Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధం

– ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి: రాబోయే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతోంది, జగన్ కి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక మిగిలింది 40రోజులు మాత్రమేనని మాజీమంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… నిరుద్యోగంతో యువత, ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజల ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలకు తమ సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే… ఆయనను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని జనం చెబుతున్నారు…గడిచిన ఐదేళ్లలో జగన్ కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, చెప్పుకోదగ్గ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. దేశంలో ఎక్కడా లేనివిధంగా పన్నుల భారం మోపుతూ జగన్ ప్రజల రక్తాన్ని జలగలా పీల్చేచేస్తున్నాడు. త్వరలోనే ఈ సైకోని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం-జనసేన కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కన్నా కోరారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి కన్నా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ -6 పథకాలపై కరపత్రాలు పంచి, సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు అత్తోట వెంకట కృష్ణారావు, కొత్త తోట ఈశ్వరరావు, పాతూరు అయోధ్య రామారావు, గరికపాటి వెంకటేశ్వర్లు, వస్తాల కోటేశ్వరరావు, కంభంపాటి రమేష్, షేక్ సైదులు, చిలక సాంబశివరావు, జనసేన నాయకులు సిరిగిరి శ్రీనివాసరావు, సిరిగిరి పవన్. వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

సత్తెనపల్లిలో బాలయోగి వర్థంతి

లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత జిఎంసి బాలయోగి వర్థంతిని సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దివంగత బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నా మాట్లాడుతూ.. దళిత బాంధవుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు, తొలి దళిత స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి రాష్ట్రాభివృద్ధికి విశేష సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, పట్టణ నాయకులు, దళిత, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE