– అతనో పెళ్ళిళ్ల విప్లవకారుడు
-జగన్ గురించి తెలిస్తే.. పుస్తకం రాయొచ్చు కదా?
గుంటూరులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
పవన్ ఈజ్ ఏ మ్యాడ్ డాగ్:
నిన్న భీమవరంలో పవన్‌కళ్యాణ్ మాటలు, ఒక రాజకీయ నాయకుడి మాటల మాదిరిగా లేవు. ఒక వీధి రౌడీ, ఒక అసాం«ఘిక శక్తి మాదిరిగా పవన్ మాట్లాడాడు. రాజకీయాలకు తగని వ్యక్తి పవన్‌కళ్యాణ్. అందుకే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదొద్దని ప్రజలకు, ముఖ్యంగా యువతకు చెబుతున్నాం. పవన్‌కు మతి భ్రమించింది. వారాహి ఎక్కుతాడు. ఏది పడితే అది మాట్లాడతాడు. విచ్చలవిడిగా వాగుతాడు.
ఒక విధంగా చెప్పాలంటే హీ ఈజ్ ఏ మ్యాడ్ డాగ్. పిచ్చి కుక్కలా నిన్న స్వైర విహారం చేశాడు. ఇది చాలా దురదృష్టకరం.
అవి పాలసీలపై మాటలా?:
మీరు ఊగిపోతున్నాడంటే కోపం వస్తుంది. చంద్రబాబునాయుడు పంచన చేరి, ఆయన మాటలు విని, ఆయన కోసమే పార్టీ పెట్టి ప్రచారం చేసే ఒక దౌర్భాగ్యకర పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి పవన్‌కళ్యాణ్.
జగన్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, ఆయనకు కోపం వచ్చిందట? ఆయనేమో పాలసీల గురించి, సమస్యల గురించి మాట్లాడుతున్నాడా? ప్రజలు ఆలోచించాలి. ‘చెప్పు తీసుకుని కొడతాను. ఇంట్లో ఉన్న వారిని బయటకు లాగి కొడతాను.. ఇది పాలసీనా?. వైయస్సార్‌సీపీలో ఉన్న కాపు కొడకల్లారా.. ఇది సమస్యనా? పాలసీనా?. నీవు మాట్లాడే బూతులన్నీ పాలసీనా?’.
మళ్లీ పరాభవం తప్పదు:
మళ్లీ చెబుతున్నాం. వచ్చే ఎన్నికలు పేదలు, పెత్తందార్ల మధ్య జరిగే పోటీ. నీవు పెత్తందార్ల పక్షాన నిలబడ్డావు. అందుకే నీకు మళ్లీ ఓటమి తప్పదు.
పవన్ ఒక ఆట ఆడుతున్నాడు. కేవలం డబ్బు కోసమే ఆట. పవర్‌ను చంద్రబాబుకు ఇచ్చి, డబ్బును కాజేయాలని, కులాన్ని అమ్మాలని చూస్తున్నాడు. అందుకే అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తావని అడిగితే దానికి సమాధానం చెప్పడు. ప్రజలకు అన్నీ తెలుసు. వారన్నీ గమనిస్తున్నారు.
వారాహి అనేది ఒక అద్భుతమైన దేవత. ఆ వాహనం ఎక్కగానే చిందులు వేస్తున్నావు. దాంతో ఆ వాహనం ఒక వరాహం. అంటే ఒక పంది మీద ఎక్కిన ఒక మ్యాడ్ డాగ్‌వు నీవు.
ఆ రెండు జిల్లాలనే అమ్మావా?:
వారాహి విజయయాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన పవన్, ప్రతి చోటా పిచ్చి పిచ్చి విమర్శలు చేశారు. విజయం అనేది ఏ కోశాన రాని, వచ్చే అవకాశం లేని పార్టీ జనసేన. ఆ పార్టీ వారాహి విజయయాత్ర అన్న పేరుతోనే సంతృప్తి చెందాల్సిన స్థితి. ఆ రెండు జిల్లాల్లో వైయస్సార్‌సీపీని అస్సలు గెలవనివ్వనని అన్నారు. అది ఒక రాష్ట్ర పార్టీ. అలాంటప్పుడు ఆ వ్యాఖ్యలు ఏమిటి?
అంటే ఆ రెండు జిల్లాలను మాత్రమే చంద్రబాబునాయుడుకు అమ్మేశారా? అనిపిస్తుంది. జనసేన అధికారంలోకి వస్తే, అందరి సంగతి తేలుస్తా అంటున్నాడు. అంటే తాము అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నాడు.
