Suryaa.co.in

Telangana

మనస్సున్న మారాజు సీఎం కెసిఆర్

-తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నం.1 టూరిజం స్పాట్
-అతిధ్యం, సహకారం అందించడం లో దేశంలో తెలంగాణ రాష్ట్రమే ఆదర్శం
-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అధ్వర్యంలో దివ్యాంగుల శిక్షణ ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖల నేతృత్వంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అధ్వర్యంలో దివ్యాంగుల శిక్షణను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తా నియా, y n రెడ్డి, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

సీఎం కెసిఆర్ గారు మనసున్న మారాజు.దివ్యాంగుల గురించి అలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత BRS పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది.సీఎం కెసిఆర్ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.దివ్యాంగులకు అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వ పరంగా సమకూరుస్తున్నారు.
దివ్యాంగులకు ట్రై వెహికల్స్, ఇతర పరికరాలు ఉచితంగా అందచేస్తున్న ఘనత సీఎం కెసిఆర్ ది.పెన్షన్ ను 4000 రూపాయలకు సీఎం కెసిఆర్ గారు పెంచారు. దేశంలోనే అత్యధికంగా ఇస్తున్నాం.తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నం.1 టూరిజం స్పాట్ గా సీఎం కేసిఆర్ గారి మార్గ నిర్దేశనంలో మంత్రి కేటీఆర్ చేస్తున్నారు.హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరం గా అభివృద్ది చేస్తున్నారు.మన రాష్ట్ర ఆతిథ్యం కోసం ఇతర దేశాలు వాళ్ళు పోటీ పడే పరిస్థితికి వచ్చింది.సీఎం కెసిఆర్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో వుంచారు.

మనకున్న విశేషాలు, అనుకూలతలు చూసి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి.వారందరికీ మనమంతా మంచి ఆతిథ్యం ఇవ్వాలి.ఈ శిక్షణ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ రంగంలో నిష్ణాతులు కావాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కంపెనీ యాజమాన్యాలు, శిక్షకులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE