ఈ విదేశీ పాలకులను ఇంటికి పంపాలి

– మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు, శ్రీనగర్, గామాలపాడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస రావు పర్యటించారు. గ్రామ స్థాయి నాయకుల బూత్ కమిటీ సభ్యుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యం వల్ల, రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని వ్యక్తిగత ప్రయోజనాల పై వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టి పరిపాలన ఇస్తుందన్నారు.

వెనుకబడిన వర్గాలకు ఉపాధి కల్పించే sc,st,bc మైనారిటీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు గురజాల నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వం ఉచిత మూడేళ్లలో 8 మంది చిన్నారులు క్వారీ గుంతలో పడి వైసిపి ధన దాహానికి మృత్యు వాత కు గురయ్యారని అంతేకాక ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర తీసి తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరిని హత్య చేశారని ఆరోపించారు. క్వారీ గుంతలో పడి ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందితే ఒక్కనాడైనా స్థానిక ఎమ్మెల్యే మైనింగ్ అధికారులతో రివ్యూ పెట్టారని ఎరపతినేని ప్రశ్నించారు.

అక్రమ మైనింగ్ సొమ్ము కోసం ప్రతీ శనివారం స్థానిక ఎమ్మెల్యే మీటింగ్లు పెడతారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తెలంగాణ అక్రమ మద్యం, గుట్కాలు, ఇసుక, ప్రభుత్వ భూములు రాయించుకోవడం, ఆఖరికి గాలి నీరు కూడా వదలని అన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో సర్పంచులు అంటే ఎంతో గౌరవం ఉందని, నేడు వైసీపీ పాలనలో సర్పంచులు బిక్షాటన చేసే పరిస్థితి ఏర్పడిందని అభివృద్ధి పనులు లేక సర్పంచులకు వైసీపీ అక్రమ వ్యాపారాలు చూపిస్తుందని ఆరోపించారు.

అంతేకాక గురజాల నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ ఆకులపై అక్రమ కేసులు పెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏదైతే పోలీసులను అడ్డుపెట్టుకొని చేస్తున్నారో అదే పోలీసులు విసుగు చెందారని వైసిపికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని అందుకే 60 సంవత్సరాల ఉద్యోగ విరమణ నీ 62 సంవత్సరాలకు పెంచాలని ఆయన అన్నారు. రాజధాని అమరావతికి అప్పటి ప్రతిపక్ష నేత గా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు చెప్పాలన్నారు విశాఖపట్నంలో భూములు కొట్టేశారు కనుకే అక్కడ రాజధాని అంటున్నారని, 30 వేల కోట్ల భూములు కొట్టారని రుషికొండ ను బోడిగుండు చేశారని ప్రకృతిని నరికేశారు అని మండిపడ్డారు.

ఈ కృతిని నాశనం చేసిన వారు ఎవరైనా సరే ప్రకృతి వదలదని ప్రకృతి తో నే పోతారు అన్నారు. కృష్ణపట్నం తెలుగుదేశం పార్టీ కడితే జాతికి అంకితం పేరుతో, ప్రైవేటీకరణ చేస్తున్న మంటున్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 18 వేల కోట్లు, దానికి 690 కోట్లకు అమ్మాయి అని 18 వేల కోట్లు ఏమయ్యాయని ఎరపతినేని ప్రశ్నించారు. తిరిగి మరల రాష్ట్రం బాగుండాలి అన్న అభివృద్ధి చెందాలన్నా అమరావతి రాజధాని కావాలన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఈ విదేశీ పాలకులను ఇంటికి పంపాలని అన్నారు.