జీవీఎల్‌ ఏం సాధించారని కాపుల సన్మానం?

-ఏపిలో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం
-కాపుల సామాజిక ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు
-కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారు
-జనసేనను అధికారంలోకి తీసుకురావటంపై పవన్ కల్యాణ్ నిర్ణయానికి వదిలేస్తే మంచిది
-బిజేపి నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు:బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపి జీవీఎల్‌ నరసింహారావు ఏం సాధించారని కాపులతో సన్మానం చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. జీవీఎల్‌ పార్లమెంట్‌లో అడిగిన సమాచారం గూగుల్‌లో కొట్టినా వస్తుందన్నారు. జనసేనను అధికారంలోకి తీసుకువచ్చే అంశాన్ని పవన్‌కు వదిలేస్తే మంచిదన్నారు. కన్నా ఇంకా ఏమన్నారంటే..

ఏపిలో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం రావటం 1989 నుంచి చూస్తున్నాం. ఎన్నికల సమయంలోనే ఓట్లు అవసరం కాబట్టి కాపులను వాడుకుంటారు. అత్యధిక శాతం ఉన్న కాపులను వాడుకునే ప్రయత్నం ప్రతిసారి జరుగుతుంది. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ సుదీర్ఘ కాలం నుంచి ఉంది.చాలా మంది నాయకులు రిజర్వేషన్ ల కోసం పోరాటాలు చేశారు.కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా.పవన్ కళ్యాణ్ 9 ఏళ్ల క్రితం పార్టీ పెట్టారు.జనసేన పార్టీ ని బయట నుంచి ఎవ్వరూ ప్రభావితం చేయకుండా చూడాలి.జనసేన ను అధికారంలోకి తీసుకురావటం పై పవన్ కల్యాణ్ నిర్ణయానికి వదిలేస్తే మంచిది. జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానాలు చేస్తున్నారో అర్థం కావటం లేదు.జీవీఎల్ పార్లమెంట్ లో అడిగిన సమాచారం గూగుల్ లో కొట్టిన వస్తుంది.కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది.

దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఓబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తే బాగుంటుంది.1994 లో కాపుల స్కాలర్ షిప్ లకు సంబంధించి కోట్ల విజయబాస్కర రెడ్డి జీవో ఇచ్చారు.అయితే ఆయన బీసీ సంక్షేమ శాఖ తరపున జీవో ఇవ్వటంతో అమలు కాలేదు. వైఎస్ సీఎం గా ఉండగా కాపు రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. కాపుల సామాజిక ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారు. కాపుల సంక్షేమం కోసం సిన్సియర్ గా పని చేసింది పి.శివ శంకర్, మిరియాల వెంకట్రావు చిత్తశుద్ధితో పని చేశారు. కాపులకు రాజకీయ దిశ నిర్దేశించే శక్తి నాలో లేదు.

Leave a Reply