అధికారంలోకి రావాలంటే కేవలం రెండు జిల్లాల్లోనే పోటీ చేస్తే సరిపోతుందా? లేకపోతే 25 లేక 35 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సరిపోతుందా? అసలు మీ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో చెప్పమంటే చెప్పడు.
జగన్ ఎందుకు దిగిపోవాలి?:
ఏమన్నా అంటే జగన్ పదవి నుంచి దిగి పోవాలి అంటాడు. ఆయన ఎందుకు పోవాలి? మరి జగన్ దిగిపోతే ఎవరు రావాలి? అంటే దానికి సమాధానం చెప్పడు.
అనేక సంక్షేమ కార్యక్రమాలు, మంచి పనులు చేస్తున్నందుకు ఆయన పోవాలా? అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నందుకు ఆయన పోవాలా? ఎందుకు పోవాలి? జగన్ పోవాలన్న కోరిక మీకు ఎందుకు వచ్చింది? మీకు అసలు ఏ కష్టం వచ్చింది? పోనీ మీరేమైనా ఆ పదవిలో కూర్చుంటారా? మీకు ఆ బలం ఉందా? దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు జగన్‌గారి ప్రభుత్వం అందిస్తోంది.
(అంటూ.. పథకాలు చదివి వినిపించిన మంత్రి).. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాల్లో నేరుగా నగదు బదిలీ ఎవ్వరూ చేయలేదు.
అలాంటి జగన్ పోవాలా?
పవన్ మీకవి వినిపించడం లేదు:
జగన్‌గారు అధికారం నుంచి పోతే.. ఈ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలన్నీ పోతాయి. అందుకే జగన్‌గారు పోవాలి అనే వారు, అసలు రాజకీయాల నుంచే వెళ్లిపోవాలని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. అయినా మీకు వినిపించడం లేదు.
రాజకీయాల్లో చీడపురుగు:
మేము మాట్డాడొద్దు. ఏమీ అనొద్దు. కానీ ఆయన మాత్రం మమ్మల్ని, జగన్ ని, మా పార్టీలో వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టొచ్చు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరైనా ఆ విధంగా, అంత తప్పుగా మాట్లాడారా?
‘నా కొడకల్లారా’ అనే పదం ఉపయోగించిన పవన్‌కళ్యాణ్, రాజకీయాల్లో ఒక చీడపురుగు. కాదంటారా?. చొక్కాలు విప్పి కొడతాడా? ఏమిటా మాట?. ఇదేమైనా సినిమానా?.
కానీ ఏమీ అనకూడదట? ఆయన విమర్శలను ప్రశ్నించకూడదట? మా మూతులకు సైలెన్సర్ పెట్టుకోవాలట!
నిజానికి వారాహి ఎక్కిన పవన్‌కళ్యాణ్ సైలెన్సర్ పెట్టుకోవాలి.
నీవు చేస్తున్నదేమిటి?:
కులాలు రెచ్చగొట్టను అంటున్నావు. కానీ నీవు చేస్తున్నదేమిటి? ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎందుకు పర్యటిస్తున్నావు? అక్కడి కాపులందరినీ తీసుకెళ్లి, చంద్రబాబు పంచన చేర్చాలనేదే నీ ప్రయత్నం కాదా? పోరాడానంటున్నారు. మీరు ఎవరి కోసం, ఏ పోరాటాలు చేశారు? మైక్ పట్టుకుని ఊగిపోతే పోరాడినట్లా? ఇలాంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉన్నందుకు, అలాంటి నాయకుడు రాష్ట్రంలో తిరుగుతున్నందుకు నవ్వాలో, ఏడవాలో, ఏమనాలో తెలియక ప్రజలు అగమ్యగోచరంగా ఉన్నారు.
ఏ విప్లవం నుంచి వచ్చావు?:
జగన్‌ని ఫ్యాక్షనిస్టు అంటున్నావు. ఆయన రాజకీయం ఏం చూశావు? వైయస్సార్ మరణం తర్వాత ఎన్నో శక్తులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాడు. పోరాడాడు. ప్రజల్లో గెల్చాడు. నీ పార్టనర్ చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొన్నా, అధైర్య పడలేదు.
జగన్ ఫ్యాక్షనిజమ్ నుంచి వస్తే, తాను విప్లవం నుంచి వచ్చానంటాడు. నువ్వు ఏం విప్లవం నుంచి వచ్చావు? ఏం విప్లవం చేశావు? ఏమి పోరాటం చేశావు? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించు. నలుగురు కమ్యూనిస్టు లీడర్ల పేర్లు తెలిసినంత మాత్రాన విప్లవం నుంచి వచ్చినట్లా?
