– ఆడవాళ్లను కించపరిస్తే కఠిన చర్యలు
– సచివాలయంలో ఉమెన్ డిగ్నిటీ డే కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సచివాలయం మహిళా ఉద్యోగుల అధ్యర్యంలో జరిగిన “ఉమెన్ డిగ్నిటీ డే” కార్యక్రమాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించి, ప్రసంగించారు. ఉమెన్ డిగ్నిటీ డే కు మద్దతుగా సచివాలయంలోని మహిళా అధికారులు, ఉద్యోగులు సంతకాలు చేశారు.. మహిళా ఆత్మగౌరవ దినాన్ని ప్రతి శుక్రవారం జరుపుకుందాం అని .. అందరూ చేయి చేయి కలపాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేసిందన్నారు అదే విధంగా ప్రతి పథకాన్ని మహిళల పేరు మీదనే అందజేస్తున్నారు అన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం దిశా యాప్ తీసుకవచ్చిందన్నారు. సిఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఎవరిపైన అయినా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టడం తప్పే అన్నారు.
‘సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిలో సీఎం కుటుంబ సభ్యులు మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్న తేడా లేకుండా పోతుందన్నారు. పవన్ కళ్యాణ్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.. ఏపీలో 18 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటూ ఏటూరు, తాడేపల్లి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడాతారంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
అందుకే పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వివరించారు. వాలంటీర్లు తీసుకు వస్తున్న సమాచారం ఆధారంగా మహిళల అక్రమ రవాణా జరుగుతోందని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ పవన కల్యాణ్ ఆరోపించారన్నారు.. దేని ఆధారంగా ఆయన ఆరోపణలు చేశారో చెప్పాలన్నారు.
గత కొంత కాలంగా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ఒక పార్టీకి నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంతలా దిగజారి మాట్లాడటం భావ్యం కాదన్నారు. మహిళల పట్ల చులకన భావనతో చూస్తున్నారు.
పవన్ కల్యాణ్ మహిళా కమిషన్ ను గౌరవించడం లేదు. కేంద్రంలో, తెలంగాణలో ఈ పరిస్థితి లేదన్నారు. ఒకరు, ఇద్దరు వాలెంటిర్లు తప్పు చేస్తే వ్యవస్థను రద్దు చేయాలా.. తప్పు చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. మామీద కూడా జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు. అందుకు జనసేన పార్టీని పవన్ రద్దు చేస్తారా ? ఇందుకు పవన్ కళ్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా ? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
అనంతరం సచివాలయం ఉద్యోగులు వాసిరెడ్డి పద్మను ఘనంగా సన్మానించారు.. కార్యక్రమంలో మహిళ కమిషన్ సభ్యలు వినీత, గజ్జల లక్ష్మి, సచివాలయం మహిళా ఉద్యోగ సంఘాల నాయకులు సులోచన, సుస్మిత, సునీత తదితరులు పాల్గొన్నారు.