Suryaa.co.in

Andhra Pradesh

పిఠాపురం నియోజక వర్గం టీడీపి ఎస్సీ సెల్ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ

‘నా మీద పడిన మొదటి కేసు హైదారాబాద్ భీంరావ్ బాడ అని అంబేద్కర్ పేరుతో ఉన్న కాలనీని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తే, వారికి అండగా నిలబడేందుకు వెళ్లి పోరాడినందుకు కేసు పడింది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం నియోజక వర్గం అభ్యర్థి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం చేబ్రోలులోని తన నివాసంలో పిఠాపురం నియోజక వర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నా దగ్గర బలంగా పోరాడే ఎస్సీ నాయకుల కంటే, బలమైన ఇంటలెక్చువల్ ఎస్సీ నాయకులు ఉన్నారు. అంబేద్కర్ విద్యా విధాన పథకం పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకం అని పేరు మార్చింది వైసీపీ ప్రభుత్వం. అంబేద్కర్ పేరు తీసేసే హక్కు దేశంలో ఎవరికీ లేదు. ఆయన పేరు పెంచే ప్రయత్నం చేయాలి తప్ప పేరు తీసేసే పని చేయకూడదు. నేను అంబేద్కర్ భావజాలం అర్దం చేసుకున్న వాడిని, అన్ని వర్గాలను సమాన న్యాయం జరగాలి అని కోరుకునే వాడిని.

రాజధాని భూ సమీకరణ సమయంలో దళితుల అసైన్డ్ భూములకు తక్కువ ధర, ఇతర స్థలానికి ఎక్కువ ధర చెల్లిస్తున్నారని నాకు చెప్తే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను.

నేను ఎస్సీల గౌరవాన్ని ఏ రోజు కూడా తగ్గించే ప్రయత్నం చెయ్యను. నా జీవితంలో చాలామంది ఎస్సీ స్నేహితులు, టీచర్లు ఉన్నారు. వారి వల్లనే నేను ఇంత బలంగా మాట్లాడగలుగుతున్నాను.

ఇక్కడ ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక ప్రతీ ఒక్కరికీ వచ్చి సమస్యలు చెప్పుకొనేలా, నన్ను కలిసేలా ఏర్పాట్లు చేస్తాను. ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను.

భారత రాజ్యాంగ రూపకల్పనలో 11 మంది మహిళలు ఉంటే అందులో ఒక దళిత మహిళ ఉంది, అప్పటి నుంచే దళిత మహిళలు చైతన్యవంతంగా ఉన్నారు. వారి అభివృద్ది కోసం కృషిచేస్తాను

నేను జాషువా విశ్వనరుడిని అర్దం చేసుకున్న వాడిని. మీకు అండగా నిలబడతాను. వర్మ  ఎమ్మెల్యే అభ్యర్ధి కాకపోయినా ఆయనకు గౌరవం ఇచ్చే బాధ్యత నాది. ఆయనను చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను” అన్నారు.

LEAVE A RESPONSE