– అతనొక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్: మంత్రి శ్రీ అంబటి రాంబాబు
– రాజకీయాల్లోనే కాదు..వ్యక్తిగతంగానూ అతనితో ఎవరూ నడవలేరు.
– అందుకే పవన్ రాజకీయాలకు పనికి రాడు
– అలాంటి పవన్ ఏకవచనంతో పిలిస్తే ఏంటి..? బహువచనంతో పిలిస్తే మాకేంటి..?
– పవన్ అసెంబ్లీకి వెళ్లలేడు..దత్తతండ్రిని సీఎంగా చేయలేడు
– ప్రజల ముందు చెప్పులు చూపించడమే పవన్ సంస్కారమా..?
– పవన్ కళ్యాణ్‌వి పోయింది చెప్పులు కాదు…బుర్రే పోయింది…
– దీపారాధనతో మీ నాన్న సిగిరెట్ ముట్టించుకునేంత హేతువాది అన్నావ్…
– తల్లిదండ్రుల మీద నీకున్న గౌవరం ఇదేనా..?
– అలాంటి నువ్వు సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరం
– కాపులను మచ్చిక చేసుకుని బాబుకు అమ్మేందుకే పవన్ యాత్ర
– వాలంటీర్ వ్యవస్థపై నీ అభ్యంతరం ఏమిటి మిస్టర్ గాలి కళ్యాణ్..?
– అప్పుడు కామన్ మెన్ ప్రొటెక్షన్…ఇప్పుడు దుష్టచతుష్టయం ప్రొటెక్షన్
– మైకు పట్టుకుని ఊగితే విప్లవ కారులైపోరు..?
– ఒక్కో సినిమాకి నీ రెమ్యూనరేషన్ ఎంత..? నువ్వు చూపిస్తుంది ఎంత..?
– నీకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ పరుచు..
– అది చెప్పకుండా వారాహి ఎక్కితే అది వరాహినే
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
వారాహి యాత్ర కాదు…నువ్వు వరాహి యాత్ర చేస్తున్నావ్:
– పవన్ కళ్యాణ్ రెండు విడుతలుగా యాత్రలు చేస్తున్నారు…
– ఆయనకు అప్పుడప్పుడు ‘యాత్రలు’ చేయడం అలవాటు…యాత్రలు చేస్తూ ఉంటారు.
– ఉభయగోదావరి జిల్లాలో మొదటి విడుతగా, రెండో విడుతలో పశ్చిమ గోదావరిలో పర్యటన చేస్తున్నారు.
– వారాహి అనే అమ్మవారి పేరును వాహనానికి పెట్టుకోవడం ధర్మం కాదని నేను చాలా సార్లు చెప్పాను..
– పోనీ వారాహి ఎక్కి భగవంతుడిలా మంచి మాటలు మాట్లాడుతున్నాడా అంటే అదీ లేదు.
– వారాహి మీదకు ఎక్కి అన్నీ అసత్యాలు చెప్తూ దూషణలు చేస్తున్నాడు.
– ఎప్పుడైతే ఆయన వారాహి ఎక్కి దూషణభూషణలకు దిగుతాడో, కక్షలు కార్పణ్యాలతో మాట్లాడుతాడో, ఎప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడతాడో అప్పుడు ఆ వారాహి…వరాహి అవుతుంది.
– నువ్వు వారాహి యాత్ర కాదు…వరాహి యాత్ర చేస్తున్నావ్…
– ఆయన ఎక్కువ సార్లు ఆవేశ పడుతున్నాడు…ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు.
– గతంలో ఆయనకు చాలా సార్లు ఆవేశం వచ్చింది..అప్పుడెప్పుడో కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరు చెప్పి తుపాకీ పట్టుకుని తిరిగాడు.
– ఆ తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ నేను కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడుతున్నాను అంటూ కోటి రూపాయలు రాసిచ్చాడు.
– ఆ కోటి ఈయన రాయలేదు…అప్పటి హీరోయిన్, ఈయన భార్య రేణు దేశాయ్ గారు ఇచ్చారు.
