Suryaa.co.in

Andhra Pradesh

వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం:సజ్జల

– వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల కోలాహలం
మాకు పార్టీయో ముఖ్యం ..వ్యక్తులు ముఖ్యం కాదని, సమీకరణలను బట్టి మా పార్టీ స్టాండ్ మారుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం లో స్దానిక సంస్థలు కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు లు నామినేషన్ లు వేశారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన సజ్జల మాట్లాడుతూ సామాజిక సమీకరణలో బాగంగానే గుంటూరు జిల్లాకు చెంది మర్రి రాజశేఖర్ కు సీటు ఇవ్వలేదని చెప్పారు. మాకు వ్యక్తుల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. బిసీ , ఎస్సీ. ఎస్టీ ,మైనారిటీ లకు పెద్ద పీటు వేసిన నేపథ్యంలో, అగ్ర వర్ణాల వారికి కొద్దిగా సీట్లు తగ్గిన మాట వాస్తవేమేనని స్పష్టం చేసారు. నామినేషన్ కార్యక్రమానికి జిల్లాలో ని వైసిపి ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్య లో హాజరయ్యారు.
తొలుత కృష్ణ నగర్ లోని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇంటి వద్ద నుంచి భారీ ఊరేగింపు తో కలెక్టర్ కార్యాలయం కు చెరుకున్నారు. గుంటూరు నగరం అంతా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ లతో కోలాహలంగా మారింది.ఈ నామినేషన్ కోలాహలంలో సజ్జలతో పాటు మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ మేయర్ కొనా రఘుపతి గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు నంబూరి శంకర్రావు, షేక్ ముస్తాఫా, మద్దాల గిరిధర్, అంబటి రాంబాబు, విడుదల రజిని, కిలారి రోశయ్య, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE