Suryaa.co.in

Andhra Pradesh

పవనంటే వైసీపీకి భయం: పరుచూరి భాస్కర్‌రావు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ సభను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్‌నాథ్‌కి అవగాహన లేకున్నప్పటికీ మంత్రి పదవి కోసం పవన్ కళ్యాణ్ని తిట్టడం అలవాటు చేసుకున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ అంటే వైసీపీనికి భయమని… అనకాపల్లిని అందాలపల్లిగా చేస్తానని అమర్‌నాథ్ తెలిపారని భాస్కరరావు గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేసిన విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా అఖిలక్షాన్ని తీసుకెళ్లాలని.. చేతకాదనుకుంటే గాజులు, చీర తొడుకుక్కని ఇంట్లో కూర్చోవాలని భాస్కరరావు సూచించారు.

LEAVE A RESPONSE