– రాష్ట్రంలో ఆలయాలకు భద్రత ఉందా?
– వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ప్రజలనే కాదు భగవంతున్ని కూడా మోసగించిందనడానికి నిదర్శనం, తిరుపతి గోవిందస్వామి ఆలయంలో జరిగిన అపచారం.మద్యం మత్తులో పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన దారుణాన్ని అందరూ గమనించాలి. సనాతనవాదిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపడం లేదు?
ఈ 18నెలల్లో భగవంతుడి వద్ద ఎన్ని ఘోర అపచారాలు జరిగాయో అందరూ గమనిస్తున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు.తిరుపతిలో తొక్కిసలాట, సింహాచలంలో, కాశీబుగ్గలో ఎంత మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో అర్ధమవుతోందా, ద్రాక్షారామంలో జరిగిన ఘటనలో హడావిడిగా మరో విగ్రహం పెట్టి మొక్కుబడిగా కార్యక్రమం ముగించారు.
భగవంతున్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు, ఇంతకంటే దారుణం ఉంటుందా? కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. గోవిందరాజ స్వామి ఆలయంలో జరిగిన అపచారం చూస్తే రాష్ట్రంలో మద్యం మత్తు ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది.
ఆత్మస్తుతి పరనిందకే కూటమి ప్రభుత్వం పరిమితమైంది. రాష్ట్రంలో ఆలయాలకు భద్రత ఉందా అని కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నా, గోవిందరాజ స్వామి ఆలయంలో జరిగిన మహాపచారంపై ఇప్పుడేం సమాధానం చెబుతారు