వేల్ మురుగన్ తమిళ్ష్ గ్రామీణ ‘పఱై’ కళాకారుడు. పఱైను తెలుగులో డప్పు అనచ్చు. వేల్ మురుగన్ ఈ 2025లో ‘పద్మశ్రీ’తో సత్కరింపబడ్డారు.
తమిళ్ష్‌లో పఱై (డప్పు) వాయించడం ఆనువంశికంగా వేల్ మురుగన్‌కు అబ్బింది. తన ‘ప్రతిభ’తో వేల్ మురుగన్ ఆ పఱై వాదనలో గొప్పవారై, పలువురికి గురువయ్యారు. అందుకే ఆయన్ను ‘ఆసాన్’ అంటే గురువు అంటారు. వేల్ మురుగన్ ‘వేలు ఆసాన్’ అయిపోయారు. ఈ ఏడాది కేంద్ర బీ.జే.పీ. ప్రభుత్వం పఱై కళాకారుడు వేలుకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
అమేరిక, చైనా, సింగపూర్, మలైషిఅ, దుబాయ్, శ్రీలంక వంటి దేశాల్లో తన పఱై ప్రదర్శనలు ఇచ్చారు వేలు. పలు సినిమాల్లో వేలు పఱై ప్రత్యేకంగా ధ్వనించింది. వేలు పఱై తమిళ్ష్నాడును ఉఱ్ఱూతలూగిస్తూనే ఉంది.
తెలుగులో మాల అనబడుతున్న కులాన్ని తమిళ్ష్‌లో పఱై అంటారు. వేలు ఆ పఱై అనబడుతున్న వర్గానికి చెందిన వారు. కానీ మాల అనబడుతున్న కులం వాదిగా బతకడం లేదు వేలు! ఒక కళాకారుడిగా బతుకుతున్నారు వేలు.
కమ్యూనిస్ట్, నక్సలైట్, అంబేడ్కరిస్ట్ కాదు వేలు. ప్రతిభావంతమైన, ప్రజ్ఞావంతమైన, మేలైన కళాకారుడు వేలు. నిజమైన ప్రజా కళాకారుడు వేలు.
ఒక్క తెలుగులోనే ప్రజల్లో లేని, ప్రజలకు చెందని, ప్రజలు మెచ్చని, నక్సలైట్లు, ప్రజలకు హానికరమైన వ్యక్తులు, దోపిడిదారులు, భూకబ్జాదారులు, హింసావాదులు, విధ్వంసకారులు, అసాంఘీక శక్తులు ప్రజా గాయకులు, ప్రజా కవులు అయిపోతారు. తెలుగు తప్పితే ప్రపంచంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ ఈ భయానకమైన స్థితి, ఈ అపాయం, ఈ నీచత్వం లేదు; రాదు.
తను కులం ప్రాతిపదికన ఎదగలేదు వేలు. రిజర్వేషన్ మనిషిగా ఎదగలేదు వేలు. విద్యతో, ప్రతిభతో, ప్రజ్ఞతో, పరిశ్రమతో ఎదిగి, ఎదిగి, ప్రజాకళాకారుడై ఇవాళ పద్మశ్రీ అయ్యారు వేలు.
విదేశీ మతాల మిషనరీలు, కమ్యూనిస్టుల లాబీతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పద్మశ్రీ కాదు; వీటన్నిటికీ అతీతంగా బీ.జే.పీ. ప్రభుత్వంలో నిజమైన ప్రజాకళాకారుడికి వచ్చిన అచ్చమైన పద్మశ్రీ వేలుకు వచ్చిన పద్మశ్రీ.
ప్రతిభావంతుడైన పఱై కళాకారుడు వేలు తమిళ్ష్ సంస్కృతితో, భారతీయతా సంస్కృతితో మేలైన మనిషిగా జీవిస్తున్నారు.
చదువు, పనితనం, ప్రతిభ, పరిశ్రమ, సంస్కారం ఇవేవీ లేకుండా సాటి మనిషికి, సమాజానికి హానికరంగా, భారతీయతపై, దేశంపై దాడి చేసేందుకే బతుకుతున్న కులోన్మాదులు, దుష్టులు పద్మశ్రీ వేలు జీవితాన్ని చదివి మామూలు మనుషులవాలి.
కులం కాదు మనిషికి విద్య కావాలి. ఉన్మాదం కాదు మనిషికి ప్రతిభ కావాలి. చెడ్డతనం కాదు మనిషికి పనితనం కావాలి.
కులం జన్మతః రాదు; ఉండదు.
సామాజిక అనర్థంగా పరిణమించిన ఈనాటి కుల వ్యవస్థ ప్రకారం ఏ కులంలో పుట్టినా వేలు లాగా గొప్ప ప్రజా కళాకారుడు అవచ్చు; జనాదరణను పొందవచ్చు; పద్మశ్రీ అవచ్చు. (వేలు దగ్గర బ్రాహ్మణులు అనబడుతున్న వాళ్లు కూడా పఱై నేర్చుకున్నారు)
పద్మశ్రీ పురస్కార ప్రదానోత్సవంలో వేలులోని భారతీయ సంస్కృతిని మనం గుర్తించవచ్చు. కులాన్ని, మతాన్ని విసర్జించి ఇళైయరాజా (ఇళయరాజా కాదు), కె.జె. ఏసుదాస్ వంటి వాళ్లు విద్యతో, ప్రతిభతో, కృషితో, పరిశ్రమతో, పనితనంతో, భారతీయతతో గొప్ప ప్రజాకళాకారులై, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. వాళ్లతో పాటు పఱై వేలు కూడా కులోన్మాదులకు కనువిప్పు కావాలి.

9444012279