Suryaa.co.in

Andhra Pradesh Telangana

విద్యార్థి తల్లిదండ్రులారా.. ప్రైవేట్‌కాలేజీల దోపిడీ గమనించారా?

– నూతన సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం…
– ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఏకంగా 30% ఫీజుల పెంపు…
– ఏమి తాకట్టు పెట్టి ఈ ఫీజులు కట్టాలని…
– అల్లాడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు…
– విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్

నూతన విద్యా సంవత్సరం అడ్మిషన్లు ముందుగా నమోదు చేసుకుంటే ఫీజులో రాయితీ ఇస్తామని అక్టోబర్ నుండే ప్రైవేట్ జూనియర్ కళాశాలలో జరుగుతాయి. అడిగే అధికారి… ప్రశ్నించే తల్లిదండ్రి ఉండరు?

ఇంటర్ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. నారాయణ విద్యాసంస్థల లలో చదివే ఇంటర్ మొదటి‌ సంవత్సరం చదివే విద్యార్థులకు రెండవ సంవత్సరం ఫీజు లు ఏకంగా 30% పెంపు చేశారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని కార్పొరేట్ ప్రవేటు జూనియర్ కళాశాలల్లో ఉంది.

అది నారాయణ..శ్రీ చైతన్య … అని కాదు. వీరిని చూసి అన్ని కాలేజీలలో 30% ఏకంగా పెంచారు.

(ఉదాహరణకు నారాయణ ప్రభుత్వ అనుమతులు లేని రెసిడెన్షియల్ కళాశాలలో జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థికి ₹ 2 70000 రూపాయలు.. రెండవ సంవత్సరం ఫీజు ఆ విద్యార్థి ₹ 3,50,000) ఇది కధ
ఎక్కడో ప్రశ్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎందుకు చేర్చకూడదు? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిస్తే, మా పిల్లలకు మార్కులు ర్యాంకులు రావు అందుకని ఈ తల్లిదండ్రుల సమాధానం.
మా ప్రశ్న…. ఎన్ని వేల మంది ఎన్ని ర్యాంకులు వచ్చాయి?

మీరు చెప్పే చదువులకు వచ్చే మార్కులు .. విద్యార్థి ఉన్నత విద్యార్థులకి దోహదపడుతున్నదా?
(ఈ ర్యాంకులు మార్కుల బాగోతం మరలా మాట్లాడుకుందాం.. ఎలా వస్తున్నాయో ఎలా తెప్పిస్తున్నారు)
రాష్ట్రంలో 2024 నాటికి మొత్తం..3381 ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల లు ఉన్నాయి..
అందు లో 470 ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉన్నాయి వీటిని కూడా మూసేందుకు సిద్ధంగా ఉన్నారు?
ఇక రాష్ట్రంలో 2600 పై చిలుకు ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి…. అంటే దోపిడీ ఏ విధంగా జరుగుతున్నది. దానికి ప్రభుత్వాలు అధికారులు తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుందా?

మిగిలినవి … కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్‌ స్కూల్స్‌, హైస్కూల్‌ ప్లస్‌లు, సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ సంస్థల పరిధిలోని కాలేజీలు ఇంటర్‌ విద్యను అందిస్తున్నాయి.
ఈ కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిన పిల్లలు ర్యాంకులు రాక.. మార్కులు రాక మరల అప్పులు చేసి, ఇంజనీరింగ్ మెడిసిన్ లేదో మరో ఉన్నత విద్యకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే ఇది వాస్తవ కాదా.?
ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులారా….
మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడని బట్టి పట్టించే కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కళాశాలలో మన పిల్లల్ని చదివిద్దామా ?

చదువు పేరుతో ఒత్తిడికి గురై…ఆత్మహత్యలు లేని…
తల్లిదండ్రులను అప్పుల పాలు కాకుండా
మన పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం…

అందుకనే ప్రభుత్వ రంగంలో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలి.

1)నూతన విద్యా విధానం 20 20 ప్రకారం రాష్ట్రంలో 2)పాఠశాల అనంతరం ప్లస్ టు విధానాన్ని అమలు చేయాలి.
3)ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం బోధన ఉండాలి.
4)రాష్ట్రంలో విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్(APSCRMC )ఏర్పాటు చేయాలి.

డిమాండ్లను ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నది. న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
తల్లిదండ్రులారా మనవి..
విద్యా వ్యవస్థ మారాలనుకునేవారు… ప్రైవేట్ కళాశాలలో చదివే మీరు కట్టిన ఫీజు రసీదులను
లేదా ఇప్పుడు రెండవ సంవత్సరం పూర్తి అయిన మీ పిల్లల రసీదులను పేరెంట్స్ అసోసియేషన్ నెంబర్లకు వాట్సప్ చేయగలరు.

” అక్షరం ఓ ఆయుధం… ఇదే మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం”.

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.
+ 9133366449…+919100827229…+919949797675…+91 6305313558….+91 89191 26847 +919849575343 ….+91 98494 02074…+91 96528 30189……+91 97033 26026….+91 98499 56953

LEAVE A RESPONSE