత్రి నానిపై బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ ఫైర్
‘మేము మేము కాపు నాకొడుకులం’ అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య కాపు-బలిజ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన వాడిన అభ్యంతరకమైన ఆ పదజాలంపై, కాపు-బలిజ నేతలు మండిపడుతున్నారు. కాపు-బలిజలు మీకు పుట్టలేదు. కాపు-బలిజ జాతిలో పుట్టారంటూ బలిజనాడు కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓ.వి.రమణ మంత్రి పేర్ని నానిపై విరుచుకుపడ్డారు. మర్యాదస్తుడిగా పేరున్న పేర్ని నానికి- బూతులు మాట్లాడే కొడాలి నానికీ ఇప్పుడు పెద్దగా తేడాలేదని రమణ తూర్పారపట్టారు.
కాపు నాకొడుకులం అంటూ మంత్రి పేర్ని వాడిన పద జాలాన్ని విరమించుకుని, కాపు-బలిజ జాతికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు కులంలో పుట్టిన పేర్ని నాని, కాపుజాతినే అసభ్యపదజాలంతో దూషిస్తే.. ముద్రగడ పద్మనాభం వంటి కాపు నేతలు స్పందించకుండా నిద్రపోవడం


చూస్తే, కాపుజాతి ఎంత పరాధీనంలో బతుకుతోందో అర్ధమవుతోందని రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రమణ.. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన కాపు-బలిజలు, తాము పొరపాటున వైసీపీకి ఓటు వేశామన్న భావన మంత్రి కల్పించారన్నారు. ఇది కచ్చితంగా వైసీపీకి నష్టమేనన్నారు. గతంలో కాపు-బలిజల మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, గత ఎన్నికల్లో వైసీపీకి సైతం ఇదే వర్గం ఓట్లు వేసి గెలిపించిందన్న విషయం మర్చిపోరాదని హెచ్చరించారు. రాయలసీమలో బలిజలకు అన్యాయం జరుగుతోందని తాము కొన్ని దశాబ్దాల నుంచి చెబుతున్న మాటనే, పవన్ కల్యాణ్ చెబితే తప్పేమిటని ప్రశ్నించారు.

‘రాయలసీమలో బలిజలకు అన్యాయం జరుగుతోందని పవన్ చెప్పారు. పోనీ మీరు వైసీపీ న్యాయం చేసిందని చెప్పవచ్చు కదా? ఎందుకు చెప్పలేదు? అది చెప్పకుండా బలిజల గురించి మాట్లాడిన పవన్‌కల్యాణ్‌పై మాట్లాడం ఏమిటి? ఆ పేరుతో కాపు నాకొడుకులం అని సంస్కారం లేకుండా మాట్లాడి, కాపు-బలిజ జాతిని రోడ్డున పడేయడం ఏమిటి మంత్రి గారూ’ అని రమణ ప్రశ్నించారు. ‘ ఈ కులం అంటే అందరికీ అలుసయిపోయింది. ఎవరేం మాట్లాడినా పట్టించుకోరన్న ధీమా. దానికి కారణం ఈ కులస్తులే. దశాబ్దాల నుంచి రాజకీయంగా-ఆర్ధికంగా అణగదొక్కబడుతున్న జాతి ఇది. మేము మేము కాపు నాకొడుకులం అన్నారంటే మీకు కాపు-బలిజల మీద ఎంత అభిమానం ఉందో తెలిసిపోతుంది. ఇదా మీ భాష? ఇదా కాపులకు మీరిచ్చే గౌరవం? ఇప్పటికే మేం అలుసయిపోయాం. మా కుడుపురగిలిపోతోంది. పవన్-మీరు రాజకీయాలు మాట్లాడుకోండి. విమర్శించుకోండి. నేను పవన్‌కు అప్పుడు-ఇప్పుడు వత్తాసు పలకడం లేదు. మధ్యలో కులాన్ని ఎందుకు తీసుకువస్తున్నారు?’’ అని రమణ నిలదీశారు.

LEAVE A RESPONSE