Suryaa.co.in

Telangana

విశాఖి ఉత్సవాల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్, తలసాని

అమీర్ పేట్ గురుద్వారా సాహెబ్ ప్రభంధక్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అమీర్ పేట్ గురు గోవింద్ సింగ్ మైదానం లో 325 వ ఖల్సా సాజన్ దివస్ (వైశాఖి) వేడుకల్లో సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ , సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సిక్కు మతస్తుల సేవా తత్పరతను, విశిష్ట సంస్కృతిని వారు ఈ సందర్భంగా కొనియాడారు. నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సిక్కు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అభినందించారు. ఈ సందర్బంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE