Suryaa.co.in

Andhra Pradesh

పేదలకోసం 5శాతం భూమి అంటూ కొత్త దోపిడీ

– రాష్ట్రంలో సంపదసృష్టించడం చేతగాని ప్రభుత్వం, పేదలముసుగులో వివిధపద్ధతుల్లో దోపిడీయే ప్రధానధ్యేయంగా ముందుకెళుతోంది
– 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ప్రజలనుంచి అయినకాడికి రాబట్టాలన్న ఆలోచనలోనే ప్రభుత్వముంది
• లే అవుట్ల రెగ్యులరైజేషన్ పేరుతో 2020లో జీవో తీసుకొచ్చినప్రభుత్వం, ఇప్పటివరకు రియల్టర్లనుంచి రూ.10వేలకోట్లవరకు వసూలుచేసింది
• అదిచాలదన్నట్లు తాజాగా పేదలకోసం 5శాతంభూమి అంటూ కొత్తదోపిడీకి తెరలేపింది
• రాష్ట్రఆదాయం పెంచి, ప్రజలకు సంక్షేమం అమలుచేయడం చేతగానిప్రభుత్వం వివిధదారుల్లో దోపీడీకే ప్రాధాన్యతఇస్తోంది
• పేదలకు గృహహక్కు కల్పిస్తామంటే టీడీపీ అడ్డుకుంటోంది అంటున్న వైసీపీనేతలు, మంత్ర్రులు, ఇప్పుడే పేదలకు ఉచితంగా గృహహక్కుకల్పించవచ్చుకదా?
• ప్రభుత్వతీరుపై విద్యార్థులు, యువత, మేథావులు, ఇతరవర్గాల వారుఆలోచనచేయాలి
– టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి
రాష్ట్రంలో వేసే లే అవుట్లలో 5శాతం భూమిని రియల్టర్లు ప్రభుత్వానికి ఇవ్వాలని, అలా భూమి ఇవ్వలేకపోతే, సదరు లే అవుట్ కి మూడుకిలోమీటర్ల దూరంలో 5శాతంభూమికి సరిసమానమైనభూమినో, లేదా 5శాతంభూమి ఎంతవిలువచేస్తుందో, అంతమొత్తం సొమ్ము ని ప్రభుత్వానికి చెల్లించాలన్న జగన్ ప్రభుత్వ నిబంధన, అంతిమంగా పేదలు, మధ్యతరగతి వారికే భారంగా మారనుందని, టీడీపీ జాతీయఅధికారప్రతనిధి జీ.వీ.రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
లే అవుట్ వేసేవారు ప్రభుత్వం కోరినవిధంగా విడిగా భూమిఇవ్వడంకుదరదు.. ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. లే అవుట్లు వేసేవారు భూమివిలువకు సరిపడే సొమ్మును మాత్రమే ఇస్తారు, అదికూడా వారిజేబుల్లోనుంచి తీసిఇవ్వరు. విధిగా ప్లాట్లుకొనే వారినుంచే వసూలుచేస్తారు. ఈ ప్రభుత్వానికి నిజంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఉంటే, గతంలో పేదలపేరుతో సేకరించిన భూమినే వారికే కేటాయించవచ్చుకదా? రియల్టర్లనుంచి డబ్బులు వసూలుచేసి, తమఖజానా నింపుకోవాలన్న దురుద్దేశంతోనే పాలకులుఉన్నారు.
08-01-2020న జీవోఎంఎస్-10 విడుదలచేసిన ప్రభుత్వం, దానిలో లే అవుట్ల రెగ్యులరైజేషన్ పేరు తో, గజం భూమివిలువ రూ.3వేలుఉంటే, దానిలో 20శాతం, గజం భూమివిలువ 5వేలుంటే, దానిలో 30శాతం, గజం భూమివిలువ రూ.50వేలుంటే, దానిలో 100శాతం రెగ్యులరైజేషన్ ఛార్జీలు ప్రభుత్వానికి కట్టాలని చెప్పారు. ఆ విధంగా 2020 జనవరి నుంచి రెగ్యులరైజేషన్ ఛార్జీలపేరుతో రియల్టర్లనుంచి ఇప్పటివరకు దాదాపు రూ.10వేలకోట్లవరకు వసూలుచేశారు.
జీవోఎంఎస్-10లో నే మరోమాటచెప్పారు.. ఏమిటయ్యా అంటే రెగ్యులరైజేషన్ ఛార్జీలపేరుతో వసూలుచేసే సొమ్ముని ప్రత్యేకఅకౌంట్లలో పెట్టి, ఆయా ప్రాంతాల అభివృద్ధికే ఆ నిధులను ఉపయోగిస్తామనిచెప్పారు. కానీ ఆచరణలో ఇంతవరకు అదిఅమలుకాలేదు. కేంద్రప్రభుత్వం ద్వారా వచ్చిన 15వఆర్థికసంఘం నిధులనే దారిమళ్లించినవారు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ పేరుతో రియల్టర్లనుంచి వసూలుచేసిన సొమ్ముని ప్రజలకోసంఖర్చుపెడతారా?
2020 నుంచి ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ వారినుంచి వసూలుచేసింది చాలక తాజాగా పేదలకోసం అంటూ 5శాతంభూమి లేదా దానికి సరిసమానమైన డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇప్పటివరకు దోచుకున్నది చాలక ఇప్పుడు పేదలముసుగులో వారికి ఇళ్లస్థలాలంటూ ఒకపక్కన, ఓటీఎస్ పేరుతో మరోపక్కన సరికొత్త దోపిడీకి సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి, దివాలా అంచుకుచేర్చిన జగన్ ప్రభుత్వం, పేదలను నెపంగాచూపుతూ, వేలకోట్ల దోపిడీకి పాల్పడుతోంది. ప్రభుత్వం తెస్తున్న అప్పులతోపాటు, ప్రజలనుంచి వసూలు చేస్తున్నసొమ్ము, ఈ విధంగా రియల్టర్లు, కంపెనీలు, పరిశ్రమల నుంచిముక్కుపిండి వసూలు చేస్తున్నసొమ్మంతా ఏంచేస్తున్నారో కూడా తెలియడంలేదు?
ఈ ప్రభుత్వానికి ఆర్థికక్రమశిక్ష ణ అనేది లేదు. కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చిరాష్ట్రఆదాయం పెంచడంచేతగాక, ప్రజలపై పన్నులు వేయడం, ఇసుక, మద్యంఅమ్మకాలపై వచ్చేదాన్నికాజేయడం, రియల్టర్లు, ఇతరత్రా రంగాలనుంచి అందిన కాడికి వసూలుచేయడం వంటివి చేస్తూ, యథేచ్ఛగా దోపిడీ చేస్తూ, ప్రజలను పీక్కుతింటున్నారు. కేవలం ఈ ప్రభుత్వం 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఆదాయార్జనే లక్ష్యంగా మందుకు సాగుతోంది. ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలకు నమ్మకంపోయింది. కాంట్రాక్టర్లు కూడా రోడ్లు వేయడానికి, ఇతరత్రా అభివృద్ధిపనులుచేయడా నికి ముందుకురానిదుస్థితి.
తాజాగా రియల్ ఎస్టేట్ వారినుంచి అయినకాడికి దండుకోవడాని కి సిద్ధమయ్యారు. నిజంగా ఈప్రభుత్వం పేదలకోసం పనిచేస్తే, నేరుగా వారికే సాయం అందేలా చేయాలి గానీ, పిచ్చిపిచ్చి విధానాలతో వారినుంచి వసూలుచేయడం ఏమిటి? ఎప్పుడో 1980కి ముందు, తరువాత నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు

