Home » ‘చింపేసిన’ చంద్రబాబు!

‘చింపేసిన’ చంద్రబాబు!

– రైతు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటి?
– ఆ భూమి జగన్ తాత మీకిచ్చారా?
– వాళ్ల నాన్నేమైనా మీకిచ్చారా?
– మన భూమి పుస్తకాలపై సైకో ఫొటో ఏమిటి?
– సభల్లో జగన్ ఫొటోలున్న పాసుపుస్తకాలను చించేసిన చంద్రబాబు
– సోషల్‌మీడియాలో లక్షల మంది లైక్ చేసిన వైనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

చంద్రబాబు నాయుడుకు కోపమొచ్చింది. ఎందుకంటే ఆయనపై కేసులు పెట్టినందుకు కాదు. ఆయనను జైలులో పెట్టినందుకు అసలే కాదు. పట్టాదారుపాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేసినందుకు! ‘‘తాత ముత్తాతలు వారసత్వంగా ఇచ్చిన భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలపై ఈ సైకో జగన్ ఫొటో ఏమిటి? ఆ భూములు ఏమైనా మనకు జగన్ వాళ్ల తాత ఇచ్చాడా? వాళ్ల నాన్న ఇచ్చాడా? మన తాత ముత్తాతలు ఇచ్చిన భూములపై జగన్ పెత్తనమేంటి? పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఉండటాన్ని మీకు సమర్ధిస్తారా’’? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం జగన్‌ను జనం సాక్షిగా చెడుగుడు ఆడేశారు.

అంతేనా? ఈ పాసుపుస్తకాలపై ఈ ముఖమేంటని ప్రశ్నిస్తూ… ఆ పాసుపుస్తకాలను ముక్కలుగా చింపేసి ప్రజల చప్పట్ల మధ్య గాల్లో ఎగరేశారు. దర్శి, కాకినాడ ఎన్నికల సభల్లో చంద్రబాబు ప్రధాన ప్రసంగం ఇదే. దానితో సభికులు కూడా జగన్ ఫొటో మాకొద్దంటూ పైకి చేతులు ఊపారు. అంతే చంద్రబాబు మరింత ఉత్సాహంతో పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్సును మరిన్ని ముక్కలుగా చింపేసి గాల్లో ఎగరేశారు.

చంద్రబాబునాయుడు లేవనెత్తిన ఈ పాసుపుస్తకాలపై జగన్ ఫొటో అంశం.. రైతుల గుండెల్లో నేరుగా తాకుతోంది. ‘‘జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తెచ్చారు. ఈ చట్టం అమలులోకి వస్తే పట్టాదారుపాసు పుస్తకం ఉండదు. పత్రాలుండవు. భూములన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. మన ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి కావాలి. అయినా ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటి? పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటి? ఎంతో మంది సీఎంలుగా పనిచేశారు. ఎవరైనా ఇలాంటి పనికిమాలిన చట్టం తెచ్చారా? ఏ సీఎం అయినా పట్టాదారు పుస్తకాలపై వాళ్ల ఫొటో వేసుకున్నారా? జగన్‌కు ఈ ఫొటోల పిచ్చేమిటి? ఈ పిచ్చోడిని ఇంటికి సాగనంపకపోతే మీ భూములన్నీ కబ్జా చేసేస్తారు’’ అన్న చంద్రబాబు హెచ్చరికలు, రైతాంగానికి నేరుగా తాకుతున్నాయి. దర్శి, కాకినాడ సభల్లో దానికి సంబంధించి చేసిన చంద్రబాబు ప్రసంగానికి వచ్చిన అనూహ్య స్పందనే దానికి నిలువెత్తు నిదర్శనం.

ఇదిలాఉండగా..జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను చంద్రబాబునాడయుడు చింపేసి, గాల్లో ఎగురవేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. లక్షల మంది నెటిజన్లు దానిపై లైకులు కొట్టారు. అసంఖ్యాకంగా పార్వార్డ్ చేశారు. వేల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘మాకు పొలాలు రాజారెడ్డి ఇవ్వలేదు’.. మీ నాయనేమైనా మాకు పొలాలిచ్చారా ఏమి’.. ‘మీ ముఖం పొద్దున్నే మాకెందుకు సామీ’.. అయినా నీకు ఈ ఫొటోల పిచ్చేంటి సారూ’.. అని నెటిజన్లు జగనన్నను ఒక రేంజిలో రప్ఫాడిస్తున్నారు.

Leave a Reply