-వైసిపి నుంచి జనసేన లో చేరిన పాలంకి బ్రదర్స్ సారధిబాబు, మోహన్ బాబు
-నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిక
-జనసేన జెండా కప్పి సాదరంగా ఆహ్వానించిన నాదెండ్ల మనోహర్
పోలంకి సారధిబాబు:2019 నుండి వైసిపిలో కొనసాగుతున్నాను.కొడాలి నానితో కలిసి వైసిపి విజయానికి పని చేశాం.ఇటీవల కాలంలో కొడాలి నాని శృతి మించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై తరచూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మేము రాజకీయ విమర్శలు చేయాలని కోరినా నాని పట్టించుకోలేదు. గుడివాడలో నాని వ్యాఖ్యలను ప్రజలే చీదరించుకుంటున్నారు. ఇక వైసిపిలో కొనసాగలేమని నిర్ణయం తీసుకుని బయటకు వచ్చాం. ఈరోజు జనసేనలో చేరడం ఆనందంగా ఉంది. జనసేన పార్టీ విజయం కోసం అందరినీ కలుపుకుని పని చేస్తాం.