Suryaa.co.in

Andhra Pradesh

కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ రూ.లక్ష ఆర్ధిక సాయం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం ప్రాంతానికి చెందిన కౌలు రైతు దాసరి రాజారావు ఆర్థిక ఇబ్బందులతో మూడేళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధర్మాజీగూడెంలో రాజారావు కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాజారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన రూ. లక్ష ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన తల్లిదండ్రులు మరియమ్మ, సుసి లకు అందజేశారు. రాజారావు కుమారుడు అఖిల్ విద్య బాధ్యతలను జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్హా మీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పీఏసీ సభ్యులు నాగబాబు , జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పార్టీ నాయకులు ఘంటసాల వెంకట లక్ష్మీ, బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE