విఆర్ఏ లకు “ఫేస్‌ యాప్‌ అటెండెన్స్‌” నుండి మినహాయింపు ఇవ్వాలి

– ఎపి రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ నేతలు బొప్పరాజు , జి. జయరాజు , చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు ఉండాలనే నూతన పద్ధతి ప్రవేశ పెట్టిన విషయం విదితమే.ఈ పద్దతిని గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ) లకు కూడా వర్తింప చేయాలని జిల్లా అధికారులు అదేసిస్తుండడం వలన రాష్ట్రంలోని విఆర్ఏ లు అందరూ తీవ్రమైన ఆందోళణకు గురి అయ్యారు. అయితే గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ)లు పార్ట్‌ టైమ్‌ వృత్తి గా పనిచేసే ఉద్యోగులు. వీరికి ఇచ్చే జీతభత్యాలు గౌరవ వేతనము మాత్రమే. అంతే కాకుండా వీరికి వచ్చే అతి తక్కువ జీతముతో స్మార్ట్‌ పోన్‌ కాదు కదా, అసలు ఏపోన్ కూడా కొనుకోలేని ఆర్దికపరిస్దితి ఈ ఉద్యోగులది.

అంతేకాకుండా దశాబ్దాల క్రితం నుండి పనిచేసే వీరిలో ఎక్కవ మంది చదువురానివారు, అసలు సెల్ పోన్ వాడకం తేలియని వారు కూడా ఉన్నందున వీరందరికి ముఖ ఆధారిత హాజరు పద్దతి నుండి మినహా ఇవ్వాలని శుక్రవారం ఏపి రెవిన్యూ అసోషియేషన్ అలాగే ఏపి గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర సంఘాల పక్షాన స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు చీఫ్ కమీషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ ని మంగళగిరి లోని వారి కార్యాలయంలో కలిసి లేఖ ద్వారా కోరడమైనది.

దీనిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు చీఫ్ కమీషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిగ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. జయరాజ్, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply