– అరవ శ్రీధర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలి
– వైసీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
తాడేపల్లి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచకపర్వం చూశాం. వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఒక మహిళా ఉద్యోగినిని లోబరుచుకుని అత్యాచారం చేసి, అబార్షన్లు చేయించడమే కాదు.దాడులు కూడా చేశారు.
20 నెలలుగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు చట్టాలంటే భయం లేకుండా పోయింది. బాధితురాలిపైనే కేసులు, నిందితులపై మాత్రం ఎలాంటి చర్యలు లేవు. మంత్రి సంధ్యారాణి పీఏ కేసులో నిందితుడు బయట తిరుగుతున్నాడు.ఇది కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం.
మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్… ముందు మీ ఎమ్మెల్యే తాట తీయండి. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కాపాడడానికే పని చేస్తోంది. హోం మంత్రి అనిత పదవి మహిళలకు రక్షణ కోసం కాదు. వైయస్ఆర్సీపీని టార్గెట్ చేయడానికే. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపై రోజుకు 70–80 ఘటనలు జరుగుతున్నాయి. అరవ శ్రీధర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి, జనసేన నుంచి సస్పెండ్ చేసి, ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలి.