జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 20న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించన్నారు. ఉమ్మడి నల్లొండ జిల్లా చౌటుప్పల్, కోదాడలో పవన్ కల్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు మొదలైనట్టు ఆయన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పేరిట ప్రకటన విడులైంది.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందిస్తారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 20వ తేదీన పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో బయల్దేరి.. మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం చేరుకుంటారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి కోదాడకు వెళ్లి, కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పవన్ పరామర్శిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.