-జగన్ విముక్త ఏపీ కోసం ఏకమవుదాం
-రాష్ట్రం కోసమే పొత్తులు
-టీడీపీ హయాంలోనే మైనారిటీలకు భద్రత
-జగన్ జనాలకు సెగగడ్డ
-టీడీపీ-జనసేన-బీజేపీ ఓటు బదిలీ జరగాలి
-మూడు పార్టీలు కలసి వైసీపీ ముప్పేట దాడి చేద్దాం
-మూడు పార్టీలూ సమన్వయంతో సాగుదాం
-టీడీపీ-జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ సమావేశంలో సత్తెనపల్లి -టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ పిలుపు
– ప్రత్యేక అతిధిగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మైనారిటీలపై ఎప్పుడూ దాడులు జరగలేదని, ఆ విషయాన్ని మైనారిటీలకు చెప్పాల్సిన అవసరం ఉందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.
‘‘ గతంలో టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా మైనారిటీలు భద్రంగా ఉన్నారు. వారికి సంక్షేమ పథకాలు రూపొందించారు. కానీ దాన్ని ఈ సైకో జగన్ వచ్చాక రద్దు చేశాడు. రంజాన్ తోఫాతో సహా పండుగలకు అనేక బహుమతులిస్తే, గత ఎన్నికల్లో ముస్లింలతో ఓట్లు వేయించుకున్న జగన్ వాటిని రద్దు చేశాడు. క్రిస్టియన్ కార్డు వాడి అధికారంలోకి వచ్చిన జగన్.. చివరకు వారి విద్యాసంస్థలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఐదేళ్లలో ఎక్కువ దాడులు జరిగింది దళితులు-ఎస్సీ-ముస్లింలపైనే. ఇక దళితులు, బీసీల కోసం ప్రవేశపెట్టిన మొత్తం 100 పథకాలను ఈ సైకో సర్కారు రద్దు చేసింది.
చంద్రబాబు ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, దానిని కూడా జగన్ రద్దు చేసి, తన కాపు వ్యతిరేకతను చాటుకున్నాడు. అన్ని వర్గాల సంక్షేమాన్ని అటకెక్కించిన జగన్, మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మూడు పార్టీలదే. ఈ వాస్తవాలను జనంలోకి తీసుకువెళ్లి, ఆయా వర్గాలనుచైతన్యం చేయాల్సిన బాధ్యత కూటమి నాయకులదే’’ అని కన్నా పిలునిచ్చారు.
మనం ఎన్నికల్లో ఉన్నాం. మన లక్ష్యం ఈ రాష్ట్రాన్ని రాక్షసుడు చేతులు నుండి కాపాడుకోవటమే. ఈ రాష్ట్రం ఒక దొంగల ముఠా చేతుల్లో నలిగిపోతోంది. గత ఐదు సంవత్సరాలుగా. ఈ రాష్ట్ర ప్రజలు విలవిలాడిపోతున్నారు. ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనసేన బిజెపి తెలుగుదేశం ఏకమైతే తప్ప ఈ రాష్ట్రాన్ని రక్షించుకోలేము.
అధికార పార్టీ ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ ని అవమానపరిచింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అకారణంగా అక్రమ కేసులతో జైలుకు పంపింది. ఆ సమయంలో బాబు-పవన్ ఒకరికొకరి తోడుగా నిలబడి, ఈ రాక్షస ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు.
ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు లో కలవడం జరిగింది. ఈనెల 17 న తెలుగుదేశం జనసేన బిజెపి భారీ బహిరంగ సభ జరుగుతుంది.
ఈ సభ ముఖ్య ఉద్దేశం కూడా ఈ రాష్ట్రాన్ని సైకో నుంచి రక్షించుకోవడం. అందరం కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం- జనసేన- బిజెపి కూటమిని అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుందాం. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.