– ఆ కోటి రూపాయలు ఏమయ్యాయో, ఆ కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైందో తెలియదు.
– కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోయి ఇప్పుడు దుష్టచతుష్టయం ఫోర్స్ జనసేన రూపంలో వచ్చింది.
– రాష్ట్రంలో దుష్టచతుష్టయాన్ని కాపాడుకోడానికి అప్పుడప్పుడు ఊగిపోతుంటాడు..అప్పుడప్పుడు సాగిపోతుంటారు.
– అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తున్నారు అయ్యగారు.
– పీఆర్పీలో ఈయన యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నారు…అప్పుడు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో రాజశేఖరరెడ్డి గారి పంచెలు ఊడగొట్టి కొడతా అన్నాడు.
– దానికి ఫలితం పాపం చిరంజీవి గారు అనుభవించాడు…లేదంటే ఇంకో రెండు మూడు సీట్లు వచ్చేవి.
– ఎప్పుడైతే రాజశేఖరరెడ్డి గారిపై అవాకులు, చెవాకులు పేలి పిచ్చివాగుడు వాగాడో అప్పుడో ప్రజలు ఇతను రాజకీయాలకు పనికి రాడని ప్రజలు నిర్ణయించుకున్నారు.
పవనం అంటే గాలి..కళ్యాణ్ అంటే కళ్యాణం:
– ఇతను ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో ఎవరికీ తెలియదు…
– ఇంతలోనే ఆవేశం వస్తుంది..ఇంతలోనే తగ్గుతుంది..అప్పుడే ఊగిపోతాడు..అప్పుడే సాగిపోతాడు.
– ఇది చిత్రవిచిత్రమైన స్వభావం కలిగిన వ్యక్తిగా ఆ రోజే నిర్ణయించారు.
– ఆ తర్వాత ఆ అవతారాన్ని పక్కన పెట్టి జనసేన రూపంలో వచ్చాడు.
– నేను సంస్కారవంతుడినని చెప్పుకుంటున్నాడు. ఏంటబ్బా నీ సంస్కారం..?
– మీ పార్టీ ఆఫీసులో వందలాది మంది కార్యకర్తలు, మీడియా అంతా ఉన్నప్పుడు కాలుకున్న చెప్పును తీసుకొని చెప్పు తీసుకుని కొడతా అని బూతు పదజాలాన్ని వాడిన నువ్వు ఇవాళ సంస్కారం గురించి నువ్వు మాట్లాడతున్నావ్.
– జగన్ ని ఏకవచనంతోనే పిలుస్తాను..బహువచనంతో పిలవను అంటున్నాడు…
– నువ్వు ఏకవచనంతో పిలిస్తే…బహువచనంతో పిలిస్తే మాకు పోయేదేంటో నాకు అర్ధం కావడం లేదు.
– అది నీ సంస్కారానికి సంబంధించిన అంశం అనేది నువ్వు మర్చిపోతున్నావ్..
– జగ్గూభాయ్ అంటున్నాడు..ఏకవచనంతో పిలవడు కానీ భాయ్ అంటాడట..
– నీ పేరేంటి పవన్ కళ్యాణ్…పవన్…కళ్యాణ్…
– కొణిదల వెంకట్రావు, అంజనీదేవి గార్లు ఎంత గొప్ప పేరు పెట్టారయ్యా నీకు…కళ్యాణ్ బాబు అని పెట్టారట.
– రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను..పవనం అంటే…కళ్యాణం అంటే ఏమిటి..?
– పవనం అంటే గాలి..కళ్యాణ్ అంటే కళ్యాణం. ఎంత సార్ధక నామధేయుడివయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు.
– నిజంగా వెంకట్రావుగారు ఎంతగా భవిష్యత్తును ఆలోచించి ఆ పేరు పెట్టారో..?
– మా అమ్మ దీపారాదన చేస్తుంటే దానిలో మా నాన్న సిగిరెట్ ముట్టించుకునేంత హేతువాది అని చెప్తున్నావ్…
– తల్లిదండ్రుల మీద గౌవరం ఇదేనా..? నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతుంటే మేం వినాల్సి రావడం మా ఖర్మ.
– వారాహి ఎక్కి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నావ్…
కాపులను మచ్చిక చేసుకునేందుకే నీ యాత్ర:
– అసలు ఉభయగోదావరిలోనే ఎందుకు తిరుగుతున్నావు..? ఇది దుష్టచతుష్టయం పథకం.
– ఆ రెండు జిల్లాల్లో కాపులను మచ్చిక చేసుకుని, రెచ్చ గొట్టే ప్రయత్నం.
– కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిన టీడీపీకి కాపులు వ్యతిరేకంగా ఉన్నారు.
– వారంతా వ్యతిరేఖమే కాదు…కక్షతో ఉన్నారు..కారణం ఉద్యమం చేసిన కాపు నాయకులను చిత్రహింసలకు చంద్రబాబు గురిచేశాడు.
– ముద్రగడను వెంటాడి తరిమి ఆయన్ను హింసించారు కాబట్టి.
– చివరికి ముద్రగడ సతీమణి ని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టి వేదించి చిత్రహింసలకు గురిచేశారు.
– ఆ ఉద్యమం సందర్భంగా అనేక కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత తీసేశారు.
– కాబట్టి కాపులు చస్తే మేం టీడీపీకి ఓటు వేసేది లేదనంటున్నారు.
– వాళ్లందరినీ మచ్చిక చేసుకోవడానికి ఆ దుష్టచతుష్టయం చెప్పినట్లు చేస్తున్నాడు.
– రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, చంద్రబాబు చెబితే అక్కడ మాత్రమే తిరుగుతున్నాడు.
– తర్వాత అన్ని చోట్లకూ తిరుగుతావులే..అది వేరే విషయం.
వాలంటీర్ వ్యవస్థపై అసలు నీ అభ్యంతరం ఏమిటి మిస్టర్ గాలి కళ్యాణ్..?:
– ఆ రెండు జిల్లాల్లో తిరుగుతూ హద్దులు మీరి మాట్లాడుతున్నావు.
– నీకు అసలు అంతరాత్మ ఉందా..? వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడావో గుర్తు చేసుకో.
– వాలంటీర్ వ్యవస్థ ఉమెన్ ట్రాఫికింగ్ చేసేవారికి దోహదం చేస్తోంది అన్నావు.
– స్త్రీలను అక్రమ రవాణ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ సహకరిస్తోంది అన్నావు.
– ఆ మాట మీద నిలబడ్డాడా అంటే అదీ లేదు.
– వాలంటీర్ వ్యవస్థ రోడ్ల మీదకు వచ్చి ఇదేమీ అన్యాయం అక్రమం అంటూ ప్రశ్నించారు.
– లక్ష 30వేల మంది మహిళా వాలంటీర్లు మహిళలను అక్రమంగా తరలిస్తున్నామా అని గొంతెత్తారు.
– దీంతో నేను అందర్నీ అనలేదు కొంత మందిని మాత్రమే అన్నాను అని జారిపోయాడు.
– మళ్లీ అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అంటాడు..మరి కాసేపు ఇది జగన్మోహన్రెడ్డి సైన్యం అంటాడు.
– అసలు నీ అభ్యంతరం ఏమిటి పవన్ కళ్యాణ్…మిస్టర్ గాలి కళ్యాణ్ దేనికీ నీ అభ్యంతరం..?
– మహిళలను అక్రమంగా తరలిస్తున్నారనా, సమాంతర వ్యవస్థగా తయారవుతున్నందుకా..లేక జగన్మోహన్రెడ్డి సైన్యం అవుతున్నందుకా అది చెప్పడు.
– అది చెప్పాలంటే చంద్రబాబును, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడులను అడగాలి.
– దామోదరం సంజీవయ్య సమయంలో కూడా పింఛన్లు అందలేదా..? ఇవాళ పింఛన్లు అందడానికి వాలంటీర్లు కావాలా అంటున్నాడు.