రిజిస్ట్రేషన్లు ఏమిటి? వాటిపేరుతో ఇంటికి రూ.10వేలచొప్పున కట్టాలని బెదిరించడం ఏమిటి? ఇళ్లు అమ్ముకోవచ్చు…కావాలంటే బ్యాంకుల్లో తనఖాపెట్టుకోవచ్చని చెబుతున్నారు. పేదలఇళ్లను వారుఅమ్ముకోవాలని,రోడ్డునపడాలన్నదే ప్రభుత్వఉద్దేశమా? ఓటీఎస్ అనేది ముమ్మాటికీ ప్రజలను రోడ్లపాలుచేయడానికే ప్రభుత్వం తీసుకొచ్చింది అనడంలో ఎలాంటిసందేహం లేదు.
కాయకష్టంచేసుకొని జీవించేకార్మికులనుంచి మద్యం అమ్మకాల పేరుతో క్వార్టర్ కు రూ.200వరకు వసూలుచేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ రూపంలో దేశంలోని మిగతారాష్ట్రాలకంటే లీటర్ కు రూ.10వరకు అదనంగా వసూలుచేస్తున్నారు. మద్యంరూపంలోవారికష్టార్జితాన్ని దోచుకుంటున్నది చాలక, మరలా ఇళ్లపేరుతో రూ.10వేలుకట్టండి అంటేఎలా? టీడీపీవారు ఉచితంగా ఇళ్లుఅప్పగిస్తామనిచెబుతుంటే, ఆపార్టీని నమ్మొద్దంటూ మంత్రులు, అధికార పార్టీఎమ్మెల్యేలు పిచ్చికూతలు కూయడం? టీడీపీని నమ్మొద్దని చెప్పేవాళ్లు, ఇప్పుడే పేదలఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్లు చేయొచ్చుకదా?
రాత్రింబవళ్లు పేదలను దోచుకుంటున్నమీరు, టీడీపీని, ఆపార్టీ నేతలను నమ్మొద్దుఅంటున్న మిమ్మల్ని ప్రజలు నమ్మాలా? జగనన్న శాశ్వతగృహ హక్కు పేరుతో గతంలో ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలుచేస్తున్న మీరు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లను మీపార్టీ రంగులతో ముద్ర్రించి, వాటిపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తారా? ఎక్కడైనా దేశంలో ఇలాంటివి చూశామా? ప్రభుత్వం ఇవ్వనిఇంటికి, పేదలనుంచి డబ్బులువసూలుచేసి, నాన్ జ్యుడీషి యల్ పేపర్ పై రిజిస్ట్రేషన్లు ఎలాచేస్తారు. అదికూడా గ్రామసచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేస్తారా? అసలు మీరుచెప్పేది, చేసేదిఏదైనా చట్టబద్ధమేనా?
ఈ విధంగా ప్రజలనునమ్మించి ఎంతకాలం మోసగిద్దామనుకుంటున్నారు? ఇప్పుడు ఏంచెప్పినా ప్రజలునమ్ముతారు.. తరువాత మేంచేస్తామంటే టీడీపీవారు అడ్డుకున్నారని చెప్పి పబ్బంగడుపుకోవాలని చూస్తు న్నారు. 4, 5ఏళ్ల తర్వాత పేదలఇళ్లకు శాశ్వతగృహహక్కుకల్పించామని, అందుకు సాక్ష్యం జగన్ ఫోటోతో వేసిన స్టాంప్ పేపర్లనిచెప్పి నమ్మించాలన్నదే ఈప్రభుత్వ ఉద్దేశంలా కనిపి స్తోంది. ఇలాంటి చావుతెలివితేటలకు ఈ ప్రభుత్వం ఎంతత్వరగా స్వస్తిపలికితే అంతమంచిది. టీడీపీప్రభుత్వం వచ్చాక కచ్చితంగా రూపాయికూడా లేకుండాఇళ్లునిర్మించుకున్న, గతప్రభుత్వాలహయాంలో నిర్మితమైన పేదలఇళ్లకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తోంది.
ఎన్నోఏళ్లనుంచి కష్టాలుపడుతూ, తిన్నాతినకపోయినా మీఇళ్లలో మీరుంటున్న ప్రతి మహిళాకూడా దీనిపై ఆలోచించాలి. ప్రభుత్వం ఇళ్లరిజిస్ట్రేషన్ల పేరుతో లోన్లుఇప్పిస్తామని, బ్యాంకురుణాలు పొందవచ్చని ఆశచూపి, మిమ్మల్ని లొంగదీసుకుంటే, తరువాత మీ పిల్లల తోసహా మీరురోడ్డునపడతారని మనవిచేస్తున్నా. తాగుడుకు అలవాటుపడిన మీ భర్తలతో ఇప్పటికే మీరు నానా అగచాట్లు పడుతున్న అక్కలు, అమ్మలు, చెల్లెమ్మల్లారా, దయచేసి ప్రభుత్వఉచ్చులో పడకండి. ప్రభుత్వం ఏంచేసినా తనఖజానా నింపుకోవడానికి, తనపార్టీ వారిని బాగుచేయడానికే చేస్తోందితప్ప, పేదలకోసం ఏమీచేయడంలేదని గ్రహించండి.
మద్యం అమ్మకాలను ఇంకా పెంచుకోవడానికే ఈ ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చిం ది అని స్పష్టంచేస్తున్నాం. రాష్ట్రంలోఉన్న యువత, విద్యావంతులు, మేథావులు, ఉద్యోగులు కులం, మతం, ప్రాంతం అనికాకుండా, ఇప్పటికైనా ఈప్రభుత్వతీరుపై ఆలోచనచేయాలి. ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా ప్రజలనుంచి వసూళ్లుచేయడానికి పరిమితమవుతోంది తప్ప, ఎలాంటి ఆదాయం వచ్చే మార్గాలగురించి ఆలోచించడంలేదని ప్రతిఒక్కరూ గమనిం చాలి. రాష్ట్రం బాగుంటేనే అందరం బాగుంటామనే వాస్తవాన్ని గ్రహించాలని ప్రతిఒక్కరికీ మనవి చేస్తున్నా.

LEAVE A RESPONSE