Suryaa.co.in

Andhra Pradesh

మేం రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు

-ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మీ భూములు గల్లంతే
-కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం

-ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం, పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం
-పెరిగిన ధరలతో పేద, మద్య తరగతి ప్రజల ఇబ్బందులు…మేం అధికారంలోకి రాగానే ధరలు నియంత్రిస్తాం
-గిరిజనుల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం
-వంశధార నిర్వాసితులను ఆదుకుంటాం
-యువత మూడు పార్టీల జెండాలు పట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
-పాతపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

పాతపట్నం: జగన్ ముద్దులకు మురిసిపోయి గత ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించారు. కానీ జగన్ తనకు ప్రజలిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి చరిత్ర హీనుడుగా మిగిలిపోయాడు. జగన్ కి అహంకారం తలెక్కెంది, ప్రజా వేదిక కూల్చి విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారు. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. వంశధారకు ఒక్క రూపాయి ఖర్చు చేయని దుర్మార్గుడు జగన్.

రాష్ట్రంలో జగన్ అండ్ కో దోపిడికి హద్దు లేకుండా పోయింది, ఇసుక, మద్యం, గ్రావెల్ సహజవనరులన్నీ దోపిడి చేశారు. 5 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. పట్టాధారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మేంటి? ఆ భూములు జగన్ ఇచ్చాడా? లేక వాళ్ల నాన్న, తాత ఇచ్చారా? సర్వే రాళ్లపై కూడా సైకో తన బొమ్మలు వేసుకున్నాడు. చుక్కల భూములు కొట్టేశారు. పెద్ద సైకో తాడేపల్లిలో ఉంటే..చిన్న సైకో నియోజకవర్గానికొకడున్నాడు. వాళ్లు మీ భూములు కొట్టేస్తారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మీ భూమి మీ పేరు మీద ఉండదు. మీ భూములు వేరే వాళ్ల పేరుపై రాయించుకుంటారు. మీ భూముల్ని కొట్టేస్తారు.

జగన్ కి ఒక్క చాన్సే చివరి చాన్స్
రాష్ట్రం కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరో పవన్. కేంద్రంలో మళ్లీ రాబేయేది బీజేపీనే. యువతకు ఉద్యోగాల కోసం, మహిళ భద్రత కోసం రైతుల బాగు కోసమే మేం పొత్తు పెట్టుకున్నాం. ఇక్కడ పొలాలకు నీళ్లు కావాలి, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డర్ లో ఉంది. దేశంలో కూలీ పనులు చేసే వారిలో శ్రీకాకుళం జిల్లా వాసులే ఎక్కువ.

హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడ ఇలా ప్రతి చోట శ్రీకాకుళం కాలనీ అని ఉంటుంది. వలస వెళ్లకుండా మీకు ఇక్కడే ఉపాధి కల్పించాలి. మీ పిల్లలు మట్టిలో మాణిక్యాలు ..ఇంజనీరింగ్, ఐఐటీ, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి వారికి విద్య నందిస్తే ప్రపంచానికి సేవ చేస్తారు. జగన్ విద్వంసం మీరంతా చూశారు, 5 ఏళ్లలో రాష్ట్రం నష్టపోయింది, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ నష్టపోయారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించా. గాడితప్పిన పాలనను గాడిలో పెట్టాలన్నదే నాలక్ష్యం. దానికి మీ సహకారం కావాలి. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలి.

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం
వైసీపీ పాలనలో వ్యవసాయరంగం తీవ్రంగా నష్టపోయింది. రైతులు అప్పుల పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మేం అధికారంలోకి రాగానే గిట్టుబాటు ధరలు కల్పిస్తాం, పంట భీమా అమలు చేస్తాం, ప్రతి ఎకరాకు సాగునీరిస్తాం. ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. వ్యవసాయ అనుబంధ, ఆధార రంగాలను అభివృద్ది చేసి ఉపాధి కల్పిస్తాం. ఆక్వాకు ప్రోత్సహం అందిస్తాం. సబ్సిడికి యంత్రాలు, రుణాలు అందిస్తాం. అన్నదాత కింద ప్రతి ఏటా రైతుకు రూ. 20 వేలు అందిస్తాం. టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని ఆధునీకరిస్తాం. రైతులకు ఖర్చు తగ్గించి రైతును రాజును చేస్తాం.

ధరలు నియంత్రిస్తాం
ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్ నేడు 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. రూ. 200 ఉన్న కరెంట్ బిల్లు నేడు రూ. 1000 కి పెరిగింది. గతంలో నేను విద్యుత్ చార్జీలు పెంచలేదు, సోలార్ తో విద్యుత్ సంస్కరణలు తెస్తాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రైతులకు ఆదాయం కల్పిస్తాం. చెత్త పన్ను, ఇంటి పన్ను రద్దు చేస్తాం. పెట్రోల్, డిజీల్, నిత్యవసర ధరలు నియంత్రిస్తాం. మద్యపాన నిషేదం చేస్తానన్న జగన్ నిషేదం చేశాడా? నాడు రూ. 60 ఉన్న క్వాటర్ మద్యం నేడు రూ. 200 కి అమ్ముతున్నారు.

