Suryaa.co.in

National

బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్

– గరికపాటి నరసింహారావు,దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ

రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌ ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. 128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మ భూషణ్‌, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం.

దివంగత జనరల్‌ బిపిన్‌రావత్‌తో పాటు యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, యూపీకి చెందిన సాహిత్యవేత్త రాధేశ్యామ్‌ ఖేమ్కా(మరణానంతరం) , ప్రభా ఆత్రే(మహారాష్ట్ర) పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్‌ పురస్కారాలు ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి
padmasri నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి.

అలాగే భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా(తెలంగాణ)కు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది. సీరమ్‌ సంస్థ సైరస్‌ పూనావాలాకు, టెక్‌ దిగ్గజాలు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లకు పద్మభూషణ్‌ పురస్కారాలు దక్కాయి.

LEAVE A RESPONSE