– తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తరఫున ఆయన కుమారుడు భారతరత్న అందుకున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘ప్రతి భారతీయుడూ, పీవీ నరసింహా రావు దేశానికి అందించిన సేవలను గుర్తుంచుకుంటాడు. ఆయనకు భారతరత్న లభించడం గర్వంగా భావిస్తాడు. ఆయన మన దేశ పురోగతినీ, ఆధునీకరణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి విస్తృతంగా కృషి చేశారు. ఆయన ఎంతో విద్వత్తు గల పండితుడు, భావుకుడు’ అని తెలుగులో ట్వీట్ చేశారు.