పెళ్ళిళ్ల విప్లవకారుడివి:
ఒక్క విప్లవం మాత్రం చేశావు. వివాహ వ్యవస్థలో అద్భుత విప్లవం చేశావు. గొప్ప సందేశం ఇచ్చావు. అదేమంటే, మీరూ పెళ్లిళ్లు చేసుకోమన్నావు. ఒకటి కుదరకపోవచ్చు. రెండు కుదరకపోవచ్చు.. కానీ ఇన్ని కుదరక పోవడం అంటే నీలోనే తేడా ఉందయ్యా. నీకు పెళ్లి వ్యవస్థ మీద గౌరవం లేదు. పవన్ పెళ్ళిళ్ల విప్లవవీరుడు. ఒక పెళ్లిళ్ల వీరుడు. భార్యతో కుదరకపోతే మరో పెళ్లి చేసుకోమంటున్నాడు. అంత దుర్మార్గమైన మాటలు పవన్‌వి.
అమ్ముడుపోయే రాజకీయం:
జగన్ చాలా కష్టపడ్డారు. ఎంతో పోరాడి అధికారంలోకి వచ్చారు. ఆయన పేదల పక్షాన నిలబడ్డ సహృదయుడు. మరి నువ్వు చంద్రబాబు పక్షాన నిలబడి, ఆయన పల్లకి మోస్తూ, పిచ్చికుక్కలా మొరుగుతున్నావు. ఒక్క విషయంలో కూడా మీకు సరైన అవగాహన లేదు. కానీ పరిపాలన చేస్తామంటున్నావు.
నాకు సంస్కారం ఉందని నీకు నీవే చెప్పుకుంటున్నావు. అందుకే నీవు వ్యాన్ దిగిన తర్వాత, నా ప్రసంగం ఎలా ఉందో తెలుసుకో.
ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు సృష్టించి అలజడి సృష్టించాలన్న యావ తప్ప మీకు ఏ విషయంపై అయినా చిత్తశుద్ధి, స్పష్టత లేదు.అందుకే పవన్‌కళ్యాణ్‌ను నమ్మొద్దు. అమ్ముడుపోయే రాజకీయాలు చేస్తాడు.
సిద్ధాంతాలు అస్సలు తెలియవు. కానీ తెలిసినట్లు నటిస్తాడు. అందుకే కొందరి పేర్లు చెబుతుంటాడు. పవన్, అసలు నీ బ్రతుకు ఏమిటి? నీ దగ్గర ఉన్న సరుకు ఏమిటి?
పుస్తకం రాయొచ్చు కదా?:
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 2.23 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ అయ్యాయి. ఎక్కడా అవినీతికి తావు లేదు. అంత మంచి పరిపాలన అందిస్తున్న జగన్ గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు.
జగన్‌గురించి మొత్తం తెలుసు అంటున్నావు కదా! ఒక పుస్తకం రాయి. ప్రజలు చదువుకుంటారు. నీవు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావు. ఆయన ఒంటరిగా పోరాడి, ప్రజల్లో నిల్చి 151 సీట్లు గెల్చుకున్నారు.
పవన్‌కు ధైర్యం లేదు:
హైదరాబాద్ నుంచి రావడం, మమ్మల్ని తిట్టడం, తిరిగి మాతో తిట్టించుకుని తిరిగి వెళ్లిపోవడం.. ఇదంతా ఎందుకు పవన్? అందుకే రాష్ట్రంలో ఉన్న మేధావులు, ప్రజలను ఒకటే గుర్తు చేస్తున్నాం. పవన్ ఈజ్ ఎ మ్యాడ్ డాగ్. అందుకే పిచ్చిగా వాగుతున్నాడు.
ఒక విధంగా చెప్పాలంటే ఇలా మాట్లాడేవాడు అధైర్యవంతుడు. నిజంగా ధైర్యవంతుడు అయితే ఇలా మాట్లాడడు. తెగించి వచ్చానంటావు. ఏముందని తెగించి వస్తున్నావు. సినిమాల్లో నటిస్తున్నావు. వారాంతంలో వస్తున్నావు. వారాహి ఎక్కి పిచ్చిగా ప్రసంగాలు చేస్తున్నావు.
తెగించి రావడం ఏమిటి? నీవేమైనా యుద్ధానికి వెళ్తున్నావా?. అని మంత్రి అంబటి రాంబాబు పనవ్‌ను నిలదీశారు.