– వాలంటీర్లపై పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలగొడతారు
– వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పీకలేవు పవన్..!
– వాలంటీర్ల కాళ్ళు కడిగి పవన్ క్షమాపణలు చెప్పాలి
– లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారు
– జగన్ నే కాదు… వాలంటీర్లను చూసినా పవన్‌కి వణుకే
– కొవిడ్ లో జనసైనికులు సైతం వాలంటీర్ల సేవలు పొందినవారే..
– వార్డు మెంబరు కూడా కాని పవన్ కు కేంద్ర నిఘాసంస్థలు రిపోర్టు ఇచ్చాయా..?
– మిస్సింగ్ కు.. హ్యూమన్ ట్రాఫికింగ్ కు తేడా తెలుసుకో..!
– మిస్సింగ్ కేసుల్లో టాప్ టెన్ స్టేట్స్‌లో ఏపీ లేనే లేదు
– తెలంగాణ ఆరో స్థానంలో ఉంది.. కేసీఆర్‌ను నీలదీయగలవా..?
– నీ దత్తడాడీ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై నోరెందుకు తెరవలేదు..?
– నీ తల్లిని తిట్టిని వాళ్ళను గెలిపించమని అడగటానికి సిగ్గు ఎక్కడ లేదు?
– దమ్ముంటే ..
– గోదావరి జిల్లాల్లో వరదలొస్తే నువ్వు, నీ దత్తడాడీ ఎక్కడ పవన్..?
– ఆ వాలంటీర్లే పీకల్లోతు నీళ్లల్లో దిగి సరుకులు అందించారు
– ఇది సమాంతర వ్యవస్థ కాదు.. ప్రజలకు సేవ చేస్తోన్న గొప్ప శక్తి
– పవన్ కల్యాణ్ కు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ వార్నింగ్
జగన్‌ని చూస్తేనే కాదు… వాలంటీర్లను చూసినా పవన్‌కి వణుకే:
– దత్తపుత్రుడైన ఇరిటేషన్ స్టార్ మూడు రోజులుగా నోటికి అడ్డూ అదుపూ లేకుండా వాలంటీర్లను, మహిళలను, ముఖ్యమంత్రి ని గౌవరం లేకుండా మాట్లాడుతున్నాడు.
– ఇంత వరకూ జగన్ గారి పేరు వింటేనే పవన్‌కి వణుకు అనుకున్నా… కానీ జగనన్న తీసుకొచ్చిన వాలంటీర్లను చూసినా పవన్ కళ్యాణ్‌కు వణుకేనని ఇప్పుడు అర్ధం అవుతోంది.
– ఆయన పదే పదే రెండు మూడు రోజులుగా వాలంటీర్ వ్యవస్థ నడ్డివిరుస్తా అంటున్నాడు. నువ్వు నడ్డివిరవడం కాదు కనీసం వారి వెంట్రుక కూడా పీకలేవు.
– స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ వ్యవస్థ ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించి సేవలు అందిస్తోంది.
– ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వ పథకాలను, సేవలను ప్రజల ముంగిటకు వచ్చేలా వారు పనిచేస్తున్నారు.
– పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు 2024లో ఓడిపోతాం అని స్పష్టంగా అర్ధం అయ్యింది.
– ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా..కరోనా నుంచి మొదలు మొన్నటి వరదల వరకూ సాయం కోసం ప్రజలు మొదట కాల్ చేసేది వాలంటీర్‌కే.
– జగనన్న సురక్ష ద్వారా మిగిలిన అరకొర సమస్యలు కూడా పరిష్కారం జరుగుతున్నాయి.
– ఇక ప్రతి కుటుంబం కూడా జగన్ గారికే ఓటేస్తుంది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు.
– మీ పాలనలో మాదిరిగానే ప్రజలకు ఏమీ అందకూడదు.. కరోనా లాంటి ముహమ్మరి వస్తే జనం చచ్చిపోవాల్సిందేనని మీరు భావిస్తున్నారు.
