Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు

-జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు
– శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరీకీ శుభాలు కలగాలని నేతల ఆకాంక్ష
– టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా ఉడాది వేడుకలు

శుభకృత నామ సంవత్సరంలో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని టీడీపీ నేతలు కాంక్షించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఆధ్వర్యంలో పూజా కార్యకమాలు నిర్వహించారు.

ఈ సంధర్బంగా పి.అశోక్ బాబు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో పెరిగిన నిత్యవసర ధరలతో పేద ప్రజలు పండుగ చేసుకునే స్ధితిలో లేరు. జగన్ రెడ్డి నిత్యవసర ధరలు పెంచి నిత్యం కూలి, నాలీ చేసుకుని కష్టపడి జీవించే పేద, మద్యతరగతి ప్రజలను హింసిస్తున్నారు. ఉప్పు, పప్పు నుండి ఉల్లిగడ్డల వరకు ధరలు ఆకాశంలో నక్షత్రాల సరసన చేరాయి.

పెరిగిన ధరలతో సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతోంది. గతంలో రూ. 200 ఉన్న విద్యుత్ చార్జీలు నేడు రూ. 800 కి , నాడు రూ. 76 ఉన్న లీటర్ పెట్రోల్ ధర నేడు రూ. 117 కి, నాడు రూ. 726 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ. 1050కి పెరిగిపోయాయి. ఈ విధంగా జగన్ రెడ్డి నిత్యసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీక్కుతింటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు, ఎన్నారై సెల్ చప్పిడి రాజశేఖర్, హెచ్ ఆర్డి మెంబర్ ఎస్పీ సాహెబ్, మరియు పార్టీ కార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, దామోదర్, హర్ష, శర్మ, ఖుర్షీద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE