విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి , ఆలయ ఈవో, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు.