-తరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు
-ముఖం చాటేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు
-బిలియన్ డాలర్ల తక్షణ ప్యాకేజీ కావాలని ఐఎంఎఫ్‌ను కోరిన పాక్
-పాక్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక దాని నుంచి బయటపడేందుకు నానా అవస్థలు పడుతోంది. ఇప్పుడు మరో పొరుగుదేశం పాకిస్థాన్ కూడా శ్రీలంక బాటలోనే పయనిస్తోంది. ఆసియా ఖండంలో శ్రీలంక తర్వాత పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రో ధరలతోపాటు నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు, పాకిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవడంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 16.2 శాతం తగ్గిపోయాయి. దీంతో 3 బిలియన్ డాలర్ల తక్షణ ప్యాకేజీ కావాలని అంతర్జాతీయ ద్రవ్యనిధిని పాకిస్థాన్ కోరింది. పాక్‌లో ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు రెండు నెలలకే సరిపోతాయి.
ఈ నేపథ్యంలో ఆ తర్వాత పాక్ పరిస్థితి శ్రీలంకలా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విదేశీ రుణాలను చెల్లించే విషయంలో పాక్ డిఫాల్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు.