– జనసేన సవాలుకు జవాబు లేక పారిపోయిన గురజాల ఎమ్మెల్యే కాసు
– ఖనిజ సంపదను కొల్లగోడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు
– నెలవారీ కోట్లు దండుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు
– భట్రుపాలెం గ్రామంలో బహిరంగ మద్యం వేలంపాట
– ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు
పల్నాడు వెనకబడ్డ ప్రాంతం అని చెప్పి ఖనిజ సంపదను దోచుకెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే లు. పల్నాడు ప్రాంతంలో నాగార్జునసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఉంచుకొని , పల్నాడు ప్రాంతానికి ఒక్క చుక్క తాగునీరు కూడా అందించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు.
పల్నాడు ప్రాంతంలోని వైయస్సార్సీపి ఎమ్మెల్యేలు దోపిడి దొంగలు మాదిరిగా మైనింగ్ చేసి, నెలనెలా వచ్చి సూట్ కేసులు తీసుకువెళ్తారు తప్ప, పల్నాడు ప్రాంత అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు
పల్నాడు ప్రాంతం అభివృద్ధిపై జనసేన నాయకులు స్థానిక గురజాల శాసనసభ్యునికి సవాల్ విసిరితే .. ఎవర్నో నలుగురిని నాలుగు స్క్రిప్ట్లు రాసి పంపించారని, జనసేన నేతలు అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆ నలుగురు వైసీపీ కార్యకర్తలు పలాయనం చిత్తగించారన్నారు. జనసేన పార్టీ దమ్మున్న పార్టీ అని, ప్రజలు ఆలోచించుకొని రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నిలబడి అధికారం కట్టబెడితే ప్రజలకు దమ్మున్న రాజకీయం అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు.
రాష్ట్రంలో మద్యపానం నిషేధం విధిస్తామని హామీ ఇచ్చి , ఈరోజు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సీపీ పార్టీ ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుపుతోందని ఆరోపించారు రాష్ట్ర నాయకులని ఆదర్శంగా తీసుకొని, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఒక అడుగు ముందుకేసి భట్రుపాలెం గ్రామంలో బహిరంగ మద్యం వేలంపాట నిర్వహించారని, రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అసలు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు