నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ రీజియన్ సారథ్యం లో, ఆదిత్య మె హతా ఫోండేషన్ సహకారం తో, కేంద్రియ – నవోదయ విద్యా సంస్థలలో ఉన్న పారా స్పోర్ట్స్ (భిన్న సామర్ధ్యము గల) విద్యార్థులలో ఉన్న క్రీడా నైపుణ్యం వెలికి తీయుటకు 18-4-23 నుండి పారాస్పోర్ట్స్ సెలెక్షన్స్ ప్రారంభ మైనాయి.
నవోదయ విద్యాలయ సంస్థ నుండి వరంగల్ క్లస్టర్, గుంటూరు క్లస్టర్, బెంగళూరు క్లస్టర్, దార్వాడ్ క్లస్టర్, యాదగిరి క్లస్టర్, త్రివేంద్రం క్లస్టర్, మరియు త్రిసూర్ క్లస్టర్ విద్యార్థులు విచ్చేయగా,
కేంద్రయ విద్యాలయ సంస్థ నుండి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ , సికింద్రాబాద్ క్లస్టర్ విద్యార్థులు విచ్చేసారు
మొత్తం 150 మంది బాలురు,80 మంది బాలికలు విచ్చేసారు. మొదటి రోజు ముందుగా క్రీడా విద్యార్థుల్లో శక్తి నింపడానికి ప్రీ బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేయడమైనది. ఆ తరువాత నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ రీజియన్, డిప్యూటి కమిషనర్ టీ. గోపాల కృష్ణ చేతుల మీదుగా భిన్న సామర్ధ్యము గల విద్యార్థులకు వీల్ చైర్స్అం దించబడ్డాయి. విద్యార్థులకు ఐడెంటిటీ కార్డ్స్ అందించారు.
ఆదిత్య మెహత ఫోండేషన్ ఆధ్వర్యములో అడ్వాన్స్ శిక్షణ కై కావలసిన స్క్రీనింగ్ టెస్టు లు నిర్వహించ బడ్డాయి విద్యార్థులు నేడు స్విమ్మింగ్, సైక్ లింగ్, పవర్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, మరియు టై క్వెందో ఈవెంట్ లలోఅత్యంత ఉత్సాహం తో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. నవోదయ రంగారెడ్డి విద్యాలయ ప్రాచార్యులు శ్రీ డేనియల్ రత్నకుమార్ కార్యక్రమాలన్నిటిని పర్యవేక్షించారు.
జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డిలో రెండవ రోజు పారాస్పోర్ట్స్ క్రీడాకారుల ఎంపిక
జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డి లో పారా స్పోర్ట్స్ క్రీడాకారుల ఎంపిక రెండవ రోజు కొనసాగింది. జవహర్ నవోదయ విద్యాలయం రంగారెడ్డి లో ఆదిత్య మెహతా ఫోండేషన్ స్పోట్స్ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన నిష్ణాతులు నవోదయ, కేంద్రీయ విద్యాలయ దివ్యాంగ విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. 150 మంది బాలురు 80 మంది బాలికలు ఈ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. ఇక్కడకు వచ్చిన ప్రతి విద్యార్థి అన్ని ఈవెంట్స్ లో పాల్గొనేటట్టు చూడటం ఈ సెలక్షన్ ప్రత్యేకత. ఆయా క్లస్టర్ల నుండి వచ్చిన విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్లో స్క్రీనింగ్ నిర్వహించడం విశేషం.ప్రత్యేక నైపుణ్యం గల క్రీడాకారులతోపాటు వారి వెంట వచ్చిన సహాయకులు ఎస్కార్ట్ టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.