Suryaa.co.in

Andhra Pradesh

పేదవిద్యార్థుల కడుపు నింపడానికి రూ.500కోట్లు విడుదల చేయలేదా?

– ఏజెన్సీలకు జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో లక్షలాదిమంది దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ విద్యార్థులు విలపిస్తున్నారు
• ప్రభుత్వఆసుపత్రులకు మందులుసరఫరాచేసే ఏజెన్సీలకు కూడా ప్రభుత్వం బిల్లులు నిలిపేసింది
దాంతో పేదలకునాణ్యమైన వైద్యంకూడా లభించని దుస్థితి
– మాజీ మంత్రి పీతలసుజాత
దోపిడీ రుచిమరిగిన వైసీపీప్రభుత్వం ఆఖరికి దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ విద్యార్థులను కూడా వదలకుండా, విద్యాభ్యాసంకోసం వసతిగృహాల్లో ఉంటున్నవిద్యార్థులకడుపు మాడు స్తూ, కేవలంమాటలను పేదలకుపంచుతూ, మూటలను మాత్రం తమపరం చేసుకుంటోందని మాజీ మంత్రి శ్రీమతి పీతలసుజాత తెలిపారు. బుధవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
ఈ ప్రభుత్వపనితనమంతా మాటలకు, సెల్ఫ్ డబ్బాలకే పరిమితమైంది. మధ్యాహ్నభోజన పథకం లోభాగంగా విద్యాభ్యాసం చేస్తున్నపేదపిల్లలు ఆకలికేకలు వేస్తుంటే, వైసీపీప్రభుత్వం చోద్యంచూస్తోంది. కడుపునిండని పిల్లలు, ఏంచదువుతారని, ఎలా చదువుతారనే ఆలోచన కూడా చేయకుండా, ఈప్రభుత్వం వారిని ఆకలితో అలమటింపచేయడం నీచాతినీచం. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ విద్యార్థులకోసం టీడీపీప్రభుత్వహాయాంలో అధునాతన వసతుతల తో వసతిగృహాలు ఏర్పాటుచేయడంజరిగింది. కానీ నేడు ఆ వసతిగృహాల్లోఉంటున్న చిన్నారులు, విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు.
ప్రభుత్వం సకాలంలో భోజననిర్వాహ కులకు, గుడ్లు , పాలు సరఫరాచేసేవారికి నిధులు చెల్లించకపోవడంతో, పేదలకడుపు నింప డానికి వారివద్ద డబ్బులేక విద్యార్థులకడుపు మాడుస్తున్నారు. రంగులు వేయడానికి రూ.3,500కోట్లుదుర్వినియోగంచేసిన జగన్ ప్రభుత్వం, వసతిగృహాల్లోని విద్యార్థుల కడుపు నింపడానికి సకాలంలో నిధులు ఎందుకు విడుదలచేయడం లేదు? రంగుల్లో అవినీతిచేసి, డబ్బు లు తినొచ్చుగానీ, పేదవిద్యార్థుల కడుపునింపితే తమకేం వస్తుందన్నఆలోచనలో ప్రభుత్వపెద్దలు ఉన్నారా? సెంటుపట్టా పేరుతో పేదలనుంచి రూ.7వేలకోట్లను ఈ ప్రభుత్వం దిగమింగింది.
అదిచాలదన్నట్లు మద్యం పేరుతో రూ.25వేలకోట్లు, రంగులపేరుతో రూ.3,500కోట్లను, కొత్తఇసుకపాలసీ పేరుతో రూ.10వేలకోట్లు, ఆఖరికి పేదలవైద్యసేవల కోసం వినియోగించే అంబులెన్సులపేరుతో

