Suryaa.co.in

Andhra Pradesh

నారా లోకేష్ కు కనీస లోకజ్ఞానం లేదు

– వాస్తవాలు తెలుసుకునే ఇంగితం అసలే లేదు
– అవివేకం… అనుభవరాహిత్యం… అజ్ఞానంతోనే లోకేష్ ప్రేలాపనలు
– బాబు హయాంలో ఉద్యోగాలు లేక యువత నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోయింది
– సచివాలయ వ్యవస్థతో సీఎం వైయస్ జగన్ ఒక విప్లవాత్మక మార్పుకు నాంధి పలికారు
– లక్షలాధి మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు
– సచివాలయ ఉద్యోగులుగా ఎనర్జీ అసిస్టెంట్స్ నిబద్దతతో పనిచేస్తున్నారు
– హాజరు కోసం వారికి అవసరమైన వెసులుబాటు కల్పించాం
– కట్టుబానిసల్లా పనిచేస్తున్నారంటూ కించపరిచేలా లోకేష్ మాట్లాడుతున్నాడు
– తమ హయాంలో కనీసం ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనే చంద్రబాబు చేయలేదు
– ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు పొందిన యువత గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు ఎక్కడిది?
– నిబంధనల ప్రకారమే ఎనర్జీ అసిస్టెంట్లకు విధుల కేటాయింపు
– జాతీయ సంస్థల పర్యవేక్షణలో వారికి వృత్తి నైపూణ్య శిక్షణ
– సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వారికి ప్రొబేషనరీ
– అందరు సచివాలయ ఉద్యోగులకు వర్తించే నిబంధనలు వారికి వర్తింపు
– విపత్తుల సమయంలోనూ ఎనర్జీ అసిస్టెంట్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు
– ప్రమాదాలకు గురైన సందర్భంలోనూ వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది
– తమకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వం పట్ల ప్రేమతో, బాధ్యతతో పనిచేస్తున్నారు
– ఎనర్జీ అసిస్టెంట్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా లోకేష్ వ్యాఖ్యలు
– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ రాసిన లేఖ ద్వారా మరోసాని తన అజ్ఞానంను చాటుకున్నాడని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాజలీ, మైన్స్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో వివమర్శించారు. లోకేష్ కు కనీస లోకజ్ఞానం కూడా లేదనే విషయాన్ని రాష్ట్రప్రజల ముందు మరోసారి స్పష్టం చేశాడని అన్నారు. ముఖ్యమంత్రి కి లేఖరాసే సందర్భంలో కనీస వాస్తవాలు తెలుసుకునే ఇంగితం కూడా తనకు లేదని లోకేష్ చాటుకున్నాడని పేర్కొన్నారు. అవివేకం, అనుభవరాహిత్యం, అజ్ఙానంకు కేరాఫ్ లోకేష్ అని అనుకుంటున్న సొంత తెలుగుదేశం నేతల మనస్సులోని మాటలకు అద్దం పట్టేలా లోకేష్ ప్రేలాపనలు ఉన్నాయని అన్నారు.

ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా సీఎం వైయస్ జగన్ పాలనలో ఒక విప్లవాత్మక మార్పులకు నాంధి పలికారు. లక్షలాధి మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి, యువతలో స్పూర్తిని నింపారు. విద్యుత్ శాఖను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సచివాలయాల పరిధిలొ ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందితో సమానంగా ఎనర్జీ అసిస్టెంట్ లకు ఆర్ఇసి, ఎన్టిపిఐ వంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థల తోడ్పాటుతో వృత్తినైపూణ్యాలపై శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది. దీనికి తోడు సంస్థాపరంగా కూడా ఎప్పటికప్పుడు ఎనర్జీ అసిస్టెంట్ లకు వృత్తి నైపూణ్యాలను పెంచే ప్రయత్నం జరుగుతోంది. విద్యత్ లైన్ల మరమ్మతుల సమయంలో ఎటువంటి శిక్షణ లేకుండా స్తంభాలను ఎక్కించి, ఎనర్జీ అసిస్టెంట్ లను ప్రమాదాల్లోకి నెడుతున్నారంటూ లోకేష్ తన లేఖలో పేర్కొనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం.

సచివాలయ ఉద్యోగులందరికీ ప్రభుత్వపరంగా వర్తించే అన్ని నిబంధనలు ఎనర్జీ అసిస్టెంట్ లకు వర్తిస్తున్నాయి. సెలవులు, ఇతర సదుపాయాలు వారికి ఇతరులతో సమానంగానే కల్పించడం జరిగింది. సెలవులు లేకుండా పనిచేయాల్సి రావడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటూ లోకేష్ వాపోవడం విడ్డూరంగా ఉంది. సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబెషనరీ ప్రకటించాలని సీఎం వైయస్ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎనర్జీ అసిస్టెంట్ లకు కూడా ప్రొబెషనరీ ప్రకటించడం జరిగింది. ఈ విషయంలోనూ లోకేష్ తన అవగాహన లేమిని చాటుకున్నారు. ప్రొబెషనరీకి ముందు రూ.15వేల జీతం ఉంటే, ఆ తరువాత అది రూ.31 వేలకు పెరిగిన విషయం లోకేష్ కు తెలియకపోవడం విచారకరం.

బాబు వస్తే… జాబు వస్తుందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన హయాంలో యువతకు మొండి చేయి చూపించారు. ఉద్యోగాలు, ఉపాధి లేక వారు నిరాశా, నిస్పృహల్లోకి వెళ్లిపోయారు. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి రాగానే యువతలో విశ్వాసాన్ని కల్పిస్తూ, అటు సచివాలయాలు, ఇటు ఎపిపిఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి మరీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లు ప్రతికూలా పరిస్థితుల్లోనూ రెగ్యులర్ విద్యుత్ రంగ సిబ్బందితో కలిసి తమ శక్తిమేరకు సేవలు అందిస్తున్నారు. దీనివల్లే రాష్ట్ర విద్యుత్ సంస్థలు వినియోగదారుల సేవా సూచికలో జాతీయ స్థాయిలో ఏ గ్రేడ్ సాధించాయి.

LEAVE A RESPONSE