– లబ్ధిదారులకు ఇళ్లు ఉండకూడదు..ఎవరికి ఏ కష్టం వచ్చినా పలకరించడానికి ఎవరూ ఉండకూదన్నది మీ కోరిక.
– ఇలాంటి దరిద్రమైన ఆలోచనలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉన్నారు.
– చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కళ్యాణ్ సిగ్గు ఎగ్గూ లేకుండా చదువుతున్నాడు.
– వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను అంటూనే దత్తపుత్రుడితో విషం చిమ్మిస్తున్నాడు:
– గతంలో చంద్రబాబు కూడా ఇదే విధంగా వాలంటీర్లను చులకన చేసి హేళనగా మాట్లాడాడు. ఐదు వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగమా…వీళ్లు మొగుళ్లు లేనప్పుడు తలుపులు కొట్టి యాగీ చేస్తున్నారంటూ చులకనగా మాట్లాడాడు.
– కరోనా సమయంలో దేశంలోనే బెస్ట్ సర్వీసెన్‌ను వాలంటీర్ల ద్వారా అందిస్తే కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు జగన్ ని శెభాష్ అన్నాయి.
– దీంతో చంద్రబాబుకు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటో అర్ధం అయింది.
– అందుకే నేను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను అంటూనే, మరోవైపు తన దత్తపుత్రుడితో విషం చిమ్మిస్తున్నాడు.
– పవన్ మాట్లాడిన మాట వాలంటీర్‌లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారనేది. ఒక మహిళగా నేను ఇది సహించలేను.
– వీరు ఇళ్లకు వెళ్లి ఆడవాళ్లను అక్రమ రవాణ చేస్తున్నారని చెప్పడం దారుణం. ఇది ముమ్మూటికీ మహిళల్ని కించపరచడమే.
– వాలంటీర్ల సర్వీసులను నేను కళ్లారా చూసినదాన్ని… నేను పవన్ కళ్యాణ్‌కు చెప్తున్నా… ఇప్పటికైనా చేసిన తప్పుకు చెంపలేసుకుని, వాలంటీర్ల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారు.
అబద్ధాల్లోనూ పవన్ కు క్లారిటీ లేదు:
– పవన్ మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలే. రాష్ట్రంలో 15వేలకు పైగా సచివాలయాలు ఉంటే అందులో 2.60 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.
– అందులో 70 శాతం మంది అంటే 1.80 లక్షల మంది మహిళలే. మహిళలే మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నారా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నా.
– అసలు ఈ వాలంటీర్ అనేవారు ఏ గ్రామంలో… ఏ వీధిలో కుటుంబం ఉంటుందో ఆ కుటుంబాల నుంచి ఒకరు వాలంటరీగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు.
– తమ గ్రామానికి, తమ చుట్టుపక్కల ఉన్న పేదలకు తమవంతు సాయాన్ని అందించాలని ఈ వాలంటీర్ ఉద్యోగంలో చేరారు.
– అలాంటి వ్యక్తుల్ని పట్టుకుని, ఆ వ్యవస్థ వల్లే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారనడం సిగ్గుచేటు.
– పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్కలు ఎవరికీ అర్ధం కావడం లేదు. సెకన్ సెకన్‌కి నీ లెక్కలు మారిపోతున్నాయి..
– ఒక సారి 30వేలు అంటావు.. ఒక సారి 25వేలు, మరో సారి 15 వేలు అంటావు. నువ్వు చెప్పే అబద్ధంలోనూ నీకు క్లారిటీ లేదు.
ఆ నిఘా వర్గాలు ఎవరు..?:
– కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు డేటా ఇవ్వడం సాధారణంగా జరిగేదే..
– కానీ నీకు సమాచారం ఇచ్చిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు..?
– కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నీకు డేటా ఎవరిచ్చారు..?
– ఎన్సీఆర్బీ డేటాలో మిస్సింగ్ కేసుల్లో టాప్ టెన్ స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్ లేనే లేదు. ఇప్పుడేమంటావ్ పవన్ కళ్యాణ్…?
– ఆరో స్థానంలో తెలంగాణా ఉంది.. కేసీఆర్ గురించి నీవు ఇలానే మాట్లాడగలవా..?
– ఎందుకంటే, ఇలానే పిచ్చివాగుడు వాగితే, వాళ్లు నీ మక్కెలు ఇరగ్గొడతారు..హైదరాబాద్‌లో నువ్వు బతకలేను అన్న భయం కాబట్టి నువ్వు అక్కడ మాట్లాడవు.
– కానీ టాప్10లో లేని ఏపీ గురించి, సేవలందించే వాలంటీర్ల గురించి ఇంత చీప్ గా మాట్లాడుతున్నావంటే దానికి అర్ధం ఏమిటి..?
– నువ్వు కలిసినా, ఇంకెవరు కలిసినా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయలేమని మీకు బాగా అర్ధం అయ్యింది. అందుకే ఇటువంటి చీప్ ట్రిక్స్.
మీ అమ్మను తిట్టిన వాళ్ళనే గెలిపించమని సిగ్గు లేకుండా అడుగుతావా?:
– మీ అమ్మను, భార్యను, పిల్లలను తిట్టింది ఎవరో గుర్తు చేసుకో పవన్ కళ్యాణ్.
– నువ్వే గతంలో ట్వీట్ చేశావ్… నీ ట్వీట్‌లు నీకు గుర్తు లేకపోతే నేను పంపిస్తా.
– 2018 ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 12గంటల 15 నిమిషాలకు నువ్వు ట్వీట్ చేశావు.
– వారాహి అంటే అమ్మవారు అంటూ ఆ వాహనంపైనే చెప్పులేసుకుని.. మీ అమ్మను తిట్టిన వారిని గెలిపించమని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు.
– టీడీపీ ప్రభుత్వం రావడానికి అండగా నిలబడినందుకు… నాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదా.. అని ఆనాడు నీవే టీడీపీ నేతలను, చంద్రబాబును ప్రశ్నించావ్.
– ఏపీ సెక్రటేరియట్ వేదికగా చేసుకుని చంద్రబాబు కుమారుడు, ఆతని స్నేహితుల ఆధ్వర్యంలో ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్‌లలో నీ కుటుంబంపై నిరవధికంగా డిబేట్లు చేస్తూ… అత్యాచారం జరిపారని నువ్వే ట్వీట్లు చేశావ్..
– 2018 ఏప్రిల్ 20వ తేదీ తెల్లవాజామున 4.09 గంటలకు నువ్వు ఈ ట్వీట్ చేశావ్.
– పది కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి…నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి..నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యంగా పచ్చి బూతులు తిట్టించి దాన్ని పదే పదే ప్రసారం చేసి, వాటిని టీడీపీవ్యక్తులు సర్క్యూలేషన్ చేశారని చెప్పావు.
– మరి ఏబీఎన్ రాధాకృష్ణ నిన్ను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు సిగ్గులేకుండా ఎందుకు వెళ్లావ్..?
– నిన్ను నమ్ముకుని నీ కోసం పనిచేస్తున్న జనసైనికుల కోసం నువ్వు ఏం చేశావ్..?
– ఇదే బాలకృష్ణ నీ జనసైనికులను అలగా జనం, సంకర జాతి నాకొడుకులు… అని మాట్లాడితే నువ్వు ఎగురుకుంటూ వెళ్లి ఇంటర్వ్యూ ఎందుకిచ్చావ్..?
– మీ రాజకీయం కోసం, మీ ప్యాకేజీ కోసం మీ అమ్మను, నిన్ను, నీ జనసైనికులను తిట్టిన వారిని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నావు.
