ఆమె పాటలన్నీ
మాలకడితే అదే భక్తిరంజని..
మూటకడితే రసరమ్యరంజని..
సినీ సంగీత శివరంజని..
సంగీత అభిమానుల మనోరంజని..!
పి.లీల..
పుల్లయ్య లవకుశకు
ఆమె పాటలే శ్వాస..
సుశీలమ్మతో కలిసి పాడిన పాటలు ముత్యాల మూటలు
రామకథను వినరెయ్య..
ఇహపర సుఖములనొసగే
సీతారామ కథను వినరెయ్యా!
వినుడు వినుడు
రామాయణ గాథ..
వినుడీ మనసారా..
శ్రీరాముని చరితమును
తెలిపెదమమ్మా..
ఘనశీలవతి సీత కథ
వినుడోయమ్మా..
మొత్తం రామకథ
ఒలకబోసిన గానసుధ..!
మనదేశం తో
తెలుగు చిత్రరంగంలో
ప్రవేశం..
అంతకు మునుపు
మలయాళంలో
తొలి నేపథ్యగానం..
ఈ గాత్ర సమ్మోహనం..
రావోయి చందమామ
మా వింత గాథ వినుమా..
ఆ స్వరంలో అంతటి లాలిత్యముంటే
పదేపదే వినమా!
నీవేనా నను తలచినది
నీవేనా నను పిలచినది..
నీవేగా నా మదిలో నిలచి
హృదయము కలవరపరచినది..
అందమైన శశి
ఆమెకు తగిన స్వరవాసి..!
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగినది..
ఆ గాన మధురిమ విని
మురిసిపోలేదా యమునానది..!
ఎంత ఘాటు ప్రేమయో..
ఇంత లేత వయసులో..
పాతాళభైరవికీ
లీలమ్మ పాటలే ఆనందభైరవి!
కనుపాప కరువైన కనులెందుకు..
తనవారె పరులైన బ్రతుకెందుకూ..
చిరంజీవులు సినిమాలో
ఆ పాటలో విషాదం..
చికిలింత చిగురు..
సంపంగి గుబురు..
చినదాని మనసు..
చినదాని మీద మనసు..
అదే సినిమాలో
మరో పాటలో వినోదం..
ఎందాక ఎందాక ఎందాక..
అందాక అందాక అందాక..
అలా పాడుతూనే ఉంది
ఈ లీల కడదాక..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286