– ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలి
-మంత్రి రోజా
ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? 24 సీట్లకే తోక ఊపుకుంటు చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్నావ్? పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థంకావటంలేదు. ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచావో జనసైనికులకు చెప్పాలి. 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు.
జగనన్న ఓడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారు.వాళ్లలో వాళ్లకే గందరగోళం, ఈ పరిస్ధితిలో 118 స్థానాలు ప్రకటించారు. ఇందులో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ స్థానాలు కూడా ప్రకటించారు, కానీ పవన్ ఎక్కడనుంచి పోటీ చేస్తారో చెప్పలేదు. ఎందుకంటే 1 స్థానంలో ఓడిపోయిన వారికి మొదటి జాబితాలో, 2 స్థానాల్లో ఓడిపోయిన వారికి. రెండవ జాబితాలో పేరు ఇస్తారేమో పవన్ తెలుసుకోవాలి.