అసలు మిస్సింగుకి, అక్రమ రవాణాకి తేడా తెలుసా..?:
– అసలు నీకు జగన్ ని అనే అర్హత ఉందా..? ఏ రోజైనా జగన్ మీ పేరుకానీ, మీ అమ్మ, మీ భార్యా పిల్లల పేర్లు ఎత్తి మాట్లాడటం ఎక్కడైనా గమనించారా..?
– మహిళలపై నీకు మాత్రమే ఏదో ప్రేమ ఉన్నట్లు, వారిని కాపాడటానికి అన్నట్లు మాట్లాడుతున్నావు.
– అసలు మిస్సింగ్‌కి అక్రమ రవాణాకి తేడా తెలుసా నీకు..?
– మిస్సింగ్ అంటే రకరకాల కారణాలతో ఇంట్లో నుంచి పారిపోవడం… లేకపోతే ప్రేమ వివాహాలు చేసుకోవడం.. అక్రమ రవాణా అనేది ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపడం.
– నువ్వు మద్దతు పలుకుతున్న నీ దత్తడాడీ ఉన్నప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్ ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.
– ఆడవాళ్లకి డబ్బులు అప్పుగా ఇచ్చి…ఆ డబ్బు కట్టలేని వారిని వ్యభిచార కూపంలో దించితే మేమంతా ఆందోళనలు చేశాం.
– ఆ రోజు నువ్వు మాట్లాడలేదు..దానికోసం ఫైట్ చేసిన నన్ను రూల్స్‌కి విరుద్ధంగా అరెస్ట్ చేశారు…అప్పుడూ నువ్వు మాట్లాడలేదు.
– ఏం.. హెరిటేజ్ ఐస్‌క్రీంతో నీ నోరు నిండిపోయిందా..? ఎందుకు మాట్లాడలేదు..?
పాదాభివందనం చేయాల్సింది పోయి హ్యూమన్ ట్రాఫికర్లు అంటావా..?:
– జగన్ గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి, ప్రజలకు సర్వీస్ చేస్తున్న వాలంటీర్లను చూసి సహించలేక రాష్ట్రానికి వస్తున్న మంచి పేరును చెడగొట్టాలని చూస్తున్నారు.
– నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు..ఈ రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా ఉండకూడదు అని కంకణం కట్టుకున్నావనిపిస్తోంది.
– నువ్వు మాట్లాడుతున్న వాలంటీర్ వ్యవస్థ పారదర్శక పరిపాలనలో ఒక విప్లవం.
– నువ్వు మాట్లాడితే విప్లవం అంటావే తప్ప ఏ సమస్య గురించి కూడా 24 గంటలు ధర్నా, నిరసన చేయడం చేతకాని వాడివి.
– ఈ వ్యవస్థ రాష్ట్రంలోని పేదలకు రూ.2.25 లక్షల కోట్లు పైసా లంచం లేకుండా డీబీటీ ద్వారా ఆప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించారు.
– సాక్షాత్తు ముస్సోరి ఐఏఎస్ శిక్షణ సిలబస్‌లో ఈ వ్యవస్థ స్థానం సంపాదించింది అంటే ఎంత గొప్ప వ్యవస్థ అనేది నువ్వు తెలుసుకోవాలి.
– కోవిడ్ సమయంలో మన వాలంటీర్లు చేస్తున్న సేవలు చూసి కేరళ రాష్ట్రం, బ్రిటన్ దేశస్తులు కొనియాడారు. ఈ వ్యవస్థను వాళ్లు కూడా అమల్లోకి తెచ్చుకున్నారు.
– ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లను అనరాని మాటలు మాట్లాడుతున్నావంటే ఇంతకంటే సిగ్గు చేటు ఉందా..?
– కరోనా సమయంలో చనిపోయిన వారికి, వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయడానికి భయపడితే వాలంటీర్లు వారికి గౌరవంగా దగ్గరుండి అంత్యక్రియలు చేశారు.