– చంద్రబాబు సమయంలో కూడా పింఛన్లు అందాయి…
– అప్పుడు ఫించన్లు ఎన్ని…ఇప్పుడెన్ని..? ఇప్పుడు ఎలా అందుతున్నాయో తెలుసా నీకు..?
– ఒకటో తేదీ ఉదయమే 5గంటలకు వెళ్లి వృద్ధుల చేతుల్లో రూ.2750 పెడుతుంటే వారి ఆనందాన్ని పవన్ కళ్యాణ్ చూడలేకపోతున్నాడు.
– వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి..గడప గడపకూ సంక్షేమ పథకాలను అందించడానికి తాపత్రయ పడుతున్న హృదయం జగన్ గారిది.
– అది చూసి భరించలేక, ఎక్కడ జగన్మోహన్రెడ్డి గారు మళ్లీ వచ్చేస్తారో అనే భయంతో మాట్లాడుతున్నాడు.
– 2.50 లక్షల మంది వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు.
– ఇంటింటికి వెళ్లి సేవ చేస్తుంటే దాని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి మళ్లీ జగన్ జెండా ఎగురేస్తారనే భయంతో నువ్వు నీ దుష్టచతుష్టయం అల్లాడిపోతున్నారు.
– ఏదో ఒక విధంగా వాలంటీర్ వ్యవస్థను దాడి చేసి కోర్టులకు వెళ్లి నిర్వీర్యం చేయాలనే తాపత్రయం నీలో కనిపిస్తోంది.
– ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తులను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది.
పవన్ కళ్యాణ్‌కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్:
– పిచ్చి జనాన్ని ముందు పెట్టుకుని పిచ్చికూతలు కూసే పవన్ కళ్యాణ్ గారు నీకు భవిష్యత్తు లేదు..రాజకీయాలకు నువ్వు పనికిరాదు.
– మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ నిన్ను ఆవహించి ఉంది. అప్పుడే ఆవేశం, ప్రేమ, తిట్లు, పొగడ్తలు అన్నీ వచ్చేస్తాయి.
– క్షణకణానికి మారిపోతుంటాయి. ఐ లవ్యూ అంటాడు..కాసేపాగి ఐ హేట్ యూ అంటాడు.
– నేను గాంధీ మహాత్ముడిని అంటాడు..లేదు లేదు నేను చెగువీరాని..విప్లవకారడ్ని అంటాడు..
– స్వామీ వివేకానంద నాకు ఆదర్శం అంటాడు..కాసేపట్లోనే మావో సెటాంగ్, కానూ సన్యాల్ నాకు ఆదర్శం అంటాడు.
– అసలు క్లాస్ వార్ చేసే వారు ఇంటి పేరు చివర రెడ్డి పెట్టుకుంటారా అంటూ జగన్ గారిని విమర్శిస్తున్నాడు.
– అసలు క్లాస్ వార్కి ఆద్యుడు తరిమెల నాగిరెడ్డి అంటాడు…
– ఇలాంటి రకరకాల డిజార్డర్స్ ఉన్న వ్యక్తివి నువ్వు…ఎవ్వరూ నీ వెంట నడవలేరు.
రాజకీయాలే కాదు..వ్యక్తిగతంగానూ అతనితో ఎవరూ చివరి వరకూ నడవలేరు:
– రాజకీయ జీవితమే కాదు…వ్యక్తిగత జీవితం కూడా పరిశీలిస్తే..అతనితో పూర్తిగా ప్రయాణం చేసిన వ్యక్తులను నాకు చూపించండి.
– రాపాక వరప్రసాద్ విషయాన్ని పరిశీస్తే..పవన్ ఓడినా రాపాక గెలిచారు.
– నేను ఓడిపోతే రాపాక గెలవడం ఏంటని..అతన్ని ఇష్టం వచ్చినట్లు చూశాడు…
– రాపాక జనసేనలో ఇమడలేక పోయాడు..మాతో పయనం చేస్తున్నాడు.
– నేనే ఓడిపోతే నా గుర్తు మీద గెలవడానికి నువ్వెవడివి అనే డిజార్డర్ పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్ పట్ల చూపించాడు.
– జేడీ లక్ష్మీనారాయణ కూడా నీతో ప్రయాణం చేశాడు…ఇప్పుడు నీతో పాటు ఉన్నాడా..?
– తమిళనాడు సీఎస్‌గా పనిచేసిన రామ్మోహన్రావు మీ పార్టీలోకి వచ్చాడు..నిన్ను దగ్గరుండి చూశారు. నీతో ఇమడలేమని వెళ్లిపోయాడు.
– ఇది మల్టీ డిజార్డర్ ఉన్న కేసు…ఇతనితో మనం ప్రయాణం చేయలేమని నమస్కారం పెట్టి వెళ్లిపోయారు.
– ఇన్‌కం టాక్స్ కమిషనర్‌గా చేసిన పీవీ రావు, సీహెచ్ పార్ధసారధి ఐఆర్ఎస్ రిజైన్ చేసి వచ్చారు..ఈయన దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయాడు.
– తోట చంద్రశేఖర్…వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.
– చిరంజీవి గారితో చాలా సన్నిహితం. పీఆర్పీలో కూడా పోటీ చేశాడు.
– ఆయన కూడా దగ్గరుండి చూశాడు..ఇతనికి పర్సనాలిటీ డిజార్డర్ ఉందని వెళ్లిపోయాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నాడు.
– మరిశెట్టి రాఘవయ్య కూడా ఈయన్ను దగ్గరగా చూసి భయపడి వెళ్లిపోయాడు.
– రాజు రవితేజ అనే వారు ఇతనికి చాలా క్లోజ్…ఆయన జనసేన ఫౌండర్..ఇప్పుడేమయ్యాడు..?
ఎప్పుడు ఏ పార్టీతో ఉంటావో నీకైనా తెలుసా..?:
– నాకు సినిమాల్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు…ఈ గదిలో షూటింగ్ జరుగుతుంటే నాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ తగులుతుంది అంటాడట.
– అదిగో ఆ మూలన పచ్చ చొక్కా వేసుకున్నోడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటాడట.
– బౌన్సర్లను పిలిపించి ఆ పచ్చ చొక్కా వాడిని బయటకు గెంటేస్తారట.
– మళ్లీ ఆ పచ్చ చొక్కా వక్తి కనిపిస్తే నమస్కారం బాబూ..బాగున్నావా అంటాడట..
– ఇది మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్..ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాడో తెలియని గాలి కళ్యాణ్ ఇతను.
– ఇతను ఇవాళ జగన్ గారిని ఇమిటేట్ చేస్తున్నాడు…సినిమా యాక్టర్ కదా..ఇమిటేట్ చేస్తాడులే.
– కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు…యువరాజ్యం అన్నావు..జనసేన అన్నావు..
– తర్వాత కమ్యూనిస్టులతో ఉన్నావ్..బీజేపీతో ఉన్నావ్..టీడీపీతో అన్నావు..
– దీన్నే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్..నువ్వు జగన్ గారిని విమర్శించడానికి సిగ్గుందా..?
– మళ్లీ దేనితో ఉంటావో ఉండవో తెలియని నువ్వు జగన్ గారిని విమర్శిస్తావా..?
– చాలా మంది ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ వచ్చారు సీఎం అయ్యారు.
– మీ సోదరుడు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని రాజకీయాల్లోకి వచ్చారు..కాలేక నిష్క్రమించారు.
– నాదెండ్ల భాస్కరరావు, దాసరి నారాయణరావులు కూడా పార్టీలు పెట్టి నిష్క్రమించారు.
– ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు…అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు…ప్రజల వద్దకు వెళ్లొచ్చు.
– నువ్వూ ఒక రాజకీయ పార్టీ పెట్టావు…జగన్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టారు.
– ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమారులు అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు.
– డాక్టర్ వైఎస్సార్ మరణించిన తర్వాత జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.
– కేవలం రాజశేఖరరెడ్డి గారి కుమారుడని అందలం నేరుగా ఎక్కాడా..?
– రాజశేఖరరెడ్డి గారి మరణానికి, జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మధ్య జరిగిన సంఘర్షణ ఒక్క సారి తెలుసుకో గాలికళ్యాణ్..
– ఎన్నెన్నో కష్టాలు, నష్టాలు పడ్డాడు…
– 2014లో 63 సీట్లు వస్తే మీ దత్తతండ్రి 23 సీట్లు ఎత్తుకుపోతే వెంట్రుకగా భావించాడు.
– అలాగే ప్రజల మధ్యకు వెళ్లి పాదయాత్ర చేసి 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చాడు.
– జగన్మోహన్రెడ్డి ని అనే నైతిక హక్కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న నీకెక్కడిది గాలి కళ్యాణ్..?
– జగన్మోహన్ రెడ్డి పేరెత్తే అర్హత నీకు లేదు..ఇక ముందు రాదు గుర్తుపెట్టుకో.
– కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు పాదాల వద్ద పెట్టేందుకు వారాహి యాత్ర పేరుతో కాపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరుగుతున్న నీ కుట్ర అందిరికీ తెలుసు.
– నువ్వు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా నువ్వు జగన్‌కి అడుగు దగ్గర్లోకి కూడా రాలేవు.
నువ్వు చేసిన విప్లవం ఏంటో చెప్పు…మైకు పట్టుకుని ఊగడం విప్లవం కాదు పవన్:
– అదేమంటే నేను విప్లవకారుడ్ని అంటాడు..నువ్వు చేసిన విప్లవం ఏంటో చెప్పయ్యా..?
– మైకు పట్టుకుని ఊగిపోవడం విప్లవం, పోరాటం అనుకుంటున్నావా..?
– ఏం కష్టపుడుతున్నావు నువ్వు..సినిమాల్లో నటిస్తున్నావు..బాగా డబ్బులు తీసుకుంటున్నావుగా.
– నువ్వు నీతిమంతుడివి అంటున్నావు కదా…పారదర్శకత ఉంది అంటున్నావు కదా…
– నువ్వు ఒక్కొక్క సినిమాకి ఎంత తీసుకుంటున్నావు..ఎంత టాక్స్ కడుతున్నావో చెప్పి వారాహి వ్యాన్ ఎక్కు..
– చెప్పకుండా వారాహి వ్యాన్ ఎక్కావా అది వరాహి వ్యానే.
– నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే సినిమాల్లో లైట్ బాయ్‌ని అడిగినా చెప్తాడు.
– భార్యను పెళ్లాం అంటున్నారు అని కోపం వచ్చింది..విభిన్న పెళ్లిళ్లు చేసుకుంటున్నప్పుడు పెళ్లాలనే అంటారు. దాంట్లో పెద్ద తప్పులేదే..?
– జగన్ గారి గురించి మాట్లాడి మీడియాలో ప్రాముఖ్యత పొందాలనే తపన పడుతున్న వ్యక్తివి నువ్వు.
– నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్లలేవు..చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయలేవు..
– ముందు నిన్ను సంస్కరించుకో…నీ ఆవేశాన్ని తగ్గించుకో…ఆలోచన పెంచుకో.
– మొదటి మర్యాదగా మాట్లాడతాడు..కాసేపటికి ఊగుతాడు..తర్వాత ఆవేశపడతాడు…ఆలోచన మరచి బూతులు తిడతాడు.
– మళ్లీ సాయంత్రానికి సంస్కారం అంటే ఇలా ఉండాలి అనే మళ్లీ మనకే ఉపన్యాసం చెప్తాడు.
– ఇన్ని మార్పులు మారిన నువ్వు రాజకీయాలకు పనికి రావు…కొద్ది రోజులు పోతే సినిమాలకు కూడా పనికిరావు.
