Home » మాతృభూమికి సేవ చేసే అవకాశం రావడం దైవ నిర్ణయం

మాతృభూమికి సేవ చేసే అవకాశం రావడం దైవ నిర్ణయం

-ఆశీర్వదించండి…పశ్చిమ రూపురేఖలు మారుస్తా
-సమస్యలు తెలుసు-అన్నిటినీ పరిష్కరిస్తా
-ప్రచారంలో సుజనాకు బ్రహ్మరథం పట్టిన ముస్లిం మైనారిటీలు
– బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి

‍ఎన్నికల్లో ఆశీర్వదించండి… పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలిపేట నుంచి మహాలక్ష్మి వీధి గంగానమ్మ గుడి నైజాం గేట్ అంబేద్కర్ కాలనీలో 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ జావెద్ తో కలిసి సుజనా ప్రచారం చేశారు. వడ్ర పోలమాంబ దేవి గంగానమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. కొండ ప్రాంత వీధులలో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు.

పశ్చిమ నియోజకవర్గం అనేక దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, గత పాలకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. నియోజవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీల నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు, ప్రత్యేకమైన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్యా వైద్యం అన్ని రకాల సదుపాయాలని కల్పిస్తానని అన్నారు. ‍ తాను నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోబోనని అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా బిడ్డగా మాతృభూమికి పశ్చిమ నియోజకవర్గానికి సేవ చేయడం దైవ నిర్ణయంగా భావిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు. వించిపేట నైజాం గేట్ ప్రాంతాలలోని డ్రైన్ల అభివృద్ధి టీడీపీ-బీజేపీ హయాంలోనే జరిగిందన్నారు. జిల్లాలో పుట్టి పెరిగిన తనకి ఇక్కడ అవసరాలు అభివృద్ధిపై అంచనాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ప్రజలు ఇస్తే నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రచారంలో సుజనాకి రెల్లి సంఘం జేఏసీ నాయకులు భూపతి నంద స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల డ్వాక్రా గ్రూపుల పొట్టలు కొట్టిందని రెల్లి కులస్తులకు రావలసిన ఉద్యోగాలకు బ్లాక్ మార్కెట్లో రేట్లు నిర్ణయించి అమ్ముకుంటున్నారని భూపతి విమర్శించారు. రెల్లి కులస్తుల సమస్యలను పరిష్కరిస్తామన్న సుజనా కే తమ మద్దతు అని భూపతి ప్రకటించారు.

54వ డివిజన్లో ముస్లింల ఘన స్వాగతం
54వ డివిజన్ లో టీడీపీ అధ్యక్షుడు సయ్యద్ సలీం తాయుద్దీన్ తో కలిసి పంజా సెంటర్ గాంధీ బొమ్మ ప్రాంతాలలో సుజనా చౌదరి ప్రచారం చేశారు. సుజనాకు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, షేక్ రషీద్, స్వాగతం పలికారు. ముస్లిం మైనారిటీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు సుజనాకు బ్రహ్మరథం పట్టారు.

కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సుజనా చౌదరి స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా విజ్ఞప్తి చేశారు.
ప్రచారంలో సుజనాకు పంజా సెంటర్ లో గౌర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దాడి అప్పారావు స్వాగతం పలికారు.

స్టూడెంట్ యూత్ వింగ్ నాయకులు దాడి మురళీకృష్ణ, స్థానిక యువకులు సుజనాకు మద్దతుగా నిలిచారు. సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఎస్ బేగ్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply