Suryaa.co.in

కక్ష్య సాదింపు చర్యలు మానుకోవాలి:పి.సాయిబాబా
Andhra Pradesh Telangana

మాజీ ఓ.ఎస్.డి పై కక్ష్య సాదింపు చర్యలు మానుకోవాలి:పి.సాయిబాబా

ఈ రోజు (10.12.2021)న జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా, వర్కింగ్ ప్రసిడేంట్ నల్లెల్ల కిషోర్, ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద పి.ఎస్.గా, ఓ.ఎస్.డి గా మరియు హైయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్నో ఏళ్లు పనిచేసిన మచ్చలేని వ్యక్తి లక్ష్మినారాయణ ఇంటిపై అక్రమంగా కనీసం ముందుగా వివరణ అడగకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా ఎపి సిఐడి పోలీసులు దాడులు చేయడాన్ని ప్రతిఘటిస్తున్న తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా నాయకులు. ఇటువంటి కక్ష్య సాదింపు చర్యలు మానుకోవాలని, తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను అభిమానులను భయ బ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్న ప్రభుత్వ పన్నాగం ఇది. ఇటువంటి పన్నాగాలతో జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని పార్లమెంట్ అధ్యక్షులు పి.సాయిబాబా అన్నారు. ముందుంది ముసళ్ల పండుగ. త్వరలో రాబోయే ఎన్నికల్లో ఎవరేమిటో, ప్రజాస్వామ్య వాదులెవరో తెలుస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలని జగన్ ను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యలు కాట్రగడ్డ ప్రసూన. పార్లమెంట్ వర్కింగ్ ప్రసిడేంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శులు పి.బాలరాజ్ గౌడ్, రాజా చౌదరి, నరెశ్ యదవ్, ముజ్జు, ఎమ్ కె. బోసు, సిహెచ్. విజయశ్రీ, ఎం.నర్సింహులు, ఎస్.లత, మల్లిఖార్జుస్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE