ఒక పౌరాణిక సినిమా చూస్తున్నట్టు..
చిరంజీవి అయిన ఆంజనేయుడే అక్కడ
కదలాడుతున్నట్టు..
దిగ్గజాలు కొలువైన సభ
దిగ్భ్రమనొందగా..
నడచి వచ్చిన
ఆ సిద్ధపురుషుడు..
మానవ రూపంలోని అద్భుతం..
126 వసంతాల
పరిపూర్ణ మానవత్వం..!
పద్మశ్రీ స్వామి శివానంద..
నడిచే సేవా సర్వస్వం..
పేదవాడే దేవుడిగా
ఆకలితో..కష్టంతో
అలమటించే ప్రతి ఇల్లు
దేవాలయంగా శతాధిక
వత్సరాలుగా ఆయన సాగిస్తున్న సేవాయజ్ఞం
చరిత్ర ఎరుగని వైశిష్ట్యం..
ధరిత్రి చూడని విశేషం..
శతాబ్ది దాటినా
అదింకా సశేషం..!
నిజానికి పద్మశ్రీ
ఆ మహనీయుని
ముంగిట చిన్నదే..
అయినా ఆమోదించిన
ఆయన సంస్కారానికి
శతకోటి సమస్కారం..
సరే..ఆ భీష్ముడు
అవార్డును అందుకున్న
తరుణం..ఆ సమయంలో
జాతి మొత్తం పరవశమైన
ఆ దృశ్యం..చిరకాలం
మన మనోఫలకంపై
నిలిచిపోయే దృశ్యకావ్యం!
వయసును మరచి..
సంస్కృతిని పరచి..
ఇదేరా భారతీయమని
విడమరచి..నిబద్ధమై..
వినమ్రతకు నిలువుటద్దమై
తాను వంగి..దేశాధినేతను
ప్రధమపౌరున్ని..
పరాకాష్టగా దేశగౌరవాన్ని
నిలబెట్టిన మనిషి భరతభూమిలో..
కలియుగంలో..
వెలసి ఉన్న మహారుషి!!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286