ఆయన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా రాజకీయ, అధికార, అనధికార కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధి. ఊపిరి సలపని కార్యక్రమాలు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీ బిజీ. కానీ ఆయనకు క్రికెట్ అంటే
బోలెడంత ఇష్టం. అందువల్ల ఎన్ని పనులున్నా వాటిని చూస్తూనే, క్రికెట్ మ్యాచ్ వస్తే టీవీకి అతుక్కుపోతారు. అలాంటి ఆయన శుక్రవారం ముంబయిలో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ కోసం తనయుడు, మిత్రులు, నియోజకవర్గ పార్టీ నాయకులతో కలసి ముంబయికి వెళ్లి, స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసి, రిలీఫయ్యారు. ఆ చిత్రమే ఈ చిత్రం.