నాసికరం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి మహిళల పుస్తెలు తెంపిన జగన్ ని మీరు క్షమిస్తారా? మన రక్తాన్ని తాగే నరరూప రాక్షసుడు జగన్. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే నాసిరకం మద్యాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యం కాపాడుతాం. నేడు పాతపట్నంలో కూడా గంజాయి దొరుకుతోంది. మన పిల్లలు గంజాయికి బానిసలై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మొన్న విశాఖలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. గంజాయిపై జగన్ ఒక్కసారైనా సమీక్ష చేశారా? ఇలాంటి చేతకాని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? మేం అధికారంలోకి రాగానే గంజాయిని అరికడతాం.

జాబు రావాలంటే బాబు రావాలి, గంజాయి రావాలంటే జగన్ రావాలి
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ అన్నాడు ఇచ్చాడా? డీఎస్సీ నిర్వహించారా? 5 ఏళ్లలో యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు నెలకు రూ. 10 వేలిస్తాం. స్కిల్స్ పెంచి లక్షలు సంపాదించేలా చేస్తాం. నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతా? ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాం. ఇంటి నుంచి దేశంలోని కంపెనీలకు పనిచేసేలా వర్క్ ప్రమ్ హోం విధానం తీసుకొస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. 20 రోజులు యువత సైకిలెక్కి టీడీపీ జనసేన బీజేపీ జెండాలు పట్టి ప్రజల్ని చైతన్యం చేయాలి. వచ్చే 5 ఏళ్లలో మీరు ఊహించని అభివృద్ది చేస్తా.

కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం
సాగునీటి ప్రాజెక్టులు సైకో సర్వ నాశనం చేశాడు. మేం అధికారంలోకి రాగానే సాగు, త్రాగునీరు అందిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరందిస్తాం. కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం. నేడు జగన్ ఉద్యోగులకు సకాలానికి జీతాలు ఇవ్వటం లేదు, పీఆర్సీ ఇచ్చాడా? డీఏ, టీఎలు ఇచ్చాడా? మేం ఉద్యోగులకు పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం. పెన్సనర్లకు ఒకటే తేధీనే ఫించన్ అందేలే చేస్తాం. పీఆర్సీని జగన్ రివర్స్ చేశాడు. పీఆర్సీని ముందుకు తీసుకెళ్తాం. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం.

ఆడబిడ్డలకు అన్నగా అండగా ఉంటా
ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించింది టీడీపీ అయితే తండ్రి ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వని ఇవ్వని సైకో జగన్. అలాంటి వ్యక్తి మీకు అన్నగా ఉండటానికి పనికొస్తాడా? మేం అధికారంలోకి రాగానే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు, 5 ఏళ్లలో రూ. 90 వేలిస్తాం. ఆ రూ. 90 వేలను రూ. 9 లక్షలు చేసి చూపిస్తా. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

జగన్ శవరాజకీయాలు ఆపి..వచ్చే నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే ఫించన్ ఇవ్వాలి
రూ. 200 ఉన్న ఫించన్ ని రూ. 2 వేలు చేసింది నేనే. రేపు అధికారంలోకి రాగానే ఫించన్ ని 4 వేలకు పెంచి ఇంటి వద్దకే అందిస్తాం. పెంచిన ఫించన్ ఏప్రిల్ నెల నుంచే ఇస్తాం. జగన్ శవరాజకీయాలు ఆపి వచ్చే నెల 1వ తేదీనే ఇంటివద్దకే ఫించన్ ఇవ్వాలి.

నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్ ఒక్కరోజులో ఇంటిదగ్గరకే నేను ఫించన్ అందిస్తా. రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేస్తాం, అన్న క్యాంటీన్లు పునప్రారంభిస్తాం. రేషన్ తో పాటు పలు నిత్యవసర సరుకులు రేషన్ షాపుల్లో అందిస్తాం. ఇవన్నీ చేసే సత్తా నాకుంది. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచుతా. ధరలు పెరిగిపోయి మద్య తరగతి కుటుంబాలు చాలీ చాలని ఆదాయంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకుంటాం.

ఎమ్మెల్యేగా గోవిందరావును, ఎంపీగా రామ్మోహన్ నాయుడుని గెలిపించండి
ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే సివిల్ కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు దండుకుంటున్నాడు. వసూళ్లకు కుటుంబంలో పోర్టు పోలియో ఇచ్చాడు. వంశధార నుంచి ఒడిసాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. కాంపౌండ్ వాల్ కట్టాలన్నా ఎమ్మెల్యేకి కమీషన్లు కట్టాలి. రేపు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గోవిందరావును, ఎంపీగా రామ్మోహన్ నాయుడుని గెలిపించండి. పాతపట్నం చరిత్ర తిరగరాసేలా అభివృద్ది చేస్తాం. గిరిజనులకు ఐటీడీఏ మంజూరు చేస్తాం,

మహిళా డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర, వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పాతపట్నం నియోకవర్గం ప్రజలంతా ఎమ్మెల్యేగా గోవిందరాజుని, ఎంపీగా రామ్మోహన్ నాయుడుని భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు.

LEAVE A RESPONSE