– అలాంటి వారికి పాదాభివందనం చేయాల్సింది పోయి..ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.
ఏ సచివాలయానికి వెళదామో సెలక్ట్ చేసుకో.. :
– రాష్ట్రంలో ఏ సచివాలయానికి వెళ్దామో నువ్వు సెలక్ట్ చేసుకో..
– నా నగరి వస్తావా..నువ్వు ఓడిపోయిన భీమవరం, గాజువాక..ఏదైనా నేను రెడీ.
– నీకు ఎలాగూ పొద్దున్నే లేచే అలవాటు లేదు..అలారం పెట్టుకో.
– ఎందుకంటే వాలంటీర్లు తెల్లవారుజామున 4 గంటలకే బయలు దేరతారు. 5 గంటలలోపు తలుపు తట్టి ఫించన్ ఇస్తారు.
– ఆ పింఛన్ ఇచ్చే అవ్వాతాతలను అడగండి..వాలంటీర్ ఎలాంటి వాడని..
– అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నాడా అని అడగండి అప్పుడు వాళ్ళే నీకు బుద్ధి చెబుతారు.
– వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, ఆసరా తదితర పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు కోసం పనిచేసిన వాలంటీర్ గురించి ఆ అక్కచెల్లెమ్మలను అడగండి. పరకతో దెబ్బలు కొడతారు.
నీ బోడి గౌరవం ఎవరికి కావాలి..?:
– జగన్ గారిని గౌరవించను..ఏకవచనంతో పిలుస్తాను అంటున్నాడు.
– ఈ రాష్ట్ర ప్రజలు జగనన్నను గుండెల్లో పెట్టుకుని కొలుస్తున్నారు.
– నీ బోడి గౌరవం.. నువ్వు ఇస్తే ఎంత..? ఇవ్వకపోతే ఎంత..?
– 36 ఏళ్లకే జగన్ మొదటి సారి ఎంపీ అయ్యాడు..38 ఏళ్ల వయసులో సొంత పార్టీ పెట్టి 5లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు.
– 41 ఏళ్లకే 67 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిగా, 46 ఏళ్లకే 151 సీట్లతో తిరుగులేని సీఎంగా, జగన్ అనే నేను అని ప్రమాణస్వీకారం చేశారు.
– నీకు గాడిదలా 55 ఏళ్లు వచ్చాయి.. కనీసం ఎంపీటీసీ కూడా కాలేకపోయావ్.
– నీకు దమ్ముంటే సింగ్యులర్‌గా పిలవడం కాదు.. జగన్ అన్నతో సింగిల్‌గా పోటీ చెయ్..
– 175 నియోజకవర్గాల్లో జనసేన తరఫున 175 మంది అభ్యర్థులను పెట్టి గెలిచి అప్పుడు సింగ్యులర్‌గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడివి అవుతావ్.
– పనికిమాలిన వాడిలా వయసు పెరిగింది కానీ బుద్ధి లేకుండా ఏకవచనంతో ఒక సీఎంను మాట్లాడుతున్నావంటే నీ తల్లి నీకు నేర్పించిన మేనర్స్ ఇదేనా..?
– ఆమె గొప్ప తల్లి…నీవల్ల అందరూ ఆమెను అనే పరిస్థితి. తల్లి సరిగ్గా పెంచి ఉంటే ఇలా ఎందుకుంటాడు అనుకుంటున్నారు…ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు.. అమ్మా…నన్ను క్షమించు…
గన్ పట్టుకు తిరిగే వాడు క్రిమినలా..? ప్రజలకు సేవ చేస్తున్న వారు క్రిమినలా..?:
– ఎవరు క్రిమినల్.. రోడ్లపై గన్‌లు పట్టుకుని తిరిగే వాడు క్రిమినలా..?
– లేక ప్రజల కోసం ఇంతగా సేవచేస్తున్న ముఖ్యమంత్రి క్రిమినలా…?
