– వారం రోజుల పాటు శ్రమించి మంత్రి కొండా సురేఖ, మనవరాలు శ్రేష్ట పటేల్ పెన్సిల్ ఆర్ట్
‘కొండ’0త అభిమానాన్ని చిత్రంగా మలిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ‘కొండా’ కుటుంబం పై తన గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని పెన్సిల్ ఆర్ట్ ద్వారా అద్భుతంగా మలిచి మంత్రి కొండా సురేఖకు బహుమానంగా అందించారు మెదక్ చిత్ర కళాకారుడు డేనియల్. అహరహం జనానికి అండగా నిలిచే కొండా కుటుంబం పై చిత్రకళారూపంలో తన అభిమానాన్ని ఇలా ప్రదర్శిస్తూ మురిసిపోతుంటాడు. తాజాగా వారం రోజుల పాటు శ్రమించి మంత్రి కొండా సురేఖ, వారి మనవరాలు శ్రేష్ట పటేల్ చిత్రాలను పెన్సిల్ తో అద్భుతంగా గీసి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు డేనియల్. ప్రజలు, కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకునే కొండా దంపతుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలకు ప్రతిరూపమే ఈ అపురూప చిత్రాలు అంటాడు డేనియల్.