అతనికి ఆరాటం తప్ప పోరాటం ఎక్కడుంది..?:
– వాలంటీర్లు వుమెన్ ట్రాఫికింగ్ అంటూ ఆరోపించావు..నిరూపించమంటే మాట్లాడడు.
– వాలంటీర్ల వ్యవస్థ ఏమిటి..ఏమి సేవ చేస్తున్నారో కూడా ఆయనకు తెలియదు.
– ఆఫీసుల చుట్టూ తిరగలేని అందరికీ ఉపయోగపడే ఒక మంచి వ్యవస్థ.
– దానిపై బురదజల్లాలని తాపత్రయపడుతున్న దుష్టచతుష్టయానికి అండగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు.
– ఈ రాష్ట్రంలో జరిగిన విప్లవాత్మక సంస్కరణలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారిని 175 సీట్లిచ్చి మళ్లీ అధికారంలోకి తెస్తాయి.
– ఇది నేను చెప్తున్న మాటే కాదు…సర్వేలు కూడా అదే చెప్తున్నాయి.
– చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వాలంటీర్లనే కాదు…జగన్ గారు పేరు వింటేనే భయపడుతున్నారు.
– అతను ఎవరు మీద పోరాటం చేస్తున్నాడు..పోరాటం అంటే రోజూ మీటింగులు పెట్టడం అనుకుంటే పోరపాటు.
– అతనికి ఆరాటం తప్ప పోరాటం ఎక్కడుంది..?
– వారాహి ఎక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పోరాటం కాదు.
– అతని గురించి పట్టించుకోవద్దు…అతను కొంచెం తేడా మనిషి.
– ఎప్పుడు చొక్కా ఊడదీస్తాడో…చెప్పులు తీస్తాడో తెలియదు.
– అతని గురించి పెద్దగా పట్టించుకోవద్దు..అప్పుడప్పుడు కాస్త టీవీల్లో వేస్తే ప్రజలకు కాలక్షేపంగా ఉంటుంది.
– అన్నవరంలో చెప్పులు పోయాయట…బందరులో దొరికాయట…
– అతనికి పోయింది చెప్పులు కాదు…బుర్రే పోయింది…
– చెప్పులు పొతే కొనుక్కోవచ్చు..బుర్ర పోతే ఏం చేయలేం.
– ఊరక చెప్పుల రాజకీయాలు, క్యామిడీ చేస్తుంటాడు…
– ఎంజాయ్ ది మల్టిపుల్ డిజార్డర్ పర్సనాలిటీ రాజకీయం.
పోలవరాన్ని కేంద్రమే కడుతోంది..పురందేశ్వరికి తెలియదేమో…?:
– పురందేశ్వరి కి తెలియదనుకుంటా..ఇప్పటికీ కేంద్రమే కడుతోంది..కేంద్రం పర్యవేక్షణే ఉంటుంది.
– ఇంప్లిమెంటేషన్ అథారిటీ పీపీఏ..సీడబ్ల్యూసీ…ప్రతి ఒక్కటీ వారి చేతుల్లోనే ఉంది.
– కావాలంటే తీసుకోమనండి…కేంద్ర మంత్రి కి చెప్పి వీళ్లు కట్టలేకపోతున్నారు అని తీసుకోమనండి. తీసుకొచ్చింది చంద్రబాబునాయుడు..
– ఏదో కొత్తగా అధ్యక్షురాలు అయ్యాను కదా అని వివాదాస్పదంగా మాట్లాడాలని ఆమె అనుకుంటున్నారేమో..?
– మహిళలపై దాడుల విషయంలో చంద్రబాబు హయాంలో ఎన్ని జరిగాయో ఆయన్నే వివరాలు ఇవ్వమనండి.
– ఆయన హయంతో పోలిస్తే ఇప్పుడెలా ఉందో అప్పుడు చర్చించవచ్చు.
– పవన్ కళ్యాణ్ ఊరెళ్లే వరకూ చంద్రబాబు మాట్లాడడనుకుంటా..