– ఎప్పుడూ మేం అధికారంలోకి వస్తే బట్టలూడదీసి కొడతాం.. లాక్కెల్లి కొడతాం.. అంటూ క్రిమినల్‌లా మాట్లాడుతుంది ఎవరు..? , నువ్వు కాదా..
– నువ్వు అధికారంలోకి వస్తే కాదు…మేం ఇప్పుడు అధికారంలోనే ఉన్నాం…జగన్ గారు నీలానే ఆలోచిస్తే నువ్వు అనే మాటలన్నీ జరుగుతూ ఉండాలి.
– వయసులో చిన్నవాడైనా పెద్ద మనసుతో, ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం పరితపించే ముఖ్యమంత్రి కాబట్టి, మీరంతా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడగలుగుతున్నారు.
– జగన్ గారి పేరు చెప్తే అతనో క్రియేటర్ అంటున్నారు.
– 1972 తర్వాత ఈ దేశంలో 51 శాతం ఓట్లు సంపాదించిన ఘనత ఒక్క జగన్ గారికే సాధ్యమైంది.
– ఒంటిచేత్తో 86 శాతం సీట్లను సాధించిన నాయకుడు వన్ అండ్ ఓన్లీ జగన్ గారే.
– 3,648 కిలో మీటర్ల పాదయాత్రను దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ముందుకు తీసుకెళ్లిన వన్ అండ్ ఓన్లీ జగన్ .
– రాష్ట్రాన్ని గ్రోత్ రేట్‌లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా నిలిపారు.
– రాష్ట్రం అప్పుల్లో, కష్టాల్లో ఉందని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలకు మంచి చేయకుండా తప్పించుకు తిరిగిన చంద్రబాబుకి మద్దతు పలుకుతున్న నువ్వు జగన్ గురించి మట్లాడే అర్హత లేదు.
– ఇంకో సారి ఇలానే మాట్లాడితే ప్రజలే నిన్ను తరిమికొట్టే పరిస్థితికి వస్తాయి.
గోదావరి జిల్లాల్లో వరదలొస్తే నువ్వెక్కడ పవన్..?:
– నువ్వు మాట్లాడుతున్న ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో వరదలొస్తే నువ్వు, నీ దత్త డాడి ఎక్కడికెళ్లారు..?
– కానీ వాలంటీర్లు రేషన్ నుంచి కూరగాయలు వరకూ ఎలా అందించారో నీ కళ్ళకు కనిపించలేదా..
– మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ నువ్వు తిడుతున్న ఆ మహిళా వాలంటీర్లే పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి రేషన్, సరుకులు అందించారు.
– వృద్ధులకు ఆ వరదల్లో ఆరోగ్య సమస్యలు వస్తే భుజాల మీద మోసుకెళ్లి మరీ ట్రీట్‌మెంట్ చేయించిన వాలంటీర్లను చూడండి.
– కోవిడ్ సమయంలో నువ్వు, నీ లోకేశ్, చంద్రబాబు హైదరాబాద్‌లోకి వెళ్లి దాక్కుంటే… నీ జనసేన ఫ్యాన్స్ తో సహా టీడీపీ వారికి కూడా సర్వీస్ చేసింది ఈ వాలంటీర్లే.
– వారింటికి వెళ్లి వారికి వాళ్లకి కావాల్సినవన్నీ అందిస్తే ఈ రోజు నీ మీటింగుకు వచ్చి విజిల్స్ వేస్తున్నారు.
– అలాంటి వాలంటీర్లను … ఇంకో సారి పిచ్చి మాటలు మాట్లడితే పల్లు రాలగొడతారు.
– ఇది సమాంతర వ్యవస్థ కాదు..ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి.
– అది జగన్ గారు క్రియేట్ చేసిన గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ.
– 2024లో జగనన్న వన్స్‌మోర్.. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా.. బైబై బీపీ(బాబు-పవన్) అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– ఇకనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా.