Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ కార్యాలయాలుగా పల్నాడు పోలీస్ స్టేషన్లు

-వైసీపీ కార్యకర్తగా పల్నాడు జిల్లా ఎస్పీ
-గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి క్యాష్ మహేష్ రెడ్డిగా మారాడు
-నర్సరావుపేటలో అక్రమ సొమ్ము తో భారీఎత్తున మల్టీప్లెక్స్ కడుతున్నాడు
-గురజాల నియోజకవర్గంలో 33 చోట్ల అక్రమ మైనింగ్
-మూడువేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు
-రోజుకు‌ లారీ తెలంగాణ మద్యం గురజాల నియోజకవర్గానికి‌ తీసుకొచ్చి అమ్ముతున్నారు
-పేకాట క్లబ్బులు, ఊరికో ఇరవై బెల్టుషాపులు
-గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

భవిష్యత్తు కు గ్యారెంటీ పేరుతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మ్యానిఫెస్టోతో ప్రజల చెంతకు వెళుతున్నారు. బస్ యాత్ర విజయవంతం అయ్యింది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వైసీపీ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని సర్వనాసనం చేస్తున్నారు.

పోలీసులు, పోలీస్ స్టేషన్ లు వైసీపీ అడ్డలుగా మారాయి వైసీపీ కనుసన్నల్లో పోలీసులు నడుస్తున్నారు.రోడ్ల నిర్మాణం, టిడ్కో ఇల్లు పలు అభివృద్ధి పథకాలు అమలు చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబు దే….

పల్నాడులో ఒక్కమారు చూద్దామని ప్రజలు నరహంతకుడు, ఆర్ధిక నేర గాడికి అధికారం ఇస్తే ప్రజలు విలవిలాడుతోంది.వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి ని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పినజగన్ అమరావతి ని విధ్వంసం చేశాడు.అమరావతి రాజధానిని తల్లిదండ్రులు లేని పిల్లల మాదిరిగా మార్చారు.

పల్నాడులో బడుగు బలహీన వర్గాలకు చెందిన11మంది ని హతమార్చారు,33చోట్ల అక్రమ మైనింగ్ చేస్తున్నారు. 3 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించారు అయినా ప్రభుత్వ అధికారులుమాత్రం చోద్యం చూస్తూ వారి ప్రతిష్టను దిగజార్చుకున్నారు.

ఏపీ పోలీస్ వ్యవస్థ పై నమ్మకం లేదని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన జగన్ పై పోలీసులకు ఎందుకు అంత ప్రేమ అని ప్రశ్నించారు….అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యంగాన్ని అమలు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.. పల్నాడు జిల్లా ఎస్పీ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.

వైసీపీ మానస పుత్రిక సాక్షి మీడియా పై విరుచుకు పడ్డారు…
పల్నాడు లో జరిగిన బస్ యాత్రలో భోజనాలు సమయంలో మద్యం తాగివచ్చి డేగిశాలో పడి గాయాలతో ఆసుపత్రిలో మృతి చెందితే దానిని కూడా నాపై రుద్దాలని చూస్తే ఏమిటి అని ప్రశ్నించారు….
వైసీపీ కుటంబానికి చెందిన వ్యక్తి మృతి చెందితే మానవతా దృక్పథంతో లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తే దానినికుడా రాజకీయాలు చేయాలని చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ..మైనింగ్, రంగురాళ్లు ప్రకృతి సంపదల మొత్తం అక్రమంగా దోచుకుంటున్న వైసీపీ ముఠా..
రంగురాళ్లు వ్యాపారంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని హత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది..పవిత్ర పుణ్య క్షేత్రం దైద ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేయడం, దొంగమద్యం, పేకాట శిబిరాలు, అక్రమ మద్యం ఏరులై పారుతుంది.

రాబోయే రోజుల్లో అక్రమంగా కేసులు నమోదు చేసి టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టిన పోలీసులపై కేసులు పెడతామని హెచ్చరించారు..పల్నాడులో ఏఎస్ పి ప్లెక్సీలు పెట్టుకుంటున్నారు కానీ దాడులు, హత్యలు, దోపిడీలు, మానబంగాలు, దహనాలు ఆపలేకపోయారు.కాసు మహేష్ రెడ్డి నాన్ లోకల్ మనసేమో నరసరావుపేట లో ఉంటుంది మనిషేమో గురాజలలో ఉంటాడు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం లోకేష్ పాదయాత్ర పల్నాడులో జరిగటం ఇలా ఉంటుందో మీకు రుచి చూపిస్తాం. వైసీపీ నేతలు పెద్ద పోటుగాళ్ళు కాదు మాకు దమ్ముంది ధైర్యం ఉంది చూపిస్తాం.రాజధాని అమరావతి లో మహిళలు ఉద్యమచేస్తుంటే వైసీపీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు.

తుళ్లూరు డిఎస్పీ పోతురాజు రాజధాని మహిళలను నీచంగా మాట్లాడాడు మీరు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు.రాబోయేది కొత్త తెలుగుదేశం పార్టీ యువగళంతో దూసుకు వస్తుంది పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలి. అధికారులు జాగ్రత్తగా ఉండండి వైసీపీ నేతలు వాడుకొని వదిలేస్తారు, తీవ్ర ఇబ్బందులు పడతారని సూచించారు. పల్నాడు లో పోలీస్ స్టేషన్లు వైసీపీ కార్యాలయాలుగా మారాయి. 4 ఏళ్లలో ఎమ్మెల్యే కాసు పిడుగురాళ్ల ఔటర్ రింగు రోడ్డు వేయలేకపోయాడు. నరహంతకుడు, బాబాయిని చంపిన వ్యక్తి ఇంతకంటే ఎలా పరిపాలన చేస్తాడు? రాజధానికి కూడా కులం అంటగట్టారు.

తాలిబన్ల పాలన తరహాలో ఏపిలో సైకో పాలన ఉంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి క్యాష్ మహేష్ రెడ్డిగా మారాడు. అక్రమ మైనింగ్ గుంతల్లోపడి ఎనిమిది మంది మృతి చెందారు. గురజాల నియోజకవర్గంలో 33 చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుంది. మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు. బ్యాంకులలో‌ ఆ భూములు తాకట్టుపెట్టి వందలకోట్లు తీసుకున్నారు. కొంతమంది అధికారుల ప్రవర్తనతో ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రతిష్ట దిగజారిపోయింది. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు.

రోజుకు‌ లారీ తెలంగాణ మద్యం గురజాల నియోజకవర్గానికి‌ తీసుకొచ్చి అమ్ముతున్నారు. నాలుగేళ్లలో వైసీపీ నేతలు ఐదు వందలకోట్లు సంపాదించారు. రంగురాళ్ల అమ్మకంలో వైసీపీ నేతల మధ్య వివాదంతో బ్రహ్మయ్యను‌ హత్య చేశారు. ఫారెస్ట్ అధికారులపై వైసీపీ రంగురాళ్ల మాఫియా దాడిచేశారు. పవిత్రమైన దైద పుణ్యక్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నారు. పేకాట క్లబ్బులు, ఊరికో ఇరవై బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు.

ఎక్సైజ్ అధికారి కొండారెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కొండారెడ్డి సంగతి‌ తేలుస్తాం. ప్రమాదవశాత్తు కోటేశ్వరరావు చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కోటేశ్వరరావు వైసీపీకి చెందిన వ్యక్తి అయినా మానవతా దృక్పధంతో నేను లక్ష ఆర్థికసాయం చేశా వైసీపీ ఫ్లెక్సీలు చించారని మైనర్లపై కేసులు పెట్టి జైలులో పెట్టారు.

ఎమ్మెల్యే కాసు గురజాలలో ఉన్నా మనసు మాత్రం నర్సరావుపేటలో ఉంటుంది. నర్సరావుపేటలో అక్రమ సొమ్ము తో భారీఎత్తున మల్టీప్లెక్స్ కడుతున్నాడు. లోకేష్ పై పేటీఎం బ్యాచ్ అవాకులు, చవాకులు పేలారు. రాయలసీమలో లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ అయ్యింది. ఒళ్లు బలిసినట్లుగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు అమరావతి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారితోనే మహిళల కాళ్లు పట్టిస్తాం.

LEAVE A RESPONSE