-నేటి విజయమే సేనాని వ్యూహం కాదు
– జనసేనాని విజయం వెనుక నమ్మలేని నిజాలు
ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డి, కమ్మ ఆధిపత్య పార్టీలు కాకుండా తృతీయ ప్రత్యామ్నాయం రావాలి. అధికార సాధన దిశగా అడుగులు వెయ్యాలి అనేది ఏడూ దశాబ్దాల పాలిత వర్గాల కల. ఈ కలను సాధించిన మొదటి వ్యక్తి కొణెదల పవన్ కళ్యాణ్.
ఏపీలో తృతీయ ప్రత్యామ్న్యాయం రావాలని ఒక రామ్ మనోహర్ లోహియా, ఒక అంబెడ్కర్, ఒక కాన్షిరాం లాంటివారు ఎన్నో కలలను కన్నారు. పార్టీలు అయితే ఎన్నో వచ్చాయి. కానీ అవి వెను వెంటనే కల గర్భంలో కలిసి పోతుండేవి. నిలదొక్కుకో లేదు.
సర్దార్ గౌతు లచ్చన్న, మంద కృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, దాసరి నారాయణ రావు, చిరంజీవి, ముద్రగడ పద్మనాభం, కేసన శంకరరావు లాంటి వారు ఎందరో పార్టీలు పెట్టినప్పటికే అవి కాలగర్భంలో కలిసి పోయాయి.
పాలిత వర్గాల నుండి ఒక వ్యక్తి పార్టీ పెట్టడం, ఆ పార్టీ ఒక దశాబ్దం పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉండడం, ఆ పెట్టిన పార్టీ ఒక గుర్తింపు పొందిన పార్టీగా మారడం అనేది జనసేననే. ఏడు దశాబ్దాల తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మాత్రమే దశాబ్దంపైగా నడవడం, ఎలక్షన్ కమిషన్ నుండి గుర్తింపు పొందడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇది పాలిత వర్గాలు కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.
చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ అనే లెగసీ పై పార్టీని నడుపుతో టీడీపీ ద్వారా అధికారంలోకి వస్తున్నారు. జగన్ రెడ్డి అయితే తండ్రి వైస్సార్ లెగసీ, జాతీయ కాంగ్రెస్ ద్వారా వచ్చిన వలసల లెగసీ పై పార్టీని నడుపుతో అధికారంలోకి వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ లెగసీ లేకుండా పార్టీ పెట్టి నేటి విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనకు ఎటువంటి లెగసీ లేదు. ప్రజారాజ్యం ఓటమి, కాంగ్రెస్ లో విలీనం, మూడు పెళ్లిళ్లు, కాపు పూర్వీకుల తప్పుడు నిర్ణయాలు, కంపు పట్టిన కాపు టాగ్ అనే నాలుగు గుది బండలు పవన్ కళ్యాణ్ కాళ్లకు, మెడకు వేళ్ళాడుతుండగా ధైర్యంతో పెట్టిన పార్టీ జనసేన. పాలిత వర్గాల కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేనాటికి మెగా కుటుంబం అండ లేదు. కాపు టాగ్ ఉంది గాని కాపు నాయకుల, కాపు సంఘాల మద్దతు జనసేనకు లేదు. పారిశ్రామిక వేత్తల అండ పవన్ కళ్యాణ్ కు లేదు. కుల నాయకుల సపోర్ట్ లేదు. మీడియా లేదు. అణగారిన వర్గాల్లో ఐక్యత లేదు. ఏకాకులుగా మారిన కాపుల పార్టీకి మా ఇతర కులాల మద్దతు నివ్వం అనే రోజుల్లో, దుర్భర పరిస్థితుల్లో ధైర్యంతో వచ్చిన పార్టీ జనసేన. పాలిత వర్గాల కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.
పార్టీ నడపడానికి ముఖానికి రంగులు వేసికొంటూ నాలుగు రాళ్లు సంపాదించడం, ఆ వచ్చిన డబ్బులతో పార్టీని నడపడం. ఇలా పది సంవత్సరాలు పైగా పార్టీని పవన్ కళ్యాణ్ నడుపుతో వచ్చాడు. గుప్పెడు నాయకులతో, గంపెడు విజయాన్ని పవన్ కళ్యాణ్ సాధించాడు. పాలిత వర్గాల కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.
అణగారిన వర్గాల కోసం పార్టీని పెట్టి, ఆ పార్టీని నడపడం కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టాలను అర్ధం చేసికోకుండా విమర్శలు చేసిన వారే ఎక్కువ. అక్షర సత్యంతో సహా అనేక మంది సేనాని శీలాన్ని నిన్నటి వరకు శంకించిన గారే గాని పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన వారు లేరు.
ఒక పక్కన అక్షర సత్యం లాంటి వారి తిట్లను, హేళనలను సేనాని వింటూనే మరొక పక్కన కష్టాలను భరిస్తూ, తానూ నష్టాల్లో ఉన్నాగాని తన స్వేదంతో వచ్చిన డబ్బులతో పార్టీని నడుపుతూ, ఒంటి చేత్తో పార్టీని విజయం వైపుకు తీసికెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పాలిత వర్గాల కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.
అందుకే పవన్ కళ్యాణ్ సాధించిన నేటి ఈ విజయం మోహోన్నతమైన విజయం. డిప్యూటీ సీఎం అనే పదవి చిన్నదే కావచ్చు. కానీ అది పవన్ కళ్యాణ్ తన సొంత మేధస్సుతో, వ్యూహాలతో సాధించిన విజయం. చీమకు చిప్పెడు నీళ్ళే మహా సముద్రం లా సేనాని నేడు సాధించిన డిప్యూటీ సీఎం పదవి అణగారిన వర్గాలకు గొప్పదే. అణగారిన గర్గాలకు, పాలిత వర్గాలకు ఈ విజయంపై ప్రపంచాన్ని జయించినంత ఆనందం.
ఒకరు పార్టీ కింద అయిన డిప్యూటీ సీఎంకి పవన్ తన రెక్కల కష్టంతో పెంచిన పార్టీ నుండి డిప్యూటీ సీఎం అయినది ఒక్కటి కాదు. ఈ వాస్తవాన్ని అణగారిన వర్గాలు, పాలిత వర్గాలు తెలిసికోవాలి. అవసరమైతే పాలక వర్గాలకు తల ఎత్తి చెప్పాల్సిన రోజు ఇది.
నేటి మన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను ఎంత మంచిగా ఉపయోగించు కొంటే మన జనసేన పార్టీ భవిత అంత ఎత్తుగా ఉంటుంది అని జనసేనాని పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు.
దీన్ని బట్టి సేనాని వ్యూహాలను అర్ధం చేసుకోవచ్చు. సేనాని వ్యూహంలో నేటి విజయం ఒక భాగమే గానే నేటి విజయమే సేనాని వ్యూహం కాదు. రాబోయే రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించ బోతున్న విజయాలకు నేటి డిప్యూటీ సీఎం అనేది నాందీ ప్రస్తావన. ఇదే వాస్తవం. ఇదే అక్షర సత్యం.
ఆలోచించండి… జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు సాధించింది రేపటి భావి ఆంధ్ర సీఎం సాధనకి అవసరమైన సాధన సంపత్తికి తొలి మెట్టు అని ఎలుగెత్తి చెప్పండి. అంతే గాని వైసీపీ ట్రాప్ లో పడి సేనానిని వ్యూహాలను శంకించకండి.ఇది అక్షర సత్యం!
– రమణ
మచిలీపట్నం