వందలకోట్లను వైసీపీనేతలు, ప్రభుత్వంలోని వారు దిగమింగారు. ఈ విధంగా ఎక్కడికక్కడ అయినకాడికి కాజేస్తున్నారుగానీ, అర్థాకలితో అన్నమోరామచంద్రా అని విలపిస్తున్న విద్యార్థలకేకలు మాత్రం పట్టించుకోవడంలేదు. విద్యార్థుల వసతిగృహాలకు, పేదలకు సరఫరాచేసే బియ్యంలోకూడా ఈ ప్రభుత్వం రూ.2వేల కోట్ల అవినీతికి పాల్పడింది.
ఇదంతా చాలక తాజాగా పేదలభూమి, ఇళ్లపై ఈ ప్రభుత్వకన్ను పడింది. చిన్నపిల్లల కడుపునింపకుండా వారిపొట్టకొడుతున్న జగన్మోహన్ రెడ్డి, గతంలో ఎప్పుడో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్నభోజనంలో తమప్రభుత్వం రాజీపడదంటూ పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. ప్రభుత్వం డబ్బులివ్వకుండా, మహిళాసంఘాలు, ఉపాధ్యాయులు, దాతలు ఎంతకాలం వారిసొంతసొమ్ముతోవిద్యార్థుల కడుపునింపుతారు? ఆఖరికి ఈ ప్రభుత్వం ప్రభుత్వవైద్యశాలలకు సరిపడా మందులు, ఇతరత్రా పరికరాలను కూడా అందిం చలేకపోతోంది. మందులు సరఫరాచేసే ఏజెన్సీలకు ఈప్రభుత్వం సకాలంలో బిల్లులు క్లియర్ చేయకపోవడంతో చాలాప్రాంతాల్లో ఇప్పటికే అనేకమెడికల్ ఏజేన్సీలు, మందులసరఫరాను నిలిపివేశాయి.
విద్యార్థులకడుపు నింపకుండా, ప్రభుత్వవైద్యశాలలకు మందులు అందించ కుండా ఈప్రభుత్వం, ఇంకా సిగ్గులేకుండా పేదలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటోంది. భోజనసరఫరాదారులకు రాష్ట్రవ్యాప్తంగా ఈప్రభుత్వం దాదాపు రూ.500కోట్లవరకు బకాయిపెట్టినట్లు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి మధ్యాహ్నభోజనంకోసం ప్రభుత్వవాటాగా రూ.9.40పైసలు చెల్లించాల్సిన ప్రభుత్వం, ఆ మాత్రంసొమ్ముని కూడా చెల్లించకుండా చిన్నారులను అర్థాకలితో చంపేయాలని చూడటం బాధాకరం.
రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదల కుండా వేలకోట్లు దోచేస్తున్న జగన్ ప్రభుత్వం విద్యార్థులకడుపునింపడానికి రూ.500 కోట్లు చెల్లించలేకపోతోందా? ఇంతకంటే దారుణం మరోటిఉందా? జగన్ ప్రభుత్వం పేదల కడుపుకొడుతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? టీడీపీప్రభుత్వహయాంలో విద్యార్థులకు పెట్టేభోజనంమెనూలో పదార్థాలనుపెంచి, వారికి మూడుపూటలా నాణ్యమైన ఆరోగ్యకరమైన భోజనంఅందేలా చేశాము. ఈ ప్రభుత్వం వచ్చాక మెనూఛార్జీలు పెంచకపోగా, నాణ్యమైనభోజనం అందించకపోగా, అసలు వారికిపిడికెడు మెతుకులుకూడా లేకుండా చేయడం సిగ్గుచేటు. టీడీపీహాయాంలో విద్యాప్రమాణాల్లో రాష్ట్రం దేశంలోనే 2వస్థానంలోఉంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక 19వ స్థానానికి దిగజారింది.
అవినీతి, దుబారా అనే వాటిపైనే ఈ ప్రభుత్వం నడుస్తోంది. రూ.3లక్షలకోట్లవరకు అప్పులుచేసిన జగన్ ప్రభుత్వం, ఆ సొమ్మంతా ఏంచేసిందో తెలియదు. అదిచాలదన్నట్లు పేదలనుంచి అయినకాడికి దోచుకునే పనిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం తక్షణమే విద్యార్థులభోజనం తాలూకాబిల్లులు, ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరాచేసే ఏజెన్సీలకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE